OTT: ఓటీటీలో ఫ్రైడే ఫెస్టివల్.. ఒక్కరోజే 14 సినిమాలు, మొత్తంగా ఎన్ని అంటే?

కరోనా పాండమిక్, లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూతపడ్డాయి. దీంతో ఓటీటీల హవా పెరిగిపోయింది. విభిన్నమైన జోనర్లలో సినిమాలు, సిరీస్ లను తీసుకు రావడంతో ప్రేక్షకులకు, సినీ లవర్స్ కు మంచి టైమ్ పాస్ ఏర్పడింది. దీంతో సిని ప్రియుల అభిరుచి కూడా మారింది. ఇక వాళ్ల అభిరుచికి తగినట్లుగా సొంతంగా సినిమాలను నిర్మించాయి ఓటీటీ సంస్థలు. అయితే తర్వాత కరోనా తగ్గడం, థియేటర్లు ఓపెన్ అయ్యాక కూడా ఓటీటీలో చిత్రాలను రిలీజ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఫిబ్రవరి వీకెండ్ కు మరికొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు సందడి చేసేందుకు రెడీగా ఉన్నాయి.

ఫర్జీ..

ఫర్జీ..

టాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్ నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ఫర్జీ. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించిన రాజ్ అండ్ డీకే ఫర్జీని డైరెక్ట్ చేశారు. ఈ వెబ్ సిరీస్ లో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ అండ్ కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అయితే విజయ్ సేతుపతి, షాహిద్ కపూర్ ఈ వెబ్ సిరీస్ తో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఫిబ్రవరి 10న విడుదల కానుంది.

హంట్..

హంట్..

నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా హంట్. రిపబ్లిక్ డే కానుకంగా జనవరి 26న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం పదిహేను రోజుల్లోనే ఓటీటీలోకి రానుంది. ప్రయోగాత్మక కథాంశంతో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాను ఫిబ్రవరి 10న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానుంది. ఈ మూవీలో సీనియర్ హీరో శ్రీకాంత్, ప్రేమిస్తే భరత్ మరో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి మహేశ్ దర్శకత్వం వహించారు.

 వేద..

వేద..

కన్నడ అగ్ర హీరో శివరాజ్ కుమార్ నటించిన 125వ సినిమా వేద. రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీకి హరి దర్శకత్వం వహించారు. ఈ మూవీ తెలుగులో ఇదే టైటిల్ తో గురువారం అంటే ఫిబ్రవరి 9న థియేటర్లలో విడుదలైంది. కేవలం ఒక్క రోజు గ్యాప్ లోనే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ప్రముఖ ఓటీటీ జీ5లో ఫిబ్రవరి 10న శివరాజ్ కుమార్ వేద చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నారు.

హన్సిక

హన్సిక "లవ్ షాదీ డ్రామా"..

మొదటి సినిమాతోనే తెలుగులో సూపర్ పాపులర్ అయిన హీరోయిన్లలో హన్సిక ఒకరు. దేశముదురు, కంత్రి, బిల్లా, మస్కా, కందిరీగ, పవర్, తెనాలి రామకృష్ణ వంటి సినిమాల్లో ఆకట్టుకుంది. ఇటీవల డిసెంబర్ 4, 2022న సోహైల్ కతురియా అనే వ్యాపారవేత్తను పెళ్లాడి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. హన్సిక పెళ్లి వీడియో స్ట్రీమింగ్ రైట్స్ ను భారీ ధరకు చేజిక్కించుకున్న డిస్నీ ప్లస్ హాట్ స్టార్.. "లవ్ షాదీ డ్రామా" పేరుతో ఫిబ్రవరి 10న విడుదల చేయనుంది.

నిజం విత్ స్మిత..

నిజం విత్ స్మిత..

సుమారు 15 ఏళ్ల నుంచి తెలుగులో అనేక టాక్ షోలు సందడి చేశాయి. ఈ క్రమంలోనే ఇండియన్ పాప్ సింగర్, నటిగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న స్మిత హోస్ట్ గా మారిన టాక్ షో "నిజం విత్ స్మిత". ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ లో ఫిబ్రవరి 10 నుంచి ఈ టాక్ షో స్ట్రీమింగ్ కానుంది. ఈ టాక్ షోకి సంబంధించిన అన్ని ఎపిసోడ్స్ షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ టాక్ షోలో మొదటి గెస్టుగా మెగాస్టార్ చిరంజీవి కనిపించనున్నట్లు తెలుస్తోంది.

అన్ స్టాపబుల్ 2

అన్ స్టాపబుల్ 2

నందమూరి నటసింహం హోస్ట్ గా అదరగొడుతున్న టాక్ షో అన్ స్టాపబుల్. ఎంతో సక్సెస్ ఫుల్ గా నడిచిన అన్ స్టాపబుల్ రెండో సీజన్ నేటితో అంటే ఫిబ్రవరి 9తో ముగియనుంది. అన్ స్టాపబుల్ రెండో సీజన్ పవర్ ఫినాలే ఎపిసోడ్ ను రెండు భాగాలుగా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. మొదటి పార్టును ఫిబ్రవరి 2న విడుదల చేయగా రెండో పార్టును ఫిబ్రవరి 10న రిలీజ్ చేస్తామని తొలుత ప్రకటించారు. కానీ పలు కారణాల వల్ల ఫిబ్రవరి 9న రాత్రి 9 గంటల నుంచి ఆహాలో స్ట్రీమింగ్ చేయనున్నారు.

 నెట్ ఫ్లిక్స్ లో ఎక్కువగా..

నెట్ ఫ్లిక్స్ లో ఎక్కువగా..

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఫిబ్రవరి 9 నుంచి సాయి రోనాక్ "రాజయోంగం", అజిత్ "తునివు" మూవీ నెట్ ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 8 నుంచి స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలాగే "యూ" అనే ఇంగ్లీష్ వెబ్ సిరీస్ నాలుగో సీజన్ మొదటి పార్ట్ (5 ఎపిసోడ్స్) నెట్ ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 9న విడుదలైంది. నెట్ ఫ్లిక్స్ లో "యువర్ ప్లేస్ ఈజ్ మైన్", "10 డేస్ ఆఫ్ ఏ గుడ్ మ్యాన్", "డియర్ డేవిడ్", "లవ్ ఈజ్ బ్లైండ్" సీజన్ 3, "లవ్ టు హేట్ యు" సీజన్ 1 ఫిబ్రవరి 10 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి.

ఫిబ్రవరి 10న ఒక్కరోజే..

ఫిబ్రవరి 10న ఒక్కరోజే..

"సిన్" అనే తమిళ వెబ్ సిరీస్ ఆహాలో, "సలామ్ వెంకీ" హిందీ చిత్రం జీ5లో, "మార్వెల్ స్టూడియోస్ లెజెండ్స్" ఇంగ్లీష్ సిరీస్ సీజన్ 2 హాట్ స్టార్ లో, "మహావీర్యూర్" మలయాళం చిత్రం సన్ ఎన్ఎక్ట్సీలో ఫిబ్రవరి 10న విడుదల కానున్నాయి. ఇలా కేవలం ఫిబ్రవరి 10న ఒక్కరేజో 14 సినిమాలు, సిరీస్ లు విడుదల కానున్నాయి. అలాగే మొత్తంగా 18 ఈ ఫిబ్రవరి సెకండ్ వీకెండ్ లో విడుదలయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X