OTTలో సినిమాల పండుగ.. ఏకంగా 34 రిలీజ్.. ఆ రెండు చిత్రాలపైనే ఫోకస్!
ప్రతివారం కొత్త కొత్త సినిమాలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతుంటాయి. థియేటర్లలో, ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీసులు విడుదలవుతూ వినోదాన్ని పంచుతాయి. గతవారం థియేటర్లలో స్పై, సామజవరగమన చిత్రాలు సందడి చేయగా.. ఈ వారం రంగబలితోపాటు 10 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఓటీటీలో ఈవారం అంటే జూలై మొదటి వారంలో ఏకంగా 24 సినిమాలు సందడి చేసేందుకు సంసిద్ధం అయ్యాయి. వీటిలో తెలుగు సినిమాలు, సిరీలు ఎక్కువగా ఉన్నాయి. మరి అవేంటీ? ఎందులో? ఎప్పుడు స్ట్రీమింగ్ కానున్నాయో? ఓ లుక్కేద్దాం.
డిస్లీ ప్లస్ హాట్‌స్టార్
గుడ్ నైట్ (తెలుగు డబ్బింగ్ మూవీ)- జూలై 3 (ఆల్రెడీ స్ట్రీమింగ్)
కిజాజీ మోటో: జనరేషన్ ఫైర్ (ఆఫ్రికన్ సిరీస్)- జూలై 5
IB 71 (హిందీ మూవీ)- జూలై 7

నెట్‌ఫ్లిక్స్:
అన్‌నోన్: ది లాస్ట్ పిరమిడ్ (ఇంగ్లీష్ మూవీ)- జూలై 3 (ఆల్రెడీ స్ట్రీమింగ్)
ది ఆర్ట్ ఆఫ్ ఏ కార్పోరేషన్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ)- జూలై 3 (ఆల్రెడీ స్ట్రీమింగ్)
హోమ్ రెకర్ (ఇంగ్లీష్ సినిమా)- జూలై 3 (ఆల్రెడీ స్ట్రీమింగ్)
ది లింకన్ లాయర్ సీజన్ 2: పార్ట్ 1 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూలై 6
ఫేటల్ సెడక్సన్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూలై 7
ది ఔట్ లాస్ (ఇంగ్లీష్ చిత్రం)- జూలై 7
ది పోప్స్ ఎక్సార్సిస్ట్ (ఇంగ్లీష్ చిత్రం)- జూలై 7
హాక్ మై హోమ్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూలై 7
డీప్ ఫేక్ లవ్ (ఇంగ్లీష్ రియాలిటీ షో)- జూలై 7
అమెజాన్ ప్రైమ్ వీడియో:
బాబీలోన్ (హాలీవుడ్ సినిమా)- జూలై 5
స్వీట్ కారం కాఫీ (తెలుగు వెబ్ సిరీస్)- జూలై 6
అదురా (హిందీ వెబ్ సిరీస్)- జూలై 7
ది హారర్ ఆఫ్ డోలెరస్ రోచ్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూలై 7

జియో సినిమా:
ఇష్క్ నెక్ట్స్ డోర్ (హిందీ సినిమా)- జూలై 3 (ఆల్రెడీ స్ట్రీమింగ్)
బ్లైండ్ (హిందీ మూవీ)- జూలై 7
ఉనాద్ (మరాఠీ సినిమా)- జూలై 8
జీ5
ఆర్చీర్ గ్యాలరీ (బెంగాలీ సినిమా)- జూలై 7
తర్లా (హిందీ సినిమా)- జూలై 7
సోనీ లివ్
ఫర్హానా (తెలుగు డబ్బింగ్ సినిమా)- జూలై 7
హవా (బంగ్లాదేశీ చిత్రం)- జూలై 7
ముబీ

రిటర్న్ టూ సియోల్ (ఇంగ్లీష్ మూవీ)- జూలై 7
ఇలా ఓటీటీల్లో జూలై రెండో వారంలో ఏకంగా 24 సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో జూలై 7 అంటే శుక్రవారం రోజున 14 సినిమాలు, సిరీసులు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో థియేటర్లో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఐశ్వర్య రాజేష్ ఫర్హానా సినిమా కూడా ఉంది. ఇక థియేటర్లలో 10 విడుదల కాగా.. అన్నీ కలిపి 34 సినిమాలు అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











