Sobhita Dhulipala: పెళ్లికి ముందు పీకల్లోతు సమస్యలతో శోభిత ధూళిపాల.. హృదయం ముక్కలయ్యే డ్రామా!

యువ హీరోయిన్ శోభితా ధూళిపాల నటించిన లవ్ సితార చిత్రం ఓటీటీ రిలీజ్‌కు సిద్దమైంది. ఫ్యామిలీ ఎమోషన్స్‌, మ్యారేజ్ టెన్షన్స్, లవ్, ఇతర ఎమోషన్స్‌తో రూపొందిన ఈ సినిమా త్వరలోనే జీ5, ఓటీటీ ఫ్లే రిలీజ్‌కు సిద్దమైంది. ఈ మూవీని నేరుగా ఓటీటీలో సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా ఈ మూవీట్రైలర్‌ను రిలీజ్ చేయగా మంచి స్పందన కూడగట్టుకొంటున్నది. ఈ ట్రైలర్ వివరాల్లోకి వెళితే..

లవ్ సితార సినిమా విషయానికి వస్తే.. తారా (శోభిత) స్వతంత్ర భావాలు ఉన్న ఆధునిక యువతి. ఇంటీరియర్ డిజైనర్‌గా తన ప్రొఫెషన్‌ను కొనసాగిస్తుంటుంది. చెఫ్‌గా పనిచేసే అర్జున్ (రాజీవ్ సిద్దార్థ) అనే యువకుడితో ఆమె పెళ్లిని నిర్ణయిస్తారు. పెళ్లి సంబురాలు మొదలైన సమయంలో వారి మధ్య ఓ సమస్య వచ్చి పడుతుంది. ఆ సమస్యను అధిగమించి పెళ్లి చేసుకొన్నారా? లేదా ఎంగేజ్‌మెంట్ బ్రేకప్ అయిందా అనేది సినిమా కథ.

Love Sitara Trailer Review Sobhita Dhulipala steal the Show in Marriage drama

పెళ్లి చుట్టూ తిరగే కథలో పలు రకాల భావోద్వేగాలు స్పష్టంగా కనిపించాయి. పెళ్లి సమయంలో ఏర్పడిన అభిప్రాయ భేదాలు, ఆ సమయంలో జరిగిన మానసిక సంఘర్షణ, మ్యారేజ్ డ్రామా, ఫ్యామిలీ టెన్షన్ లాంటి అంశాలతో కలిపి ఈ సినిమా రూపొందినట్టు ట్రైలర్ స్పష్టం చేసింది. ఈ చిత్రంలో నటనకు స్కోప్ ఉన్న పాత్రలో నటించినట్టు కనిపించింది. నటిగా తనకు ఉన్న ఇమేజ్‌ను మరింత స్ట్రాంగ్‌గా మార్చుకొనేందుకు ప్రయత్నం చేసిందనే విషయం ట్రైలర్‌లో కినిపంచింది.

లవ్ సితార సినిమా ట్రైలర్‌ను తన ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేసి ఎక్సైట్ అయింది. కేరళలో షూట్ చేసిన సినిమా ఇది. నిజాయితీ తెరకెక్కించిన ఫ్యామిలీ డ్రామా. కోవిడ్ లాక్ డౌన్‌లో ఎదురైన సమస్యలను అధిగమించి చేసిన సినిమా. సెన్సిటివ్, స్ట్రాంగ్ ఎమోషన్ ఈ సినిమా. సాంప్రదాయ బంధాల ఆధారంగా నడిచే కథ ఇది. ఈ సినిమా తప్పకుండా మిమ్మల్ని మెప్పిస్తుంది అని శోభిత పేర్కొన్నారు.

జీవితంలో తనను తాను వెతుక్కొనే కథ, హృదయాన్ని గాయపరిచే ప్రేమ కథగా రూపొందిన ఈ సినిమాను రోని స్క్రూవాల నిర్మించారు. వందన కటారియా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సొనాలి కులకర్ణి, జయశ్రీ, వర్జినియా రోడ్రిగ్యూస్ లాంటి తారలు కీలక పాత్రలో నటించారు. కేరళ అందాల నడము సాగే భావోద్వేగమైన అంశాలతో కూడిన సినిమాగా జీ5 నిర్వాహకులు తెలిపారు.

More from Filmibeat

Read more about: love sitara ott sobhita dhulipala
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X