ఆ ఓటీటీలోకి వచ్చేసిన కామెడీ మూవీ.. పొట్టచెక్కలయ్యేలా నవ్వాలంటే చూడాల్సిందే!
కాలేజ్ బ్యాగ్‌డ్రాప్‌లో వచ్చే కామెడీ మూవీలకు తెలుగు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలోనే రెస్పాన్స్ వస్తుంటుంది. ఇలా ఇప్పటికే ఎన్నో చిత్రాలు రాగా.. అవన్నీ విజయాలను సొంతం చేసుకున్నాయి. ఈ మధ్య కాలంలో ఇలాంటి చిత్రాల సంఖ్య తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే ఆడియెన్స్ ముందుకొచ్చిన యూత్‌ఫుల్ కాలేజ్ బ్యాగ్‌డ్రాప్ మూవీనే 'మ్యాడ్'.
సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ హీరోలుగా రూపొందిన చిత్రమే 'మ్యాడ్'. కల్యాణ్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మంచి టాక్ వచ్చింది. దీనికి తగ్గట్లుగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన భారీగా దక్కింది. దీంతో ఈ సినిమాకు వసూళ్లు కూడా ఊహించని విధంగా వచ్చాయి. ఇలా ఈ చిత్రం ఫుల్ రన్‌లో భారీ కలెక్షన్లనే రాబట్టింది. తద్వారా కొన్ని కోట్ల లాభాలను కూడా ఖాతాలో వేసుకుంది.

ఫుల్ లెంగ్త్ ఫన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'మ్యాడ్' మూవీ నుంచి వచ్చిన ప్రచార చిత్రాలకు అదిరిపోయే రీతిలో ఆదరణ లభించింది. ఫలితంగా ఈ సినిమాపై క్రమంగా అంచనాలు పెరిగాయి. దీంతో ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు పోటీ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను మంచి ధరకు కొనేసింది.
'మ్యాడ్' మూవీని థియేటర్లలో విడుదలైన 4 వారాల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారు. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాను నవంబర్ 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు తీసుకు వచ్చారు. ఇందులో సెన్సార్ బోర్డు కట్ చేసిన సీన్స్, డైలాగులు కూడా యాడ్ చేశారని తెలిసింది. అప్పుడే ఈ చిత్రానికి నెట్‌ఫ్లిక్స్‌లో భారీ స్పందన లభిస్తోంది.

యువ హీరోలు సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ నటించిన 'మ్యాడ్' మూవీని సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ బ్యానర్లపై నాగ వంశీ సమర్పణలో సూర్యదేవర హారిక, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఇందులో శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక, గోపిక, రఘుబాబు, రచ్చ రవి, మురళీధర్ గౌడ్ వంటి వాళ్లు నటించారు. ఈ సినిమాకు భీమ్స్ సంగీతం ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











