థియేటర్ ఓటీటీలో సినీ జాతర.. ఆ ఒక్కరోజే 50 చిత్రాలు.. మొత్తంగా ఎన్నో తెలిస్తే?
సినీ ప్రియులకు ఏకైక ఎంటర్టైన్ మెంట్ మూవీస్. అందుకే థియేటర్లలో, ఓటీటీల్లో ప్రతీ వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీసులు సందడి చేస్తూనే ఉంటాయి. థియేటర్లలలో చిన్న పెద్దా అని తేడా లేకుండా కొత్త సినిమాలు విడుదలకు రెడీగా ఉంటే.. ఓటీటీల్లో బాక్సాఫీస్ వద్ద హిట్ అయినా ఫట్టు అయినా చిత్రాలతోపాటు కొన్నింటిని నేరుగా రిలీజ్ అవుతున్నాయి. అలాగే ఈ డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లలో భాషా బేధం లేకుండా సినిమాలు, వెబ్ సిరీస్ లు అలరిస్తుంటాయి. ఇక ఈ వారం అంటే మే మూడో వారం థియేటర్లలో, ఓటీటీల్లో విడుదల అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏంటో ఓ లుక్కేద్దాం.
మళ్లీ పెళ్లి:నటుడు వీకే నరేష్-పవిత్రా లోకేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం మళ్లీ పెళ్లి (Malli Pelli). ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగు, కన్నడ రెండు భాషల్లో రూపొందించారు. నరేష్ తల్లి విజయ నిర్మల స్థాపించిన విజయకృష్ణ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. నరేష్-పవిత్ర నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను మే 26న రిలీజ్ కానుంది.

మేము ఫేమస్: సుమంత్ ప్రభాస్హీరోగా నటిస్తూ తెరకెక్కించిన మూవీ మేము ఫేమస్. ఛాయ్ బిస్కెట్, లహరి ఫిలింస్ బ్యానర్ పై శరత్ చంద్ర, అనురాగ్ రెడ్డి, చంద్రు మనోహర్ సంయుక్తంగా నిర్మించారు. 30 మంది కొత్త నటీనటులతో మేము ఫేమస్ రూపొందించారు. ఈ సినిమా కూడా మే 26నే విడుదల కానుంది.
#మెన్ టూ: మత్తు వదలరా, సేనాపతి ఫేమ్ నరేష్ అగస్త్య నటించిన తాజా చిత్రం '#మెన్ టూ' (#MenToo). ఇందులో హీరోయిన్ గా మజ్ను, పేపర్ బాయ్, టాప్ గేర్ ఫేమ్ రియా సుమన్ చేసింది. లాన్ థ్రేన్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై మ1ర్య సిద్ధవరం నిర్మించిన ఈ మూవీకి శ్రీకాంత్ జి రెడ్డి దర్శకత్వం వహించారు. ఇది ఈ నెల 26న రిలీజ్ కు సిద్ధంగా ఉంది.
2018: మలయాళ హీరో టోవినో థామస్ నటించిన చిత్రం 2018. జూడే ఆంథోని జోసేఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కేరళలో వచ్చిన భారీ వరదల ఆధారంగా తెరకెక్కింది. ఇప్పటికే కేరళలో విడుదలై ఘన విజయం సాధించిన ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. మే 26న ఈ మూవీ తెలుగులో ప్రదర్శించబడనుంది.
థియేటర్లలో మొత్తంగా: ఈ చిత్రాలే కాకుండా మే 26న వెల్ కమ్ పూర్ణిమా, టీ, ది లిటిల్ మెర్మెయిడ్, బా ఈజ్ అఫ్రైడ్, మిస్సింగ్ గర్ల్, జోగిరా సరా రా రా, గెట్ టుగెదర్, రావ్ రంభ, ఆజమ్, జై శ్రీ క్రిష్, సిరెన్, ఏలియన్స్ 2042, గాడ్ డే గాడ్ డే చా, ఎబౌట్ మై ఫాదర్, 6/45 ఇలా అన్ని కలుపుకుని థియేటర్లలో 41 చిత్రాలు విడుదలకు రెడీగా ఉన్నాయి.

ఓటీటీలో:
గీతా సుబ్రహ్మణ్యం 3- మే 23-ఆహా (తమిళ వెబ్ సిరీస్)
సత్తిగాని రెండెకరాలు- మే 26-ఆహా (తెలుగు సినిమా)
మిస్సింగ్- మే 24- అమెజాన్ ప్రైమ్ వీడియో (ఇంగ్లీష్ మూవీ)
సిటాడెల్- మే 26- అమెజాన్ ప్రైమ్ వీడియో (ఫైనల్ ఎపిసోడ్)
సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై- మే 23- జీ5 (హిందీ మూవీ)
కిసీ కా బాయ్ కిసీ కీ జాన్- మే 26- జీ5 (హిందీ మూవీ)
అమెరికన్ బార్న్ చైనీస్- మే 24- డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (ఇంగ్లీష్ చిత్రం)
సిటీ ఆఫ్ డ్రీమ్స్- మే 26- డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (సీజన్ 3)
ప్రిజనర్ ఆఫ్ ది ప్రొఫెట్- మే 25- డిస్కవరీ ప్లస్ (ఇంగ్లీష్ సిరీస్)
కేండ్రా సెల్స్ హాలీవుడ్ సీజన్ 2- మే 26- డిస్కవరీ ప్లస్ (ఇంగ్లీష్ సిరీస్)

నెట్‌ఫ్లిక్స్:
ది క్రియేచర్ కేసెస్ సీజన్ 3- మే 22 (ఇంగ్లీష్ సిరీస్)
విక్టిమ్/సస్పెక్ట్- మే 23 (ఇంగ్లీష్ మూవీ)
హార్డ్ ఫీలింగ్స్- మే 24 (జర్మన్ సినిమా)
ఫ్యూబర్- మే 25 (ఇంగ్లీష్ సిరీస్)
దసరా- మే 25 (హిందీ వెర్షన్)
బ్లడ్ అండ్ గోల్డ్- మే 26(ఇంగ్లీష్ సినిమా)
ది ఇయర్ ఐ స్టార్టెడ్ మాస్ట్రబేటింగ్- మే 26 (డానిష్ మూవీ)
టిన్ అండ్ టీనా- మే 26 (స్పానిష్ మూవీ)

జియో సినిమా
బేవఫా సనమ్- మే 24 (భోజ్ పురి మూవీ)
క్రాక్ డౌన్ సీజన్ 2- మే 25 (హిందీ సిరీస్)
బేడియా- మే 26- (తెలుగు డబ్బింగ్ మూవీ)
మొత్తంగా ఎన్ని అంటే?
ఇలా ఓటీటీలో మే 26 ఒక్కరోజునే 9 చిత్రాలు, వెబ్ సిరీసులు రిలీజ్ కానున్నాయి. అంటే థియేటర్, ఓటీటీ కలిపి మే 26న 50 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక థియేటర్, ఓటీటీలో మే మూడో వారంలో మొత్తంగా 62 సినిమాలు, సిరీసులు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.


Click it and Unblock the Notifications











