OTTలో ఫ్రైడే ఫెస్టివల్.. ఒక్క రోజే ఏకంగా 14 విడుదల.. మొత్తంగా ఎన్ని అంటే?
కరోనా కారణంగా వచ్చిన లాక్ డౌన్ తర్వాత ఓటీటీల హవా పెరిగిపోయింది. విభిన్నమైన జోనర్లలో సినిమాలు, సిరీస్ లను తీసుకు రావడంతో ప్రేక్షకులకు, సినీ లవర్స్ కు మంచి వినోదం లభించింది. దీంతో సిని ప్రియుల అభిరుచి కూడా మారింది. ఇక ఆడియెన్స్ అభిరుచికి తగినట్లుగా సొంతంగా సినిమాలను నిర్మిస్తున్నాయి ఓటీటీ సంస్థలు. కరోనా తగ్గి థియేటర్లు ఓపెన్ అయ్యాక కూడా ఓటీటీలో చిత్రాలను రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరికొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్దంగా ఉన్నాయి.

బుట్టబొమ్మ
బాల నటిగా సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు సంపాదించుకున్న అనైఖ సురేంద్రన్ హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన సినిమా బుట్టబొమ్మ. అర్జున్ దాస్, సూర్య విశిష్ట మరో ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ సినిమా మలయాళం సూపర్ హిట్ మూవీ కప్పేలాకు రీమెక్ గా తెరకెక్కింది. శౌరి చంద్ర శేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్ మెంట్స్ తో కలిసి త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 4న విడుదలై ఫెయిల్యూర్ గా నిలిచింది. సరిగ్గా ఒక నెల తర్వాత అంటే మార్చి 4న నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.

వసంత కోకిల
ప్రముఖ నటుడు బాబీ సింహా, ఆర్య, కాశ్మీరా పరదేశి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం వసంత కోకిల. సస్పెన్స్ థ్రిల్లర్ గా రమణన్ పురుషోత్తమ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి 10న థియేటర్లలో తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో విడుదలైంది. ఇప్పుడు 20 రోజుల్లోనే ఓటీటీలోకి రానుంది.
బాబీ సింహా భార్య రేష్మీతో కలిసి రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం మార్చి 3 నుంచి ఆహాలో ప్రదర్శితం కానుంది. అడవి మధ్యలో ఉన్న వసంత కోకిల అనే హోటల్ లో అడుగుపెట్టిన ఓ యువజంటకు ఎదురైన పరిణామాలతో టైమ్ లూప్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తీశారు.

ది గ్రేట్ ఇండియన్ కిచెన్
విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ముందుకుసాగుతుంది బ్యూటిఫుల్ ఐశ్వర్య రాజేష్. ఇటీవల డ్రైవర్ జమునగా అలరించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా నటించిన తమిలం చిత్రం ది గ్రేట్ ఇండియన్ కిచెన్. కన్నన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో టాలీవుడ్ యాక్టర్ అండ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమా మార్చి 3 నుంచి ప్రముఖ ఓటీటీ జీ5 వేదికగా స్ట్రీమింగ్ కానుంది.

ఎలోన్
మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ హిట్స్, ఫ్లాప్స్ అంటూ తేడా లేకుండా వరుస సినిమాలతో అలరిస్తుంటారు. మాన్‌స్టర్ సినిమాతో సందడి చేసిన ఈ సీనియర్ హీరో ఎలోన్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. షాజీ కైలాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో సింగిల్ క్యారెక్టర్ తో తెరకెక్కిన ఈ మూవీ మార్చి 3 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సందడి చేయనుంది.

ఇరట్టా
నటుడు జోజు జార్జ్ ద్విపాత్రాభినయం చేసిన మలయాళ సినిమా ఇరట్టా. ఫిబ్రవరి 3న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో బ్యూటిఫుల్ హీరోయిన్ అంజలి కూడా నటించగా.. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ లో మార్చి 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది. పోలీస్ ఆఫీసర్స్ గా పని చేసే ఇద్దరు కవల సోదరుల కథతో ఈ సినిమా తెరకెక్కింది. కాగా ఓటీటీలో మార్చి 3న ఒక్కరోజే ఏకంగా 14 సినిమాలు, వెబ్ సిరీస్ లు విడుదల కానుండగా మొత్తంగా 21 స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో 7 ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతున్నాయి.

క్రాంతి-ఆహా ఓటీటీ-మార్చి 3
అదృశ్యం-అమెజాన్ ప్రైమ్-మార్చి 3
తాజ్ డివైడ్ బై బ్లడ్ సీజన్ 1-జీ5-మార్చి 3
గుల్ మోహర్-డిస్నీ ప్లస్ హాట్ స్టార్-మార్చి 3
ది మాండలోరియన్ సీజన్ 3-డిస్నీ ప్లస్ హాట్ స్టార్-స్ట్రీమింగ్
తళైకూత్తల్-నెట్ ఫ్లిక్స్-మార్చి 3
లవ్ ఎట్ ఫస్ట్ కిస్-నెట్ ఫ్లిక్స్-మార్చి 3
హీట్ వేవ్-నెట్ ఫ్లిక్స్-మార్చి 3
నెక్ట్స్ ఇన్ ఫ్యాషన్ సీజన్ 2-నెట్ ఫ్లిక్స్-మార్చి 3
డివోర్స్ అటార్నీ సిన్-నెట్ ఫ్లిక్స్-మార్చి 4 (కొరియన్ సిరీస్)
మొనిక్ ఒలీవియర్: యాక్సెసరీ టూ ఈవిల్-నెట్ ఫ్లిక్స్-స్ట్రీమింగ్ (ఇంగ్లీష్ సిరీస్)
ఫ్రేమ్డ్ ఏ సిసిలియన్ మర్డర్ మిస్టరీ సీజన్ 2-నెట్ ఫ్లిక్స్-స్ట్రీమింగ్ (ఇటాలియన్ సిరీస్)
మసామీర్ కౌంటీ సీజన్ 2-నెట్ ఫ్లిక్స్-స్ట్రీమింగ్ (ఇంగ్లీష్ సిరీస్)
సెక్స్ లైఫ్ సీజన్ 2-నెట్ ఫ్లిక్స్-స్ట్రీమింగ్ (ఇంగ్లీష్ సిరీస్)
పడవాయి పూర్వ-సన్ ఎన్‌ఎక్స్‌టీ-మార్చి 3
వెనమ్ లెట్ దేర్ బీ కార్నేజ్-సోనీ లివ్-స్ట్రీమింగ్


Click it and Unblock the Notifications











