Mad square OTT : ఓటీటీలోకి మ్యాడ్ స్క్వేర్ .. ఎన్టీఆర్ బావమరిది మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

గతంలో వచ్చిన మ్యాడ్ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాలేజీలు, ఫ్రెండ్‌షిప్, అబ్బాయిలు అమ్మాయిల స్నేహం, ప్రేమ వంటి ఎలిమెంట్స్ చుట్టూ తిరిగే ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌కు కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. అలాంటి సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కించిన మూవీయే మ్యాడ్ స్క్వేర్. ఫస్ట్ పార్ట్‌కు ఏమాత్రం తగ్గకుండా సెకండ్ పార్ట్‌ను కూడా అద్భుతంగా తీర్చిదిద్దారు. థియేటర్‌లో హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా త్వరలో ఓటీటీలోకి రానుంది. ఈ వివరాల్లోకి వెళితే..

మ్యాడ్ స్క్వేర్‌లో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌లు లీడ్ రోల్స్ పోషించగా కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. రంజాన్ కానుకగా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్, శ్రీకర స్టూడియో, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై హారిక స్యూరదేవర, సాయి సౌజన్యలు ఈ సినిమాను దాదాపు రూ.40 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇద్దరు సంగీత దర్శకులు థమన్, భీమ్స్ సిసిరోలియోలు మ్యాడ్ స్క్వేర్ కోసం పనిచేయడం విశేషం.

Mad Square ott release here is the Narne Nithiin s Movie ott streaming details

చిన్న సినిమా అయినప్పటికీ గతంలో మ్యాడ్ సినిమా బ్రాండ్ .. టీజర్లు, ట్రైలర్లు కారణంగా ఈ సినిమా ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్‌కు మంచి రేటొచ్చింది. మ్యాడ్ స్క్వేర్‌కు ప్రపంచవ్యాప్తంగా రూ.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా.. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే రూ.23 కోట్ల షేర్.. రూ.46 కోట్ల గ్రాస్ రాబట్టాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. మ్యాడ్‌ స్క్వేర్‌కు తొలి రోజునే రికార్డు స్థాయిలో రూ. 18 కోట్ల ఓపెనింగ్స్ రావడంతో ఇండస్ట్రీ వర్గాలు సైతం షాక్ అయ్యాయి.

ఐదు రోజుల్లోనే మ్యాడ్ స్క్వేర్ ప్రపంచవ్యాప్తంగా రూ.74 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సితార ఎంటర్‌టైన్మెంట్స్ అధికారికంగా వెల్లడించింది. ఓవర్సీస్ ప్రేక్షకులు కూడా మ్యాడ్ స్క్వేర్‌‌కు బ్రహ్మరథం పట్టారు. 17 రోజుల వరకు రోజుకు రూ.50 లక్షల గ్రాస్ తగ్గకుండా వచ్చిన మ్యాడ్ స్క్వేర్ తర్వాతి నుంచి తన హవా కోల్పోయింది. సాక్‌నిల్క్ వెబ్‌సైట్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మ్యాడ్ స్క్వేర్ భారత్‌లో రూ.49.99 కోట్ల నెట్, రూ.58.27 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇండియాలో వచ్చిన గ్రాస్ రూ.58.27 కోట్లు + ఓవర్సీస్‌లో కలెక్ట్ చేసిన రూ.12.5 కోట్లు కలిపి మొత్తంగా 25 రోజుల వరకు నార్నే నితిన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.70.77 కోట్ల కలెక్షన్స్ సాధించింది.

చిన్న సినిమాగా విపరీతమైన పొటీలో విడుదలైన మ్యాచ్ స్క్వేర్ మూవీ బడా సినిమాలను సైతం ఢీకొట్టి థియేటర్‌లో ఘన విజయం సాధించింది. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆ సెక్షన్ ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను కళ్లు చెదిరే ధరకు సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మ్యాడ్ స్క్వేర్‌ను ఈ నెల 25 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీలో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంచుతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. మరి ఓటీటీలో ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

More from Filmibeat

Read more about: Mad Square narne nithiin ott news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X