OTT 2022: 2022లో నేరుగా ఓటీటీలో విడుదలైన సినిమాలు.. ఎన్ని హిట్ అయ్యాయంటే?
కరోనా మహమ్మారి వల్ల ఏర్పడిన లాక్ డౌన్ తర్వాత ఓటీటీల హవా పెరిగిపోయింది. విభిన్నమైన జోనర్లలో సినిమాలు, సిరీస్ లను తీసుకు రావడంతో ప్రేక్షకులకు, సినీ లవర్స్ కు మంచి టైమ్ పాస్ ఏర్పడింది. దీంతో సిని ప్రియుల అభిరుచి కూడా మారింది. ఇక వాళ్ల అభిరుచికి తగినట్లుగా సొంతంగా సినిమాలను నిర్మించాయి ఓటీటీ సంస్థలు. తర్వాత కరోనా తగ్గడం, థియేటర్లు ఓపెన్ అయ్యాక కూడా ఓటీటీలో చిత్రాలను రిలీజ్ చేస్తూ వచ్చారు. అయితే థియేటర్లలో ప్రదర్శించిన నాలుగు వారాల తర్వాత కొన్ని సినిమాలు విడుదలయితే మరికొన్ని చిత్రాలను నేరుగానే డిజిటల్ తెరపైకి తీసుకొచ్చారు. మరి 2022 సంవత్సరంలో నేరుగా ఓటీటీలో విడుదలైన తెలుగు సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దామా!

భామాకలాపం
బ్యూటిఫుల్ ముద్దుగుమ్మ ప్రియమణి 2022లో నటించిన చిత్రం భామాకలాపం. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా వేదికగా ఫిబ్రవరి 11న నేరుగా విడుదలైంది ఈ సినిమా. ప్రియమణితోపాటు శరణ్య ప్రదీప్, శాంతి రావు కీలకపాత్రలు పోషించారు. అభిమన్యు దర్శకత్వం వహించిన ఈ సినిమా కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కింది. మిక్స్ డ్ టాక్ అందుకున్న ఈ సినిమా ట్రైలర్ ను రౌడీ హీరో విజయ్ దేవరకొండ విడుదల చేశారు.

మళ్లీ మొదలైంది
సుమంత్ హీరోగా నటించిన చిత్రం మళ్లీ మొదలైంది. హాట్ బ్యూటి నైనా గంగూలీ, పావని రెడ్డి హీరోయిన్లుగా చేసిన ఈ సినిమా నేరుగా ఫిబ్రవరి 11న జీ5 ఓటీటీ వేదికగా విడుదలైంది. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బుల్లితెర యాంకర్ వర్షిణి కూడా కీరోల్ పోషించింది. అయితే ఈ సినిమా అనుకున్నంతగా విజయం సాధించలేకపోయింది.

బ్లడీ మేరీ
గ్లామరస్ బ్యూటి నివేదా పేతురాజ్ ప్రధాన పాత్రలో యాక్ట్ చేసిన మూవీ బ్లడీ మేరీ. కిరీటీ దామరాజు, రాజ్ కుమార్ కసిరెడ్డి, బ్రహ్మాజీ మరో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు చందూ మొండేటి దర్శకత్వం వహించగా.. కాల భైరవ సంగీతం అందించారు. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఆహాలో ఏప్రిల్ 15న విడుదలైంది. అయితే ఈ సినిమా పర్వాలేదనిపించుకుంది.

చిన్ని
మహానటి కీర్తి సురేష్, ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్, స్టార్ హీరో ధనుష్ సోదరుడు సెల్వ రాఘవన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల అయింది. మే 6న విడుదలైన ఈ సినిమాను కార్తీక్ సబ్బరాజ్ డైరెక్ట్ చేశాడు. తమిళంలో సాని కాయిదం చిత్రంగా వచ్చిన ఈ సినిమాను తెలుగులో చిన్నిగా విడుదల చేశారు. పోలీస్ కానిస్టేబుల్ గా కీర్తి సురేష్ నటించిన ఈ చిత్రం పర్వాలేదనిపించింది.

ఓదెల రైల్వే స్టేషన్
హాట్ బ్యూటి హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా ఆహాలో నేరుగా ఆగస్టు 26న విడుదలైంది. క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాకు డైరెక్టర్ సంపత్ నంది కథ అందించగా.. ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ తేజ దర్శకత్వం వహించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమాలో సాయి రోనాక్, వశిష్ట ఎన్ సింహా కీలక పాత్రలు పోషించారు. అయితే ఈ సినిమా టాక్ పరంగా పర్వాలేదనిపించుకుంది.

రిపీట్
డిఫరెంట్ కథలతో ముందుకు సాగుతున్న నవీన్ చంద్ర హీరోగా నటించిన చిత్రం రిపీట్. తమిళంలో వచ్చి డేజావు సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ చిత్రంలో అలనాటి స్టార్ హీరోయిన్ మధుబాల కీ రోల్ పోషించింది. ఇన్వేస్టిగేటివ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డిసెంబర్ 1న విడుదలై మంచి పాజిటివ్ టాక్ అందుకుంది. ఈ సినిమాతో పాటు నయనతార ఓ2, ఇంటింటి రామాయణం, అందరూ బాగుండాలి అందులో నేనుండాలి, కిన్నెర సాని చిత్రాలు నేరుగా ఓటీటీలో విడుదలయ్యాయి. అలాగే మహాన్, పురు, కట్ పుట్లి, ఫ్రెడ్డీ, డార్లింగ్స్, గోవిందా నామ్ మేరా తదితర స్టార్ హీరోల చిత్రాలు సైతం నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యాయి.


Click it and Unblock the Notifications











