Unstoppable 4: ఆ ఇద్దరితో తొడ కొట్టించిన బాలయ్య.. 9 గంటల తర్వాత మరో అవతారం అంటూ
Unstoppable S4: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే ('Unstoppable with NBK). బాలయ్య టాక్ షో 4వ సీజన్ గత వారమే మొదలైంది. ఈ సీజన్ తొలి ఎపిసోడ్‍కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గెస్ట్‌గా పాల్గొన్న విషయం తెలిసిందే. దీపావళి సందర్బంగా 4 సీజన్ రెండవ ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అయితే.. ఈ సీజన్‍లో తదుపరి ఎపిసోడ్ లో ఎవరు గెస్టులుగా వచ్చారు? అనేది ఆసక్తిగా మారింది. తాజాగా ఈ ఎపిసోడ్ కు సంబంధించిన తాజా ప్రోమో వచ్చేసింది. ఈ ఎపిసోడ్ లోని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ పై ఓ లూక్కేయండి.
నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న పాపులర్ టాక్ షో అన్‍స్టాపబుల్ 4వ సీజన్ గత వారమే ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సీజన్ తొలి ఎపిసోడ్‍కు మొదటి గెస్ట్ గా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గెస్ట్‌గా పాల్గొన్నారు. ఈ సీజన్‍లో రెండవ ఎపిసోడ్‍లో లక్కీ భాస్కర్ మూవీ టీమ్ పాల్గొంది. ఈ సినిమా హీరో దుల్కర్ సల్మాన్, హీరోయిన్ మీనాక్షి చౌదరి, డైరెక్టర్ వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీ గెస్టులుగా పాల్గొన్నారు. లక్కీ భాస్కర్ టీమ్ పాల్గొన్న ఎపిసోడ్‍కు సంబంధించిన ప్రోమోను నేడు విడుదలైంది. ఈ ఎపిసోడ్ లో బాలయ్య తన మాటల గారడీతో హీరో దుల్కర్ సల్మాన్ కు చుక్కలు చూపించారు.

ప్రోమో ప్రారంభం కాగానే.. బాలకృష్ణ పోలీస్ డ్రెస్‍లో.. 'గడ్డుకాలం ఎదురొచ్చినా.. చెడ్డవాడు ఎగేసుకొచ్చినా.. ధైర్యంగా నిలబడాలి దమ్ములో కలబడాలి. అలుపెరుగక సాగిపోవాలి. అన్ స్టాపబుల్ గా నిలిచిపోవాలి' అంటూ మాస్ డైలాగ్ తో ఎంట్రీ ఇచ్చారు నట సింహం నందమూరి బాలకృష్ణ.
తర్వాత యంగ్ అండ్ డైనమిక్ అంటూ హీరో దుల్కర్ సల్మాన్ ను ఆహ్వానించాడు. వచ్చి రాగానే.. 'ఏంటి ఈ గ్లామర్.. నన్ను నేను చూసుకున్నట్లు ఉంది' అంటూ దుల్కర్ పై బాలయ్య తనదైన స్టైల్ లో ఓ పంచ్ డైలాగ్ వేశాడు. "మీరు ఐకానిక్ సర్" అని దుల్కర్ చెప్పారు. ఆ తర్వాత హిందీ కవిత చెప్పారు.
ఆ తర్వాత దుల్కర్ సల్మాన్ తో బెలూన్ గేమ్ ఆడించి హడలెక్కించాడు. ఈ సమయంలో దుల్కర్ మాట్లాడుతూ.. నేను క్వశ్చన్ అడగవచ్చా ? అని రిక్వెస్ట్ చేశాడు.'ఇది నా టాక్ షో నా.. దుల్కర్ టాక్ షో నా..' అంటూ.. ప్రశ్న అడగకుండా చేశాడు. ఆ తర్వాత దుల్కర్‌ను ప్రశ్న అడిగారు. నీకు కార్లు అంటే ఇష్టం కదా.. మరి ఎంత స్పీడ్ లో వెళ్తావు? అని అడగగా.. ' 300 స్పీడ్ తో వెళ్తా' అంటూ స్టన్నింగ్ రిప్లే ఇస్తాడు. ఆ సమాధానానికి బాలయ్య షాక్ అయ్యి.. 'మమ్ముట్టి గారు.. నమస్కారం.. మీ అబ్బాయిని చూడండి. మనం 200 అయితే..మనోడు 300 'అంటూ బాలయ్య సెటైరికల్ గా కామెంట్ చేశాడు. ఆ తర్వాత హీరో దుల్కర్ తండ్రి, మలయాళం సీనియర్ స్టార్ మమ్ముట్టికి కాల్ చేసి మాట్లాడాడు బాలయ్య.
