మా ఊరి పొలిమేర సీక్వెల్ రెడీ.. రిలీజ్ ఎక్కడ? ఎప్పుడంటే?
నటీనటులు: సత్యం రాజేష్, డాక్టర్ కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రాకేందు మౌళి, అక్షత, బాలాదిత్య, సాహితి దాసరి, రవి వర్మ, చిత్రం శ్రీను తదితరులు
స్టోరి, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: డాక్టర్ అనిల్ విశ్వనాథ్
నిర్మాత: గౌరి కృష్ణ
సంగీతంః గ్యాని
సినిమాటోగ్రఫి: ఖుషేందర్ రమేష్ రెడ్డి
ఎడిటింగ్: శ్రీ వర
కో-డైరెక్టర్: ఆకుల నాగ్
ఆర్ట్ డైరెక్టర్: ఉపేంద్ర రెడ్డి చందా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎన్‌సీ సతీష్ కుమార్
పీఆర్వోః జీకే మీడియా
అనిల్ విశ్వనాథ్ దర్శకత్వలో రూపొందిన మా ఊరి పొలిమేర వెబ్ సిరీస్ భారీ స్పందనను కూడగట్టుకొన్నది. ఓటీటీలో మంచి వ్యూవర్ షిప్‌ను సొంతం చేసుకొన్నది. తొలి సీజన్ అందించిన ఉత్సాహంతో సీక్వెల్‌కు సిద్దమైంది. శ్రీ కృష్ణ క్రియేషన్స్ బేనర్‌పై గౌరు గణబాబు సమర్పణలో గౌరికృష్ణ నిర్మాతగా డాక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో మా ఊరి పొలిమేర 2 రూపొందుతున్నది. సత్యం రాజేష్, డాక్టర్ కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రాకేందు మౌళి, అక్షత, బాలాదిత్య, సాహితి దాసరి, రవి వర్మ, చిత్రం శ్రీను ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
బ్లాక్ మ్యాజిక్ (మంత్ర శక్తులు కథా నేపథ్యం)తో రూపొందిన రూరల్ నెటివిటీ చిత్రం ఇటీవలే మా ఊరి పొలిమేర 2 షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ మా ఊరి పొలిమేర 2 పోస్టర్ చాలా బాగుంది. ఈ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరికీ నా శుభాకాంక్షలు అని అన్నారు.

నటుడు సత్యం రాజేశ్ మాట్లాడుతూ.. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన మా ఊరి పొలిమేర చిత్రాన్ని ఎంతో ఆదరించారు. దానికి సీక్వెల్‌గా వస్తున్న మా ఊరి పొలిమేర 2 త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్నది. మా ఊరి పొలిమేర 2ను కూడా అదే విధంగా ఆదరిస్తారని నమ్ముతున్నాం. దర్శకుడు సీక్వెల్‌ను అద్భుతంగా తెరకెక్కించారు. నిర్మాత గౌరికృష్ణ ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు అని అన్నారు.
నిర్మాత గౌరికృష్ణ మాట్లాడుతూ.. మా ఊరి పొలిమేర 2 చిత్రం ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మా ఊరి పొలిమేర చిత్రాన్ని చూసి చాలా ఎగ్జైట్ అయ్యాను. అందరం ఒక ఫ్యామిలీలాగా ఈ చిత్రాన్ని కంప్లీట్ చేశాం. దర్శకుడు మా ఊరి పొలిమేరను మించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. త్వరలోనే టీజర్ కూడా రిలీజ్ చేస్తాము అని అన్నారు.

దర్శకుడు డాక్టర్ అనిల్ విశ్వనాథ్ మాట్లాడుతూ.. మా ఊరి పొలిమేర 2 ఫస్ట్‌లుక్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేయడం చాలా పాజిటివ్‌గా అనిపించింది. మా ఊరి పొలిమేర చిత్రాన్ని ప్రేక్షకులందరూ బాగా ఆదరించారు. మా ఊరి పొలిమేర చిత్రానికి సీక్వెల్ ఉందా? లేదా? అని చాలా మంది అడుగుతున్నారు. ఈ ప్రశ్నకి సమాధానంగా మా ఊరి పొలిమేర 2 ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం జరిగింది. ఈ చిత్రం విడుదల తేదీలను నిర్మాత గౌరికృష్ణ త్వరలోనే వెల్లడిస్తారు అని అన్నారు.


Click it and Unblock the Notifications











