OTT: ఓటిటిలో లక్కీ భాస్కర్.. దుల్కర్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?
ఈ కొన్నేళ్లలో ఇండియన్ సినిమా దగ్గర జరిగిన చాలా మార్పులు గమనించవచ్చు. ఒక భాషకి చెందిన నటీనటులు మరో భాషకి చెందిన దర్శకులతో వర్క్ చేయడం వంటివి మంచి ఎగ్జైటింగ్ గా అభిమానులకి అనిపిస్తున్నాయి. అయితే ఈ ట్రెండ్ ఇపుడు నుంచే కాదు ఎప్పుడు నుంచో ఉంది కానీ అది ఇపుడు ఇంకా ఇంట్రెస్టింగ్ గా మారింది. కాగా ఇలా మన తెలుగు దర్శకులు కూడా అనేకమంది ఇతర ఇండస్ట్రీ హీరోలతో కూడా సినిమాలు చేస్తున్నారు.
అలా దాదాపు చేసిన అందరికీ కూడా మంచి హిట్స్ ఇచ్చారు. అలా లేటెస్ట్ గా వచ్చిన ఈ తరహా కాంబినేషన్ లలో దర్శకుడు వెంకీ అట్లూరి, మలయాళ యువ హీరో దుల్కర్ సల్మాన్ కాంబినేషన్ కూడా ఒకటి. కాగా వీరి కలయికలో దీపావళి కానుకగా వచ్చిన ఆ సినిమానే "లక్కీ భాస్కర్". మరి ఆర్ధిక స్కామ్ ల నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది.

అలాగే ఆల్రెడీ 60 కోట్ల మేర గ్రాస్ ని కూడా ఇది అందుకుంది. అయితే ఇది తెలుగులో దుల్కర్ కి మూడో సినిమా కాగా దీనితో కూడా మంచి హిట్ తాను అనుకున్నట్టే అని ప్రచారం జరుగుతుంది కానీ సినిమా థియేటర్స్ లో వచ్చిన ఈ కొన్ని రోజుల్లోనే అపుడే ఓటిటి రిలీజ్ పై కూడా చర్చలు మొదలయ్యిపోయాయ్.
కాగా ఈ సినిమా కూడా అన్ని సినిమాల్లానే నెల లోపే వచ్చేస్తుంది అంటూ టాక్ ఉన్నప్పటికీ కానీ అంతకంటే ముందే వచ్చేసే ఛాన్స్ లు కూడా ఉన్నాయట. కాగా ఈ సినిమాకి ప్రీమియర్స్ నుంచే మంచి టాక్ దక్కింది కానీ ఇతర సినిమాలు మాత్రం బాగా దెబ్బ కొట్టాయి. దీనితో ఆడియెన్స్ బాగా చీలిపోవడంతో లక్కీ భాస్కర్ కి మెయిన్ గా తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు అనుకున్న రేంజ్ లో రావడం లేదు అనే టాక్ ఉంది.

దీనితో లక్కీ భాస్కర్ ప్రస్తుతానికి నవంబర్ 27 లేదా 28 కే ఓటిటిలో వచ్చేస్తుంది అని తెలుస్తుంది. అలాగే ఇంకా వసూళ్లు ఏమన్నా తేడా అయితే మాత్రం ఇంకో వారం ముందే వచ్చేసినా ఎలాంటి ఆశ్చర్యం లేదట. కాగా ఈ సినిమా నిర్మాతే తన సినిమాలు ఓటిటిలో వచ్చేందుకు నాలుగు వారాలు ఈజీగా సరిపోతుంది అని తెలిపాడు.
మాకు కావాల్సిన ధర ఇస్తే ఓటిటికి ధారాళంగా ఇచ్చేస్తామని కూడా తెలిపారు. అలాగే ఓటిటిలు కూడా కొత్త సినిమాలు ఎంత త్వరగా తీస్కొని అంత త్వరగా స్ట్రీమింగ్ కి తెచ్చుకోవాలనే చూస్తారు. సో లక్కీ భాస్కర్ విషయంలో మాత్రం ఇదే సానుకూలంగా జరిగేలా కనిపిస్తుంది. అన్నట్టు ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ని వరల్డ్ పాపులర్ సంస్థ నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. సో ఇందులో లక్కీ భాస్కర్ ఎనీ టైం అది కూడా అనుకున్న సమయం కంటే ముందే వచ్చేసినా కూడా ఎలాంటి ఆశ్చర్యం లేదట.


Click it and Unblock the Notifications











