థియేటర్ ఓటీటీలో సినిమాల జాతర.. ఆ ఒక్క రోజే 7 చిత్రాలు.. మొత్తంగా ఎన్నో తెలిస్తే?

మూవీ లవర్స్ కు ఏకైక ఎంటర్టైన్ మెంట్ సినిమాలు. అందుకే థియేటర్లలో, ఓటీటీల్లో ప్రతీ వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీసులు సందడి చేస్తూనే ఉంటాయి. థియేటర్లలలో చిన్న పెద్దా అని తేడా లేకుండా కొత్త సినిమాలు విడుదలకు రెడీగా ఉంటే.. ఓటీటీల్లో బాక్సాఫీస్ వద్ద హిట్ అయినా ఫట్టు అయినా చిత్రాలతోపాటు కొన్నింటిని నేరుగా రిలీజ్ అవుతున్నాయి.

అలాగే ఈ డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లలో భాషా బేధం లేకుండా సినిమాలు, వెబ్ సిరీస్ లు అలరిస్తుంటాయి. ఇక ఈ వారం అంటే మే మొదటి వారం థియేటర్లలో, ఓటీటీల్లో విడుదల అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏంటో ఓ లుక్కేద్దాం.

 ottplatforms

రామబాణం

మ్యాచో హీరో గోపీచంద్-శ్రీవాస్ కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రం రామబాణం (Rama Banam). నటిసింహం బాలకృష్ణ సజ్జెస్ట్ చేసిన టైటిల్ తో వస్తున్న ఈ సినిమాకు మంచి బజ్ ఏర్పడింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు. ఇందులో డింపుల్ హయాతి హీరోయిన్ గా చేస్తే.. సీనియర్ హీరో జగపతి బాబు కీలక పాత్ర పోషించారు. ఇక ఈ సినిమా మే 5న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ramabanam-

ఉగ్రం

నాంది వంటి సూపర్ హిట్ ఇచ్చిన విజయ్ కనకమేడల దర్శకత్వంలో మరోసారి అల్లరి నరేష్ నటించిన చిత్రమే ఉగ్రం (Ugram 2023). ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్ లో సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. ఇందులో నరేష్ కు జోడీగా మిర్నా మీనన్ హీరోయిన్ గా నటించింది. కిడ్నాప్ వంటి క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో వచ్చిన ఈ సినిమాలో నరేష్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఆకట్టుకోనున్నాడు. ఈ చిత్రం కూడా మే 5న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది.

 ugram

మీటర్

వినరో భాగ్యము విష్ణు కథ సినిమా తర్వాత వెంటనే కిరణ్ అబ్బవరం హీరోగా చేసిన సినిమా మీటర్. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు సంయుక్తంగా నిర్మించారు. రమేష్ కోడూరి అనే డైరెక్టర్ పరిచయం కాగా అతుల్య రవి హీరోయిన్ గా చేసింది. ఏప్రిల్ 7 శుక్రవారం విడుదలైన ఈ సినిమా మే 5 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

 meter

నెట్ ఫ్లిక్స్

ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో బాలీవుడ్ హీరో రణ్ బీర్, శ్రద్ధా కపూర్ జోడీ కట్టిన 'తు ఝూఠీ మే మక్కర్' (Tu Jhoothi Main Makkaar) మూవీ మే 5న రిలీజ్ కానుంది. 'క్వీన్ చార్లెట్: ఏ బ్రిడ్జర్టన్ స్టోరీ' (Queen Charlotte: A Bridgerton Story) సిరీస్ మే 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 'జెవిష్ మ్యాచ్ మేకింగ్' (Jewish Matchmaiking) హాలీవుడ్ మూవీ మే 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 'లవ్ విలేజ్' (Love Village) జపనీస్ సిరీస్ మే 2న విడుదల కానుంది. 'ది టైలర్' (The Tailor) సిరీస్ మే 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

 netflix

డిస్నీ ప్లస్ హాట్ స్టార్

రెనర్వేషన్స్ (Rennervations)- మే 3
స్టార్ వార్స్ విజన్స్ (Star Wars: Visions)- మే 5 (వెబ్ సిరీస్ సీజన్ 2)
కరోనా పేపర్స్ (Corona Papers)- మే 5 (మలయాళం మూవీ)
సాస్ బహు ఔర్ ఫ్లెమింగో (Saas, Bahu Aur Flamingo)- మే 5 (హిందీ వెబ్ సిరీస్)

 disney-plus-hotstar-

మొత్తంగా ఎన్నంటే?

ఇలా మే మొదటి వారంలో కేవలం మే 5న అంటే శుక్రవారం రోజున ఏకంగా 7 సినిమాలు, వెబ్ సిరీసులు విడుదల కానున్నాయి. అలాగే మే 5న థియేటర్లలో రెండు తెలుగు సినిమాలు, ఓటీటీల్లో 10 చిత్రాలు రీలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఈ వారం మొత్తంగా 12 సినిమాలు, సిరీసులు విడుదలకు రెడీగా ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X