OTTలో సినిమాల జాతర.. ఒక్కరోజే 14, మొత్తంగా 22.. ఆ రెండు చిత్రాలపైనే అందరి ఫోకస్!
ప్రతివారం కొత్త కొత్త సినిమాలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతుంటాయి. థియేటర్లలో, ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీసులు విడుదలవుతూ వినోదాన్ని పంచుతాయి. గతవారం ఆదిపురుష్ సినిమా థియేటర్లో విడుదలై సందడి చేసింది. ఇక ఈవారం థియేటర్లలో రిలీజయ్యే పెద్ద సినిమాలు ఏం అంతగా లేవు. కానీ ఓటీటీలో మాత్రం అదిరిపోయే చిత్రాలు, వెబ్ సిరీసులు అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అవి ఎప్పుడు? ఎందులో? స్ట్రీమింగ్ అవుతాయో చూద్దాం.
నెట్ ఫ్లిక్స్ లో: ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ లో జూన్ 22న గ్లామరస్ (ఇంగ్లీష్ సిరీస్), స్కల్ ఐలాండ్ (ఇంగ్లీష్ సిరీస్), స్లీపింగ్ డాగ్ (హిందీ సిరీస్), సోషల్ కరెన్సీ (హిందీ సిరీస్) విడుదల కానున్నాయి. అలాగే జూన్ 23 నుంచి ఐ నంబర్ నంబర్ జోజి గోల్డ్ (ఇంగ్లీష్ మూవీ), త్రూ మై విండో (ఇంగ్లీష్ చిత్రం), క్యాచింగ్ కిల్లర్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) స్ట్రీమింగ్ అవనున్నాయి. ఇక టేక్ కేర్ ఆఫ్ మాయ అనే ఇంగ్లీష్ మూవీ జూన్ 19 అంటే నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. దీంతోపాటు నాట్ క్వైట్ నార్వల్ అనే ఇంగ్లీష్ సిరీస్ కూడా ప్రదర్శితమవుతోంది.

డిస్నీ హాట్ స్టార్ లో: డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా.. క్లాస్ ఆఫ్ 09 (ఇంగ్లీష్ సిరీస్), సీక్రెట్ ఇన్వేషన్ (ఇంగ్లీష్ సిరీస్) జూన్ 21న రిలీజ్ కానున్నాయి. జాగ్డ్ మైండ్ (ఇంగ్లీష్ చిత్రం), కేరళ క్రైమ్ ఫైల్స్ అనే మలయాళ చిత్రం, వరల్డ్స్ బెస్ట్ అనే ఇంగ్లీష్ మూవీ జూన్ 23న హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్నాయి.
ఆహా-అమెజాన్ ప్రైమ్: అలాగే ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ఇంటింటి రామాయణం జూన్ 23 నుంచి స్ట్రీమిగ్ కానుంది. సోనీ లివ్ లో ఏజెంట్ మూవీ జూన్ 23న రిలీజ్ కానుంది. ఇక మరో ఓటీటీ దిగ్గజం అయిన అమెజాన్ ప్రైమ్ వీడియోలో టీకూ వెడ్స్ షేరు అనే హిందీ మూవీ, పొన్నియన్ సెల్వన్ 2 హిందీ వెర్షన్ జూన్ 23 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి.

జీ5 చిత్రాలు: ఇక జీ5 వేదికగా కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సల్మాన్ ఖాన్ డబ్బింగ్ మూవీ జూన్ 23న, సంచలనం సృష్టించిన ది కేరళ స్టోరీ చిత్రం కూడా జీ5లో జూన్ 23 నుంచే ప్రదర్శించనున్నారు. జాన్ విక్ చాప్టర్ 4 మూవీ జూన్ 23న లయన్స్ గేట్ ప్లేలో రిలీజ్ కానుంది. ఫ్లై ఓవర్ అనే బెంగాలి మూవీ జూన్ 23న అడ్డా టైమ్స్ లో విడుదల కానుంది.
మొత్తంగా 22 సినిమాలు: ఈవారం అంటే జూన్ 4వ వారం ఓటీటీలో మొత్తంగా 22 సినిమాలు, వెబ్ సిరీసులు విడుదల కానున్నాయి. అలాగే ఏకంగా 14 సినిమాలు, సిరీసులు జూన్ 23న ఒక్కరోజు నుంచే స్ట్రీమింగ్ కానున్నాయి. వీటన్నింటిలో ది కేరళ స్టోరీ, ఏజెంట్ సినిమాలపైనే అందరి ఫోకస్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











