Maama Mascheendra: 14 రోజులకే ఓటీటీలోకి వచ్చిన మూవీ.. ఆ రెండు ఫ్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్

తెలుగు చిత్ర పరిశ్రమంలో హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్లే యంగ్ హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారు. అందులో టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు ఒకడు. సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా తెరంగేట్రం చేసిన అతడు.. ఎన్నో ప్రయోగాలు చేసినా విజయాలను అంతగా అందుకోలేదు. అయినా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.

చాలా కాలంగా విజయాన్ని అందుకోలేక ఇబ్బంది పడుతోన్న సుధీర్ బాబు ఇటీవలే 'మామా మశ్చీంద్రా' అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. అతడు ట్రిపుల్ రోల్ చేసిన ఈ చిత్రాన్ని ప్రముఖ నటుడు, దర్శకుడు హర్షవర్ధన్ రూపొందించాడు. క్రేజీ కాన్సెప్టుతో తెరకెక్కిన ఈ సినిమా ఆరంభంలోనే ఎన్నో అంచనాలను ఏర్పరచుకుని అక్టోబర్ 6న విడుదల అయింది.

 Maama Mascheendra Movie Streaming Started on Amazon Prime and AHA

విభిన్నమైన కాన్సెప్టుతో రూపొందిన 'మామా మశ్చీంద్రా' (Maama Mascheendra) మూవీకి ఆరంభంలోనే నెగెటివ్ టాక్ వచ్చింది. దీంతో మొదటి రోజు నుంచే ఈ సినిమాకు ప్రేక్షకుల స్పందన కరువైంది. ఫలితంగా చాలా ప్రాంతాల్లో జీరో షేర్‌తో సరిపెట్టుకుంది. ఆ తర్వాత కూడా ఈ చిత్రం అంతగా తేరుకోలేకపోయింది. ఫలితంగా వారంలోనే రన్ క్లోజ్ చేసుకుంది.

సుధీర్ బాబు త్రిపాత్రాభినయం చేసి 'మామా మశ్చీంద్రా' మూవీపై ఆరంభంలోనే మంచి హైప్ క్రియేట్ అయింది. దీంతో ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు మంచి పోటీనే ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా సంస్థలు మంచి ధరకు కొనుగోలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

థియేటర్లలో వారం రోజులు కూడా రన్‌ను కొనసాగించలేకపోయిన 'మామా మశ్చీంద్రా' మూవీని అనుకున్న దానికంటే ముందుగానే స్ట్రీమింగ్ చేస్తారని ప్రచారం జరిగింది. అందుకు అనుగుణంగానే దీన్ని థియేటర్లలోకి వచ్చిన రెండు వారాలకే అంటే అక్టోబర్ 20 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అమెజాన్ ప్రైమ్, ఆహా సంస్థలు ప్రకటించాయి.

ముందుగా ప్రకటించిన దాని ప్రకారం.. సుధీర్ బాబు నటించిన 'మామా మశ్చీంద్రా' మాత్రం రెండు వారాలకే స్ట్రీమింగ్‌ అవుతోంది. నేటి అర్ధరాత్రి నుంచే ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా సంస్థలు అందుబాటులోకి తెచ్చేశాయి. దీంతో అత్యంత త్వరగా ఓటీటీలోకి వచ్చిన చిత్రాల జాబితాలో ఇది కూడా చేరింది. మరి ఓటీటీలోనైనా ఇది సత్తా చాటుతుందో చూడాలి.

ఇక, 'మామా మశ్చీంద్రా' మూవీని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోషన్ నిర్మించారు. ఇందులో ఈషా రెబ్బా, మృణాళిని హీరోయిన్లుగా.. రవి, హర్షవర్ధన్, రాజీవ్ కనకాల తదితరలు కీలక పాత్రల్లో నటించారు. చైతన్ భరద్వాజ్, ప్రవీణ్ మ్యూజిక్ అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X