థియేటర్ ఓటీటీలో సినిమాల జాతర.. ఆ ఒక్క రోజే 16 చిత్రాలు.. మొత్తంగా ఎన్నో తెలిస్తే!

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాల సందడి కొనసాగుతోంది. మొన్నటి వరకు పెద్ద సినిమాలు వరుసగా విడుదలయ్యాయి. అయితే సంక్రాంతి తర్వాత నుంచి పెద్ద సినిమాలు రిలీజ్ కావట్లేదు. విద్యార్థుల పరీక్షలు, సమ్మర్ హాలీడేస్ ఇలా దృష్టిలో పెట్టుకుని పెద్ద సినిమాలన్నీ వేసవిలో విడుదలయ్యేందుకు రెడీగా ఉన్నాయి.

ఇక ఈ గ్యాప్ లో చిన్న సినిమాలను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. కంటెంట్ బాగుంటే చిన్న సినిమాలను కూడా పెద్ద హిట్ చేస్తారని బలగం మూవీ మరోసారి నిరూపించింది. దీంతో ఇప్పుడు మార్చి రెండోవారం అటు థియేటర్, ఇటు ఓటీటీల్లో అలరించేందుకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, సిరీస్ లపై ఓ లుక్కేస్తే..

సి.ఎస్.ఐ సనాతన్

సి.ఎస్.ఐ సనాతన్

టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ వరుస పెట్టి సినిమాలను విడుదల చేస్తున్నాడు. అయితే అవి ఆశించిన స్థాయిలో హిట్ కొట్టట్లేదు. ఇటీవలే పులి-మేక అనే వెబ్ సిరీస్ తో ఓటీటీ ఎంట్రీ ఇచ్చిన ఆది సాయి కుమార్ తాజాగా సి.ఎస్.ఐ సనాతన్ సినిమాతో థియేటర్లలోకి రానున్నాడు. మిషా నారంగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు శివశంకర్ దేవ్ దర్శకత్వం వహించారు. మిస్టరీ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా మార్చి 10న థియేటర్లో విడుదల కానుంది.

ట్యాక్సీ

ట్యాక్సీ

వసంత్ సమీర్ పిన్నమరాజు, ఆల్మాస్ మోటివాలా, సూర్య శ్రీనివాస్, సౌమ్య మీనన్ పాత్రధారులుగా నటించిన సినిమా ట్యాక్సీ. ఈ చిత్రానికి హరీష్ సజ్జా దర్శకత్వం వహించగా.. హరిత సజ్జా నిర్మించారు. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా తరెకక్కిన ఈ సినిమా ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఆవిష్కరించారు. ఈ సినిమా కూడా మార్చి 10న ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది.

వాడు ఎవడు-నేడే విడుదల-65

వాడు ఎవడు-నేడే విడుదల-65

ఈవారం విడుదల కానున్న మరో సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం వాడు ఎవడు. కార్తికేయ, అఖిల నాయర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి ఎన్ శ్రీనివాస రావు దర్శకత్వం వహించారు. పలు యదార్థ సంఘనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 10న విడుదల కానుంది. దీంతోపాటు రామ్ రెడ్డి పన్నాల దర్శకత్వంలో ఆసీఫ్ ఖాన్, మౌర్యాని హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన 'నేడే విడుదల' సినిమా కూడా మార్చి 10న విడుదల చేయనున్నారు. అలాగే '65' అనే హాలీవుడ్ మూవీని మార్చి 17న రిలీజ్ చేయనున్నారు.

రానా నాయుడు

రానా నాయుడు

ఫ్యామిలీ హీరో దగ్గుబాటి వెంకటేష్ చేత మొదటిసారిగా బూతులు మాట్లాడించిన వెబ్ సిరీస్ రానా నాయుడు. ఈ వెబ్ సిరీస్ తో వెంకటేష్ తోపాటు దగ్గుబాటి రానా డిజిటల్ తెరపై ఎంట్రీ ఇస్తున్నారు. రే డోనోవాన్ టీవీ సిరీస్ ఆధారంగా తెరకెక్కిన రానా నాయుడు వెబ్ సిరీస్ ను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో తీసుకువస్తున్నారు. భారీ అంచనాలు నెలకొన్న ఈ సిరీస్ ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ నిర్మిస్తుండగా అదే వేదికపై మార్చి 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

యాంగర్ టేల్స్

యాంగర్ టేల్స్

తనదైనట నటనతో విభిన్న పాత్రలు చేసుకుంటూ అలరిస్తున్నాడు సుహాస్. హిట్ 2లో మంచి నటనను కనబర్చిన సుహాస్ రైటర్ పద్మభూషణ్ సినిమాతో హిట్ కొట్టాడు. ఇప్పుడు తాజాగా మరోసారి నేరుగా ఓటీటీ ప్రేక్షకులను అలరించనున్నాడు. సుహాస్, బింధు మాధవి, మడోన్నా సెబాస్టియన్ తదితరులు నటించిన వెబ్ సిరీస్ యాంగర్ టేల్స్. తిలక్ ప్రభల దర్శకత్వం ఈ సిరీస్ నలుగురు వారు జీవితంలో పడే సంఘర్షణ ఎలా ఉంటుందన్న అంశంపై రూపొందించారు. ఇది మార్చి 9 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

రేఖ-నెట్ ఫ్లిక్స్-మార్చి 10 (మలయాళం)

రేఖ-నెట్ ఫ్లిక్స్-మార్చి 10 (మలయాళం)

ది గ్లోరి సీజన్ 2-నెట్ ఫ్లిక్స్-మార్చి 10 (వెబ్ సిరీస్)

చాంగ్ కెన్ డంక్-డిస్నీ ప్లస్ హాట్ స్టార్-మార్చి 10
రన్ బేబీ రన్-డిస్నీ ప్లస్ హాట్ స్టార్-మార్చి 10

రామ్ యో-జీ5-మార్చి 10 (కన్నడ)
బొమ్మై నాయగి-జీ5-మార్చి 10 (తమిళం)
బౌడీ క్యాంటీన్-జీ5-మార్చి 10 (బంగ్లా)

యాక్సిడెంటల్ ఫార్మర్ అండ్ కో-సోనీ లివ్-మార్చి 10 (తమిళ సిరీస్)
క్రిస్టీ-సోనీ లివ్-మార్చి 10 (మలయాళం-మాళవిక మోహనన్)
బ్యాడ్ ట్రిప్-సోనీ లివ్-మార్చి 10 (తెలుగు)
హ్యాపీ ఫ్యామిలీ: కండిషన్స్ అప్లయ్-అమెజాన్ ప్రైమ్ వీడియో-మార్చి 10 (హిందీ సిరీస్)

ఓటీటీలో-థియేటర్లో ఎన్నంటే..

కేవలం మార్చి 10న అంటే శుక్రవారం రోజున 16 సినిమాలు ఇటు థియేటర్, అటు ఓటీటీల్లో విడుదల కానున్నాయి. కేవలం మార్చి 10న ఓటీటీలో 13 సినిమాలు, సిరీస్ లు రిలీజ్ కు సిద్ధంగా ఉండగా.. థియేటర్ లో అదే రోజున 4 చిత్రాలు సందడి చేయనున్నాయి. ఇక మొత్తంగా అన్ని కలిపి మార్చి రెండో వారం 18 సినిమాలు, వెబ్ సిరీస్ లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X