ఆ తర్వాత డైరెక్టర్ వెంకీ అట్లూరిని ఆహ్వానించాడు. రావడం రావడంతోనే వెంకి.. బాలయ్య కాళ్లపై పడిపోయాడు. 'నువ్వేమో ఇలా వంగి వంగి నమస్కారాలు చేస్తున్నావ్.. మీవోడు చూసావా.. నా దగ్గరికి వచ్చి ఫోన్లో చాటింగ్ చేస్తున్నాడు' బాలయ్య అనగానే .. ఆ డైలాగ్ తో హీరో దుల్కర్ అవాక్క్ అవుతాడు. ఆ తర్వాత వెంకీ అట్లూరి నీ కూర్చున్న పెట్టి ..'ఏమయ్యా వెంకీ మీ ఇంటికి వస్తే.. బిస్కెట్లు పెట్టి పంపిస్తా.. ఏంటయ్యా ఈ మర్యాద అన్నట్లుగా బాలకృష్ణ చూస్తాడు.
'బిస్కెట్లతో మొదలపెడదాం సార్..' అని వెంకీ అట్లూరి సమాధానం ఇవ్వగా..'మరి వాటిని దీనిలో ముంచుకోవాలి' అంటూ తిరిగి ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాని వెంకీ.. 'టీ లో ముంచుకోండి సార్' అంటాడు. 'వేరే దానిలో ముంచుకుంటే బాగోదా?' అంటూ బాలయ్య మరో ప్రశ్నించగా.. 'నైట్ 9 అయితే.. మెన్షన్ హౌస్' అంటూ కిక్ ఇచ్చే సమాధానం ఇస్తాడు వెంకీ. ఆ సమాధానానికి మెచ్చిన బాలయ్య'
మనదంతా యూనిక్ స్టైల్ కదా..' అంటూ కౌంటర్ చేస్తాడు.
ఆ తర్వాత వెంకీ అట్లూరి హీరో దుల్కర్ సల్మాన్ తో బిపి పెంచే గేమ్ ను ఆడిస్తాడు. ఈ సమయంలో ప్రొడ్యూసర్ నాగ వంశీ, హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా ఎంట్రీ ఇస్తారు. వాళ్ళతో కూడా గేమ్ ఆడిస్తాడు. ఈ సమయంలో ఎప్పటి నుంచో పని చేయాలి అని ఎదురుచూస్తున్న హీరోయిన్ ఎవరు అని వెంకీ అట్లూరిని బాలకృష్ణ అడిగారు.'మనోడికి పూజ హెగ్డే పై కన్ను పడింది సార్'అంటూ నిర్మాత నాగ వంశీ షాకింగ్ సమాధానం ఇస్తాడు.
దీంతో బాలయ్య షాక్ అయి.. 'వెంకీ నీ హైట్ ఏంటి? పూజ హెగ్డే హైట్ ఏంటి? అంటూ బాలకృష్ణ దిమ్మ తిరిగిపోయే పంచ్ వేస్తాడు. 'పర్లేదు సార్.. మ్యాచ్ అవుతాం' అంటూ వెంకీ ఫన్నీ రిప్లై ఇస్తాడు. ఆ సమాధానంతో హీరో దుల్కర్ సల్మాన్, హీరోయిన్ మీనాక్షి చౌదరి పడి నవ్వుతారు. ఆడియన్స్ కూడా గట్టిగా నవ్వేస్తారు. ఇలా.. బాలయ్య మాటల తూటాలకు.. లక్కీ భాస్కర్ మూవీ టీం చుక్కలు చూసింది. మొత్తానికి ఈ ప్రోమో మాత్రం చాలా ఆసక్తిగా ఉంది. ఈ ప్రోమో వైరల్ కావడంతో జై బాలయ్య అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.
ఇదెలా ఉండగా.. లక్కీ భాస్కర్ టీమ్ పాల్గొన్న అన్‍స్టాపబుల్ సీజన్ 4 రెండో ఎపిసోడ్ అక్టోబర్ 31 సాయంత్రం 7 గంటలకు ఆహా ఓటీటీ స్ట్రీమింగ్‍కు రానుంది. కాగా, దీపావళి సందర్భంగా లక్కీ భాస్కర్ చిత్రం కూడా అక్టోబర్ 31 థియేటర్లలో విడుదల కానున్నది. వాచ్ అండ్ ఎంజాయ్..


Click it and Unblock the Notifications











