Don't Miss!
- News
mother: కూతురితో కలిసి ఆత్మహత్య చేసుకున్న తల్లి, అంగన్ వాడి టీచర్ ఇంట్లో ?
- Finance
7th cpc: ప్రభుత్వ ఉద్యోగులకు పెరగనున్న జీతాలు.. ఎప్పుడు, ఏమేమి పెరుగుతాయో తెలుసా..!
- Sports
అయ్యర్ స్థానంలో అతన్ని ఆడించండి.. శుభ్‌మన్ గిల్ మాత్రం వద్దు: దినేశ్ కార్తీక్
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Love Today OTT: ఓటీటీలోకి వచ్చేసిన లవ్ టుడే.. తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ ఎందులో అంటే!
మునుపటిలా ప్రస్తుత పరిస్థితులతో కూడిన యూత్‌ఫుల్ లవ్ స్టోరీలతో మూవీలు ఏ ఇండస్ట్రీలలోనూ పెద్దగా రావడం లేదు. దీంతో అలాంటి చిత్రాలను ఇష్టపడే వాళ్లు నిరాశకు గురవుతున్నారు. ఆ లోటు భర్తీ చేస్తూ కొన్ని సినిమాలు వచ్చినా.. పెద్దగా విజయాలు మాత్రం రావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే తమిళంలో విడుదలైన సంచలన విజయం సాధించిన ట్రెండింగ్ ప్రేమకథా చిత్రమే 'లవ్ టుడే'. అక్కడ సూపర్ డూపర్ హిట్ అవడంతో దీన్ని వేరే భాషలతో పాటు తెలుగులోకి కూడా డబ్బింగ్ చేశారు. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో దీన్ని ఎంతో గ్రాండ్‌గా విడుదల చేశారు.
Dhamaka Twitter Review: ధమాకాకు అలాంటి టాక్.. అసలైందే మైనస్‌గా.. రవితేజ మూవీ హిట్టా? ఫట్టా?
యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'లవ్ టుడే' మూవీ తెలుగు హక్కులను నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే దీన్ని కొద్ది రోజుల క్రితమే విడుదల చేశారు. దీనికి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. అలా దాదాపు రెండు వారాల పాటు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో కేవలం రెండు రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను కూడా చేరుకుని సత్తా చాటింది. అంతేకాదు, ఫుల్ రన్‌లో ఏకంగా రూ. 5 కోట్లు మేర లాభాలను కూడా సొంతం చేసుకుని రికార్డులు నమోదు చేసుకుంది.

థియేటర్లలో దాదాపు రెండు మూడు వారాల పాటు ఓ రేంజ్‌లో సందడి చేసిన 'లవ్ టుడే' మూవీని అనుకున్న సమయానికి కంటే ముందుగానే డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, అలా మాత్రం జరగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ సంస్థ.. దీన్ని నేటి (డిసెంబర్ 23వ తేదీ) నుంచి స్ట్రీమింగ్ చేస్తోంది. రాత్రి 12 గంటల నుంచి ఈ సినిమా అందుబాటులోకి వచ్చేసింది. దీంతో థియేటర్లలో మాదిరిగానే నెట్‌ఫ్లిక్స్‌లో కూడా ఈ సినిమా మంచి ఆదరణను సొంతం చేసుకుంటున్నట్లు తెలిసింది.
సరయు రాయ్ ఎద అందాల ప్రదర్శన: మరీ ఇలా టెంప్ట్ చేస్తుందేంటి!

తమిళ యువ సంచలనం ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహించి, హీరోగా నటించిన చిత్రమే 'లవ్ టుడే'. ఈ మూవీని అఘోరం, గణేష్, సురేష్‌లు సంయుక్తంగా నిర్మించారు. ఇందులో ఇవానా, రవీనా రవి హీరోయిన్లుగా నటించారు. యువన్ శంకర్ రాజా దీనికి సంగీతం అందించారు. సత్యరాజ్, యోగిబాబు, రాధిక శరత్ కుమార్‌లు ఇందులో కీలక పాత్రలు చేశారు.