OTTలో సినిమాల జాతర.. మొత్తంగా 37.. ఆ ఒక్క రోజు మాత్రం 15 రిలీజ్!
కొత్త సంవత్సరం సంక్రాంతి సీజన్ లో చిరంజీవి, బాలకృష్ణ, విజయ్, అజిత్ వంటి స్టార్ హీరోల సినిమాలు సందడి చేశాయి. ఇక రిపబ్లిక్ డే సందర్భంగా షారుక్ ఖాన్ పఠాన్ సినిమా విడుదలైం ఘన విజయం సాధించగా.. హంట్ నిరాశపరిచింది. ఇక గతవారంలో విడుదలైన అమిగోస్ కూడా మిక్స్ డ్ టాక్ తో మందకోడిగా కలెక్షన్స్ రాబడుతోంది. ఇప్పుడు ఫిబ్రవరి మూడో వారం సినిమాలు, వెబ్ సిరీస్ లతో సందడిగా మారనుంది. ఈ వారం అంటే ఫిబ్రవరి 13 నుంచి 18 వరకు ఏకంగా 37 సినిమాలు అలరించేందుకు రెడీ అయ్యాయి. మరి ఆ సినిమాలు, సిరీస్ లు ఏంటో? ఏ ఓటీటీలో? ఎప్పుడు? విడుదల అవుతున్నాయో ఓ లుక్కేద్దామా!

ధనుష్ సార్..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కు తెలుగు రాష్ట్రాల్లో కూడా అభిమానులు ఉన్నారు. అందుకే ఆయన రెగ్యులర్ గా తన సినిమాలను తెలుగులో విడుదల చేస్తుంటారు. అయితే ఈసారి నేరుగా తెలుగు సినిమా చేశారు ధనుష్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా బైలింగువల్ చిత్రంగా వస్తున్న చిత్రం సార్. తెలుగుతోపాటు తమిళంలోనూ తెరకెక్కించిన ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఫిబ్రవరి 17న ప్రేక్షకులు ముందుకు రానుంది.

అల వైకుంఠపురములో రీమేక్ షెహజాదా..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన మూడో చిత్రమే అల వైకుఠపురములో. ఈ సినిమాను హిందీలో హెహజాదా పేరుతో రీమేక్ చేశారు. ఈ మూవీలో బాలీవుడ్ హిట్ హీరో కార్తీక్ ఆర్యన్, బ్యుూటిఫుల్ కృతి సనన్ హీరో హీరోయిన్లుగా నటించారు. రోహిత్ ధావన్ తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 17న విడుదల కానుంది.

యాంట్ మ్యాన్ 3..
హలీవుడ్ సినిమాటిక్ యూనివర్స్ మార్వెల్ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. మార్వెల్ నుంచి ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అని ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా వస్తున్న చిత్రం 'యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్: క్వాంటమేనియా' (Ant-Man and the Wasp: Quantumania, Ant Man 3). పాల్ రూడ్, ఎవాంజెలిన్ లిల్లీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ఫిబ్రవరి 17న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఇండియాలో ప్రదర్శితం కానుంది.

ఫిబ్రవరి 18న రెండు..
వరుస సినిమాలతో ఫుల్ బిజీగా దూసుకుపోతున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఇటీవల నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమాతో ప్రేక్షకులను పలకరించిన కిరణ్ అబ్బవరం తాజాగా నటించిన చిత్రం 'వినరో భాగ్యము విష్ణు కథ'. న్యూ డైరెక్టర్ మురళీ కిశోర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో కాశ్మీరా హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా ఫిబ్రవరి 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతోపాటు జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్, సీనియర్ డైరెక్టర్ రేలంగి నరసింహా రావు తెరకెక్కించిన చిత్రం 'ఊ అంటావా మావ.. ఊ ఊ అంటావా మావ'. ఈ సినిమా కూడా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 18న విడుదల కానుంది.

గాలోడు-కల్యాణం కమనీయం..
సుడిగాలి సుధీర్ నటించిన లేటేస్ట్ సినిమా గాలోడు. బ్యూటిఫుల్ గెహన సిప్పీ హీరోయిన్ గా చేసిన ఈ సినిమాకు రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వం వహించారు. 2022 నవంబర్ 18న విడుదలైన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వస్తుంది. ప్రముఖ ఓటీటీలు అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా వేదికలపై ఫిబ్రవరి 17 నుంచి గాలోడు సినిమా స్ట్రీమింగ్ కానుంది. అలాగే సంతోష్ శోభన్ నటించిన 'కల్యాణం కమనీయం' చిత్రం కూడా ఆహా వేదికగా ఫిబ్రవరి 17న విడుదల కానుంది.

