MAD OTT: మ్యాడ్ మూవీ ఓటీటీ డేట్ ఫిక్స్.. కడుపుబ్బా నవ్వడానికి రెడీనా?

తెలుగు చిత్ర పరిశ్రమలో ఫుల్ లెంగ్త్ ఫన్ ఎంటర్‌టైనర్ మూవీలు చాలా తక్కువగానే వస్తున్నాయి. అందుకే ఆ తరహాలో రూపొందుతోన్న చిత్రాలకు ప్రేక్షకులు మంచి స్పందనను అందిస్తున్నారు. ఇలా ఈ మధ్య కాలంలో వచ్చిన చిత్రాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఈ కోవకే చెందిన సినిమానే 'మ్యాడ్'. కాలేజ్ బ్యాగ్‌డ్రాప్‌తో యూత్‌ఫుల్ సబ్జెక్టుతో ఇది రూపొందింది.

సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రమే 'మ్యాడ్'. కల్యాణ్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రానికి యూఎస్‌లోని ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో సైతం ఇదే సీన్ కనిపించింది. దీనికి తగ్గట్లుగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన భారీ స్థాయిలోనే దక్కింది. దీంతో ఈ సినిమాకు వసూళ్లు కూడా అదిరిపోయే రీతిలో వచ్చాయి. ఇలా ఈ చిత్రం ఫుల్ రన్‌లో భారీ కలెక్షన్లనే రాబట్టింది. తద్వారా కొన్ని కోట్ల లాభాలను సైతం సొంతం చేసుకుంది.

MAD Movie Digital Streaming On Netflix From November 3rd

పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'మ్యాడ్' మూవీ నుంచి వచ్చిన ప్రచార చిత్రాలకు మంచి ఆదరణ లభించింది. ఫలితంగా ఈ సినిమాపై క్రమంగా అంచనాలు పెరిగాయి. దీంతో దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు పోటీ కూడా ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను మంచి ధరకు దక్కించుకుంది.

MAD Movie Digital Streaming On Netflix From November 3rd

థియేటర్లలో విడుదలైన 4 వారాల తర్వాతనే 'మ్యాడ్' మూవీని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని తెలిసింది. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాను నవంబర్ 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు తీసుకు వస్తున్నారట. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈరోజే, రేపో అధికారికంగా ప్రకటించబోతుందని తెలుస్తోంది.

MAD Movie Digital Streaming On Netflix From November 3rd

యువ హీరోలు నటించిన 'మ్యాడ్' మూవీని సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ బ్యానర్లపై నాగ వంశీ సమర్పణలో సూర్యదేవర హారిక, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఇందులో శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక, గోపిక, రఘుబాబు, రచ్చ రవి, మురళీధర్ గౌడ్ వంటి వాళ్లు నటించారు. ఈ సినిమాకు భీమ్స్ సంగీతాన్ని సమకూర్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X