థియేటర్ ఓటీటీలో మూవీ ఫెస్టివల్.. ఒక్కరోజే ఏకంగా 19 చిత్రాలు.. మొత్తంగా ఎన్నో తెలిస్తే?

ప్రతివారం కొత్త కొత్త సినిమాలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు అటు బాక్సాఫీస్ వద్ద.. ఇటు ఓటీటీలలో పలకరిస్తుంటాయి. ఒక్కొసారి పెద్ద సినిమాలే పోటీగా వస్తే.. మరోసారి చిన్న సినిమాలు సత్తా చాటేందుకు సిద్దమవుతాయి.

గత వారం అయితే రామబాణం, ఉగ్రం, ది కేరళ స్టోరీ, గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 3 సినిమాలతో థియేటర్లలో సందడి నెలకొనగా కొన్ని వెబ్ సిరీసులు, చిత్రాలతో డిజిటల్ ప్లాట్ ఫామ్స్ పై అలరించాయి. ఇప్పుడు మే రెండో వారంలో థియేటర్, ఓటీటీలో వచ్చే సినిమాలు, వెబ్ సిరీసులు ఏంటో ఓ లుక్కేద్దాం.

List Of OTT And Theatres Movies Web Series Released On May 2nd Week 2023

కస్టడీ: నాగ చైతన్య నటించిన బైలింగువల్ చిత్రం 'కస్టడీ'. మొదటిసారిగా చైతూ పోలీస్ ఆఫీసర్ గా చేసిన ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. చైతూకి ఇది తొలి తమిళ స్ట్రెయిట్ సినిమా. ఇందులో హీరోయిన్ గా కృతీ శెట్టి అలరించనుండగా.. అరవింద్ స్వామి, శరత్ కుమార్, ప్రియమణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా మే 12న థియేటర్లలో విడుదల కానుంది.

List Of OTT And Theatres Movies Web Series Released On May 2nd Week 2023

ఛత్రపతి: అగ్ర నిర్మాత కుమారుడిగా తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. 'రాక్షసుడు' సినిమా తర్వాత సాయి శ్రీనివాస్ నేరుగా హిందీలో చేసిన సినిమా 'ఛత్రపతి'. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. దీనిని వివి వినాయక్ డైరెక్ట్ చేయగా.. నుష్రత్ భరుచా హీరోయిన్ గా చేసింది. ఈ మూవీ కూడా మే 12న బాక్సాఫీస్ వద్ద రిలీజ్ కానుంది.

List Of OTT And Theatres Movies Web Series Released On May 2nd Week 2023

4 సినిమాలు: సీనియర్ హీరోయిన్ శ్రీయ సరన్ నటించిన 'మ్యూజిక్ స్కూల్'. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇళయరాజా, మంత్రి కేటీఆర్ పాల్గొనడంతో హైప్ పెరిగింది. ఈ సినిమా మే 12నే రిలీజ్ కానుంది. ఇక సునీల్, వెన్నెల కిశోర్, శ్రీనివాస రెడ్డి నటించిన 'భువన విజయం' మే 12నే విడుదల కానుంది. ఇవే కాకుండా 'ది స్టోరీ ఆఫ్ బ్యూటిఫుల్ గర్ల్', 'కల్యాణమస్తు' సినిమాలు అదే రోజున విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

List Of OTT And Theatres Movies Web Series Released On May 2nd Week 2023

శాకుంతలం: ఇటీవల ఎక్కువగా లేడీ లేడీ ఒరియెంటెడ్ చిత్రాలు చేస్తున్న సమంత శాకుతంలం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏప్రిల్ 14న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. ప్రముఖ దర్శకుడు గుణ శేఖర్ తెరకెక్కించిన ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వేదికగా మే 12 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు.

List Of OTT And Theatres Movies Web Series Released On May 2nd Week 2023

న్యూసెన్స్: హీరో నవదీప్, ముద్దుగుమ్మ బిందు మాధవి తాజాగా నటించిన వెబ్ సిరీస్ న్యూసెన్స్. ఈ సిరీస్ కు గాయం 2, కాళీ చరణ్ చిత్రాల డైరెక్టర్ ప్రవీణ్ శ్రీ దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ ను ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో మే 12 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు.

నెట్ ఫ్లిక్స్: క్వీన్ క్లియోపాత్ర- మే 10

ఎరినీ-మే 12
ది మదర్- మే 12
క్రాటర్- మే 12
బ్లాక్ నైట్- మే 12
రాయల్ టిన్: ప్రిన్సెస్ మార్గరెట్- మే 12

ఏ సినిమా.. ఎందులో అంటే?: డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 'ది మప్పెట్స్ మే హేట్' (వెబ్ సిరీస్), 'స్వప్న సుందరి' మే 12న విడుదల కానున్నాయి. అమెజాన్ ప్రైమ్ లో సోనాక్షి సిన్హా 'దహాద్' మే 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అదితి రావు హైదరీ నటించిన 'తాజ్: ది రీన్ ఆఫ్ రివేంజ్' (సీజన్ 2) సిరీస్ జీ5లో మే 12న రిలీజ్ కానుంది. హృతిక్ రోషన్-సైఫ్ అలీ ఖాన్ 'విక్రమ్ వేద' (హిందీ) జియో సినిమాలో మే 12నే స్ట్రీమింగ్ కానుంది. 'ట్రయాంగిల్ ఆఫ్ సాడ్‌నెస్' సోనీ లివ్ లో మే 12నే రిలీజ్ కానుంది. ఇక 'ఎస్సాసిన్ క్లబ్' మే 11న బుక్ మై షోలో విడుదలకు సిద్ధంగా ఉంది.

మొత్తంగా ఎన్నంటే?: ఇలా మే 12న 6 సినిమాలు థియేటర్లలో విడుదల కానుండగా.. ఓటీటీలో ఏకంగా 13 రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. మే 12న ఒక్కరోజే థియేటర్, ఓటీటీ కలుపుకుని మొత్తం 19 సినిమాలు, వెబ్ సిరీసులు విడుదలకు రెడీగా ఉన్నాయి. ఇక మే రెండో వారంలో అన్ని కలిపి మొత్తం 21 సినిమాలు, వెబ్ సిరీసులు ఎంటర్టైన్ చేసేందుకు రెడీగా ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X