నెట్ ఫ్లిక్స్..
స్క్వైర్డ్ లవ్ ఆల్ ఓవర్ ఎగైన్-హాలీవుడ్ మూవీ-ఫిబ్రవరి 13
ఏ సండే ఎఫైర్-హాలీవుడ్ మూవీ-ఫిబ్రవరి 14
పర్ఫెక్ట్ మ్యాచ్-హాలీవుడ్ వెబ్ సిరీస్-ఫిబ్రవరి 14
ఆల్ ది ప్లేసెస్-స్పానిష్ మూవీ-ఫిబ్రవరి 14
ఇన్ లవ్ ఓవర్ ఎగైన్-స్పానిష్ సిరీస్-ఫిబ్రవరి 14
జిమ్ జెఫ్రీస్: హై అండ్ డ్రై-హాలీవుడ్ చిత్రం-ఫిబ్రవరి 14
రీ/మెంబర్-జపనీస్ చిత్రం-ఫిబ్రవరి 14
ది రొమాంటిక్స్-హిందీ వెబ్ సిరీస్-ఫిబ్రవరి 14
నో ఫిల్టర్-పోర్చ్ గీస్ సిరీస్-ఫిబ్రవరి 14
ఆఫ్రికన్ క్వీన్స్: జింగా-ఇంగ్లీష్ సిరీస్-ఫిబ్రవరి 15
ఈవా లాస్టింగ్-స్పానిష్ సిరీస్-ఫిబ్రవరి 15
ఫుల్ స్వింగ్-ఇంగ్లీష్ సిరీస్-ఫిబ్రవరి 15
రెడ్ రోజ్-ఇంగ్లీష్ సిరీస్-ఫిబ్రవరి 15
ది లా అకార్టింగ్ టు లిడియా పోయట్-ఇటాలియన్ సిరీస్-ఫిబ్రవరి 15
ది అప్ షాస్ సీజన్ 3-ఇంగ్లీష్ సిరీస్-ఫిబ్రవరి 16
ఏ గర్ల్ అండ్ ఏన్ అస్ట్రోనాట్-ఇంగ్లీష్ సిరీస్-ఫిబ్రవరి 17
సర్కస్-హిందీ సినిమా-ఫిబ్రవరి 17
కమ్యూనిటీ స్క్వాడ్-స్పానిష్ సిరీస్-ఫిబ్రవరి 17
గ్యాంగ్ లాండ్స్ సీజన్ 2-ఫ్రెంచ్ సిరీస్-ఫిబ్రవరి 17
అన్ లాక్డ్-కొరియన్ సినిమా-ఫిబ్రవరి 17

డిస్నీ ప్లస్ హాట్ స్టార్..
మాలికాపురం-తెలుగు డబ్బింగ్ చిత్రం-ఫిబ్రవరి 15
సదా నన్ను నడిపే-తెలుగు సినిమా-ఫిబ్రవరి 16
ది నైట్ మేనేజర్-హిందీ సిరీస్-ఫిబ్రవరి 17
జె-హోప్ ఇన్ ది బాక్స్-కొరియన్ సిరీస్-ఫిబ్రవరి 17

మొత్తంగా 37 సినిమాలు.. సిరీస్ లు..
కార్నివల్ రో సీజన్ 2 వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 15 నుంచి స్ట్రీమింగ్ కానుండగా.. లాస్ట్ అనే హిందీ చిత్రం ఫిబ్రవరి 16 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో మైనస్ వన్ 2 హిందీ సిరీస్ ఫిబ్రవరి 14, లవ్ ఆన్ ది రాక్ అనే హాలీవుడ్ చిత్రం ఫిబ్రవరి 17 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి. హోయ్ చోయ్ లో బుకర్ మధ్యే అగున్ బెంగాలీ సిరీస్ ఫిబ్రవరి 17, దిల్ ఖుష్ బెంగాలీ మూవీ ఫిబ్రవరి 17 నుంచి ప్రదర్శించబడనున్నాయి. లవ్ ఆన్ ది రాక్ అనే చిత్రం బుక్ మై షోలో కూడా ఫిబ్రవరి 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇలా ఫిబ్రవరి 17న 15 సినిమాలు, సిరీస్ లు విడుదల కాగా.. ఫిబ్రవరి 14న 9 రిలీజ్ కానున్నాయి. ఇలా మొత్తంగా అన్నీ కలిపి 37 చిత్రాలు, సిరీస్ లు విడుదల కానున్నాయి.


Click it and Unblock the Notifications











