OTTలో ఫ్రైడే ఫెస్టివల్... ఒక్కరోజే 10 సినిమాలు.. ఆ రెండిటిపైనే ఫోకస్!
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ సినిమాలు లేవు. ఇప్పటికే రిలీజ్ అయిన జవాన్, మార్క్ ఆంటోనీ, మిస్ శెట్టి మిస్టర్ శెట్టి సినిమాలు సందడి చేస్తున్నాయి. ఈ వారం కూడా పెద్దగా సినిమాలు అయితే లేవు. కన్నడ మూవీ సప్త సాగరదాచే ఎల్లో సినిమాను తెలుగులో సప్త సాగరాలు దాటి అనే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీలో హీరోగా రక్షిత్ శెట్టి నటించాడు. కాస్త ఈ మూవీపై బజ్ నెలకొంది. ఇక ఓటీటీలో ఈవారం ఒక్కరోజే 10 సినిమాలు రిలీజ్ కానున్నాయి.
ఓటీటీలో ఆ రెండు సినిమాలపైనే ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. అందులో ఒకటి దుల్కర్ సల్మాన్ పాన్ ఇండియా చిత్రం కింగ్ ఆఫ్ కొత్త. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయింది. ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన గాండీవదారి అర్జున మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఈ రెండు చిత్రాలు ఓటీటీలో ఎలాంటి ఫలితాన్నిఇవ్వనున్నాయో చూడాలి.

నెట్ ఫిక్స్
1. హౌ టూ డీల్ విత్ ఏ హార్ట్‌బ్రేక్ - సెప్టెంబరు 22న స్ట్రీమింగ్
2. లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 5 - సెప్టెంబరు 22న స్ట్రీమింగ్
3. సాంగ్ ఆఫ్ బండిట్స్ - సెప్టెంబరు 22న స్ట్రీమింగ్
3. స్పై కిడ్స్: అర్మగెడ్డోన్ - సెప్టెంబరు 22న స్ట్రీమింగ్
4.గాండీవధారి అర్జున - సెప్టెంబరు 24న స్ట్రీమింగ్

హాట్‌స్టార్
5. దిస్ ఫుల్ సీజన్ 2 - సెప్టెంబరు 20న స్ట్రీమింగ్
6. కింగ్ ఆఫ్ కొత్త - సెప్టెంబరు 22న స్ట్రీమింగ్
7. నో వన్ విల్ సేవ్ యూ - సెప్టెంబరు 22న స్ట్రీమింగ్
8. ద కర్దాషియన్స్ సీజన్ 4 - సెప్టెంబరు 23న స్ట్రీమింగ్
అమెజాన్ ప్రైమ్
9. కసండ్రో - సెప్టెంబరు 22న స్ట్రీమింగ్
10. ద కాంటినెంటల్: ఫ్రమ్ ద వరల్డ్ ఆఫ్ జాన్‌విక్ - సెప్టెంబరు 22న స్ట్రీమింగ్

ఆపిల్ ప్లస్ టీవీ
11. స్టిల్ అప్ - సెప్టెంబరు 22న స్ట్రీమింగ్
ఇలా ఈ ఫ్రైడే అంటే సెప్టెంబర్ 22 న ఒక్కరోజే ఏకంగా 11 సినిమాలు, సిరీసులు విడుదల కానున్నాయి. ఒకటి మాత్రం సెప్టెంబర్ 24న రిలీజ్ కానుంది. ఇక ఈ వారం ఈ సినిమాలను ఇంట్లోనే కూర్చొని మీరు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











