OTTలో ఫ్రైడే ఫెస్టివల్.. ఒక్కరోజే 13 సినిమాలు.. కచ్చితంగా చూడాల్సిన సినిమాలివే!
వీకెండ్ వచ్చేస్తోంది... ఇంకేముంది బాక్స్ ఆఫీస్ వద్ద కొత్త సినిమాలు.. ఓటీటీల్లో కొత్త కొత్త సినిమాలు.. వాటితో పాటు సిరీస్ లు.. ఇక సినీ లవర్స్ కు పండగే అని చెప్పవచ్చు. ఇక ఈ శుక్రవారం థియేటర్ వద్ద విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటించిన ఖుషి సినిమా సందడి చేయబోతుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అటు ఓటీటీలోనూ ఒక్కరోజే 13 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. సెప్టెంబర్ 1 వ తేదీన ఏ ఏ సినిమాలు.. ఏ ఏ వెబ్ సిరీస్ లు రిలీజ్ కాబోతున్నాయో చూద్దాం.
ఓటీటీ వచ్చాకా వారం వారం.. సినీ లవర్స్ కు పండగే అని చెప్పవచ్చు. ఈ శుక్రవారం కొన్ని కొత్త సినిమాలు, సిరీస్‌లు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. మీకు వీలు చిక్కిందంటే.. ఆలస్యం చేయకుండా ఫ్యామిలీతో కలిసి ఓటీటీలో ఇంట్లో కూర్చొని చూసేయండి. ఇక వీటిలో ఆసక్తి కలిగించే చిత్రాల విషయానికి వస్తే... సోనీలివ్ లో స్కామ్ 2003: ద తెల్గి స్టోరీతో పాటు... జీ5 లో డీడీ రిటర్న్స్: భూతాల బంగ్ చిత్రం ఆసక్తిని కలిగిస్తోంది.

అమెజాన్ ప్రైమ్
ద వీల్ ఆఫ్ టైం సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) - సెప్టెంబర్ 1న విడుదల
హాట్‌స్టార్
ద ఫ్రీలాన్సర్ (హిందీ వెబ్ సిరీస్) - సెప్టెంబర్ 1న విడుదల
సోనీలివ్
స్కామ్ 2003: ద తెల్గి స్టోరీ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - సెప్టెంబర్ 1న విడుదల
జీ5
డీడీ రిటర్న్స్: భూతాల బంగ్లా (తెలుగు డబ్బింగ్ మూవీ) - సెప్టెంబర్ 1న విడుదల
బియే బిబ్రాత్ (బెంగాలీ చిత్రం) - సెప్టెంబర్ 1న విడుదల
నెట్‌ఫ్లిక్స్
వన్ పీస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) - నేటి నుంచే స్ట్రీమింగ్
చూజ్ లవ్ (హాలీవుడ్ సినిమా) - నేటి నుంచే స్ట్రీమింగ్
డిసెన్‌చాంట్‌మెంట్: పార్ట్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబర్ 1న విడుదల
ఫ్రైడే నైట్ ప్లాన్ (హిందీ చిత్రం) - సెప్టెంబర్ 1న విడుదల
హ్యాపీ ఎండింగ్ (హాలీవుడ్ సినిమా) - సెప్టెంబర్ 1న విడుదల
లవ్ ఈజ్ బ్లైండ్: ఆఫ్టర్ ద అల్టర్ సీజన్ 4 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) - సెప్టెంబర్ 1న విడుదల
ఎ డే అండ్ హాఫ్ (హాలీవుడ్ సినిమా) - సెప్టెంబర్ 1న విడుదల
బుక్ మై షో
ద అల్లేస్ (అరబిక్ చిత్రం) - సెప్టెంబర్ 1న విడుదల
ఇలా ఈ ఫ్రైడే అంటే సెప్టెంబరు 1న ఒక్కరోజే ఏకంగా 11 సినిమాలు, సిరీసులు విడుదల కానున్నాయి. అలాగే ఇప్పటికే 2 చిత్రాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











