వీకెండ్ ఆగయా.. OTTలో సూపర్ హిట్స్ 'సామజవరగమన, స్పై'.. మరో 19 ఎగ్జైటింగ్ మూవీస్ కూడా!
ప్రతివారం ఓటీటీ వేదికగా పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ అవుతూ ఉంటాయి. మరి ఈ వీకెండ్ సినీ ప్రియులకు పండగే అని చెప్పాలి. మంచి సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఎలాగూ వీకెండ్ వచ్చేస్తోంది.. ఇక సినిమాలు చూసేందుకు సినీ లవర్స్ సిద్ధంగా ఉండండి. అంతకు ముందు.. ఏ ఓటీటీలో ఏ సూపర్ హిట్ మూవీ, వెబ్ సిరీస్ రానుందో తెలుసుకుందాం.
కరోనా తర్వాత చాలా మంది ఓటీటీ కంటెంటుకు బాగా అలవాటు పడ్డారు. థియేటర్ కు వెళ్లి చూసే ఓపిక లేని వారికి ఇంట్లోనే కొత్త సినిమాలు చూసే వేదికగా ఓటీటీ మారిపోయింది. అయితే ప్రతి వారం ఏదో ఒక కొత్త సినిమాలు ఓటీటీ వేదికగా రిలీజ్ అవుతుంటాయి. అయితే ఇక ఈ వారం సినీ ప్రియులకు పండగే అని చెప్పాలి. ఏకంగా సూపర్ హిట్ మూవీస్ తో పాటు... 20కి పైగా సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.

శ్రీవిష్ణు సామజవరగమన...:శ్రీవిష్ణు హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన చిత్రం సామజవరగమన. ఇక ఈ చిత్రం చిన్న చిత్రంగా విడుదలై.. బాక్సాఫీస్ వద్ద పెను సంచలనమే సృష్టించింది. ప్రేక్షకులను ఈ సినిమా కడుపుబ్బా నవ్వించింది. వినోదాత్మక చిత్రంగా అలరించిన ఇది ఇప్పుడు ఓటీటీలోకి స్ట్రీమింగ్ కానుంది. జులై 28 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

ఉదయనిధి నాయకుడు..:ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫహద్ ఫాజిల్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మామన్నమ్. ఇక ఈ సినిమా తెలుగులో నాయకుడు పేరుతో రిలీజ్ అయింది. ఇక ఈ చిత్రాన్ని మారి సెల్వరాజ్ తెరకెక్కించాడు. ఎన్నో అంచనాల నడుమ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా జులై 27 నుంచి తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది.
సడెన్ గా స్పై... :నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం 'స్పై' ఎడిటర్ గ్యారీ బీహెచ్ ఈ సినిమాతో దర్శకుడిగా అడుగుపెట్టాడు. ఐశ్వర్య మేనన్ హీరోయిన్ గా చేయగా.. స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక దాగిన రహస్యాల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఇప్పుడీ సినిమా ఎలాంటి ప్రకటన లేకుండా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా జులై27 నుంచి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

వివిధ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలు:నెట్ ఫ్లిక్స్ వేదికగా.. హాలీవుడ్ మూవీస్ పారడైజ్, హిడెన్ స్ట్రైక్, హ్యాపీనెస్ ఫర్ బిగినెర్స్ జులై 27న స్ట్రీమింగ్ కానున్నాయి. ఎ పర్‌ఫెక్ట్ స్టోరీ (స్పానిష్), కెప్టెన్ ఫెయిల్ (ఇంగ్లీష్), హౌ టు బికమ్ ఎ కల్ట్ లీడర్ జులై 28న ఇదే ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా.. రెజీనా (తమిళ్) స్ట్రీమింగ్ అవుతోంది.
ఆషిఖానా (హిందీ సిరీస్) జులై 24వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. సోనిలివ్ లో ట్విస్టెడ్ మెటల్ (వెబ్‌సిరీస్) జులై 28 స్ట్రీమింగ్ కానుంది. బుక్ మై షో లో జస్టిస్ లీగ్: వార్ వరల్డ్ (యానిమేషన్ మూవీ) జులై 23 విడుదల కానుంది. ట్రాన్స్‌ఫార్మర్స్:రైజ్ ఆఫ్ ది బీస్ట్స్ (హాలీవుడ్) జులై 26న రిలీజ్ కానుంది. ద ఫ్లాష్ (హాలీవుడ్) జులై 27 న రిలీజ్ అయింది.
అమెజాన్ మినీలో హాఫ్ సీఏ (హిందీ) జులై 26న స్ట్రీమింగ్ అవుతుంది. ఇక జియో సినిమాలో లయనెస్ (హాలీవుడ్) జులై 23 నుంచి స్ట్రీమింగ్ అవ్వగా.. కాల్‌కూట్ (హిందీ) జులై 27 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. మనోరమా మ్యాక్స్ లో కొళ్ల (మలయాళం) జులై 27 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.


Click it and Unblock the Notifications











