OTTలో ఫ్రైడే ఫెస్టివల్.. ఒక్కరోజే 16 సినిమాలు.. ఎంత చూసిన తనివితీరదు బ్రో
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద బీభత్సమైన సందడి నెలకొంది. ఎందుకంటే ఓవైపు సూపర్ స్టార్, మరోవైపు మెగాస్టార్ తలపడనున్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన జైలర్ సినిమా, మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడనున్నాయి. ఇదిలా ఉంటే మరోవైపు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లలో కూడా కొత్త సినిమాలు, వెబ్ సిరీసులు సినీ ప్రియులను ఊరించేందుకు రెడీ అయ్యాయి. అయితే కొన్ని సినిమాలు గురువారం (ఆగస్టు 10) నుంచే స్ట్రీమింగ్ అవుతుండగా మరికొన్ని శుక్రవారం (ఆగస్టు 11) విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరి అవేంటో లుక్కేసేద్దామా!
అమెజాన్ ప్రైమ్ వీడియో:
రెడ్, వైట్ అండ్ రాయల్ బ్లూ- ఇంగ్లీష్ సినిమా -ఆగస్టు 11
మహావీరుడు- తెలుగు డబ్బింగ్ మూవీ -ఆగస్టు 11
మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2- తెలుగు వెబ్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)
సత్యప్రేమ్ కీ కథ- హిందీ సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్)

నెట్ ఫ్లిక్స్:
హార్ట్ ఆఫ్ స్టోన్- తెలుగు/ఇంగ్లీష్ సినిమా -ఆగస్టు 11
పద్మిని- మలయాళ చిత్రం -ఆగస్టు 11
పెండింగ్ ట్రైన్- జపనీస్ వెబ్ సిరీస్ -ఆగస్టు 11
బిహైండ్ యువర్ టచ్- కొరియన్ సిరీస్ -ఆగస్టు 12
మెక్ క్యాడెట్స్- ఇంగ్లీష్ వెబ్ సిరీస్ - (స్ట్రీమింగ్ అవుతోంది)
పెయిన్ కిల్లర్- ఇంగ్లీష్ వెబ్ సిరీస్- (స్ట్రీమింగ్ అవుతోంది)
జగున్ జగున్- ఇంగ్లీష్ సినిమా- (స్ట్రీమింగ్ అవుతోంది)
మ్యారీ మై డెడ్ బాడీ- ఇంగ్లీష్ చిత్రం- (స్ట్రీమింగ్ అవుతోంది)

సోనీ లివ్:
పోర్ తోడిల్ (మలయాళం)- తెలుగు డబ్బింగ్- ఆగస్టు 11
ది ఫేబుల్‌మన్స్- ఇంగ్లీష్ సినిమా- ఆగస్టు 11
బ్రోకర్- కొరియన్ సినిమా- ఆగస్టు 11
పారాసైట్- ఇంగ్లీష్ చిత్రం- ఆగస్టు 11
ఆహా:
వాన్ మూండ్రు- తమిళ చిత్రం- ఆగస్టు 11
హిడింబ- తెలుగు సినిమా- (ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతోంది)
వేరే మారి ఆఫీస్- తమిళ వెబ్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)

జీ5:
అభర్ ప్రళయ్- బెంగాలీ వెబ్ సిరీస్- ఆగస్ట్ 11
ది కశ్మీరీ ఫైల్స్ అన్ రిపోర్టెడ్- తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్- ఆగస్ట్ 11
కమాండో (హిందీ సిరీస్)- డిస్లీ ప్లస్ హాట్ స్టార్- ఆగస్టు 11
జరా హట్కే జరా బచ్కే (హిందీ సినిమా)- జియో సినిమా- ఆగస్ట్ 11
హై హీట్ (ఇంగ్లీష్ సినిమా)- లయన్స్ గేట్ ప్లే- ఆగస్ట్ 11
రుబీ గిల్మన్, టీనేజ్ క్రాకన్ (ఇంగ్లీష్ మూవీ)- బుక్ మై షో- ఆగస్టు 11
మొత్తంగా 25:
ఇలా ఈ ఫ్రైడే అంటే ఆగస్ట్ 11న ఒక్కరోజే ఏకంగా 16 సినిమాలు, సిరీసులు విడుదల కానున్నాయి. అలాగే ఇప్పటికే 8 చిత్రాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఒకటి మాత్రం ఆగస్ట్ 12న రిలీజ్ కానుంది. ఇలా చూసుకుంటే ఈవారం మొత్తంగా 25 సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు అందుబాటులో ఉన్నాయి.


Click it and Unblock the Notifications











