OTT: ఓటిటిలోకి లోకేష్ కనగరాజ్ యూనివర్స్ మ్యాడ్ వెబ్ ఫిల్మ్.. ఎప్పుడు? ఎక్కడ రిలీజ్ అంటే?

ప్రపంచ వ్యాప్తంగా సినిమా లవర్స్ కి అనేక సినిమాలు ఒక కొత్త ఎక్స్ పీరియన్స్ ని ఇస్తే దానిని ఆడియెన్స్ ఎంతగానో ఎంజాయ్ చేస్తూ ఆస్వాదిస్తారు అలాగే ఆదరిస్తారు. అలా సినిమాల్లో అనేక జానర్స్ ఇప్పుడు కనిపిస్తున్నాయి. అయితే వీటిలో కొన్ని స్పెషల్ జానర్స్ మాత్రం ఆడియెన్స్ ని ఓ రేంజ్ లో ఎంగేజ్ చేస్తాయని చెప్పొచ్చు. కాగా ఇలాంటి వాటిలో పలు సినిమాలు ఒకదానికి ఒకటి కలుపుతూ సినిమాటిక్ యూనివర్స్ గా మార్చి వరల్డ్ వైడ్ ఓ కొత్త ఫార్ములా ట్రెండింగ్ లోకి వచ్చింది.

కాగా హాలీవుడ్ లో ఎప్పుడో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు మన ఇండియన్ సినిమా దగ్గర కూడా ఊపందుకుంది. కాగా సీక్వెల్స్ కంటే ఒకింత ఆడియెన్స్ ఈ తరహా సినిమాలు చూసేందుకే ఆసక్తి కనబరుస్తున్నారు. ఇలా సినిమాటిక్ యూనివర్స్ చిత్రాలు ఇండియాలో పలు భాషల్లో మొదలయ్యాయి. అయితే తన సినిమాల్తో ఓ రేంజ్ లో ట్రీట్ ఇచ్చిన దర్శకుడు మాత్రం తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ అని చెప్పాలి.

lokesh kanagaraj lcu origin web film ott release fixed

తన సినిమాలు ఖైదీ, విక్రమ్ లతో చూపించిన మ్యాజిక్ ఓ రేంజ్ లో వర్కౌట్ కావడంతో తన పేరిట లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) అనేది ఒకటి క్రియేట్ చేసి ఆడియెన్స్ లో ఓ రేంజ్ హైప్ ని తెచ్చుకోగలిగాడు. దీనితో లోకేష్ కనగరాజ్ సినిమాలపై భారీ హైప్ ఇప్పుడు నెలకొనగా ఈ సినిమాల్లో ఎలాంటి లింక్స్ ఉంటాయి అనేది మరింత ఎగ్జైటింగ్ గా మారింది.

అయితే ఇపుడు లోకేష్ నుంచి మూడు సినిమాలు ఖైదీ, విక్రమ్, లియో లు ఒకదానికి ఒకటి లింకప్ అయ్యి ఉన్నాయని కన్ఫర్మ్ అయ్యింది. కానీ అసలు ఈ సినిమాటిక్ యూనివర్స్ కి ఆరంభం ఏంటి అనే దానిపై ఒక క్రేజీ షార్ట్ ఫిలిం ని తాను రెడీ చేస్తున్నట్టుగా ఎప్పుడో చెప్పాడు. అలాగే నటుడు నరైన్ ఇందులో కీలకంగా కనిపిస్తాడు అని కూడా టాక్ వచ్చింది (ఈ నటుడు ఖైదీ, విక్రమ్ లో పోలీస్ రోల్ లో కనిపిస్తారు).

కాగా దీనితో అసలు ఈ సినిమాటిక్ యూనివర్స్ ఎలా ఆరంభం అయ్యింది అనేది ఒక క్లారిటి అందరికీ వస్తుంది అని ఎప్పుడు నుంచో వార్తలు వచ్చాయి. మరి అసలు ఈ షార్ట్ వెబ్ ఫిలిం ఎప్పుడు వస్తుంది అనేది పెద్ద సస్పెన్స్ గా మారగా ఇపుడు ఫైనల్ గా ఓ రూమర్ వైరల్ గా మారింది. దీనితో ఈ వెబ్ ఫిల్మ్ వచ్చే ఏడాది జనవరిలో డైరెక్ట్ ఓటిటిలో రాబోతుందట.

lokesh kanagaraj lcu origin web film ott release fixed

కాగా ఈ షార్ట్ ఫిలిం ని పాపులర్ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా ఇందులో జనవరి సిద్ధం చేస్తున్నారట. అయితే ప్రస్తుతానికి డేట్ ఇంకా గోప్యం గానే ఉంది కానీ జనవరి రిలీజ్ అయితే ఫిక్స్ అని కోలీవుడ్ వర్గాల్లో టాక్ ఊపందుకుంది. లోకేష్ కనగరాజ్ సినిమాలకి తెలుగు ఆడియెన్స్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. దీనితో ఈ వెబ్ ఫిలిం కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

More from Filmibeat

Read more about: lokesh kanagaraj vikram leo
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X