Mad Square OTT : మ్యాడ్ స్క్వేర్ ఓటీటీ వివరాలు.. స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడు?
యూత్ ఫుల్ మూవీ మ్యాడ్ స్క్వేర్ ఇవాళ మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2023 లో వచ్చిన మ్యాడ్ చిత్రానికి ఇది సీక్వెల్. మొదటి భాగం ఘన విజయం సాధించడంతో మేకర్స్ ఇప్పుడు మ్యాడ్ 2ని మ్యాడ్ స్క్వేర్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కుతుండడం విశేషం. ఇప్పటికే సినిమాకు మంచి హై ఉండటంతో పాటు థియేటర్లలో ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు.
అయితే, ఈ చిత్రం ఈరోజు థియేట్రికల్ రిలీజ్ గ్రాండ్గా జరగడంతో పాటు ఓటీటీ డిటేయిల్స్ కూడా ఆసక్తికరంగా మారాయి. మ్యాడ్ స్వ్కేర్ చిత్రానికి ప్రస్తుతం మంచి టాక్ వినిపిస్తుండటంతో బాక్సాఫీస్ కలెక్షన్లు ఎలా ఉండబోతాయనేది ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలో ఈ చిత్రంలో ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందని కూడా ఫ్యాన్స్, ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మ్యాడ్ స్క్వేర్ కు సంబంధించిన ఓటీటీ డిటేయిల్స్ అందాయి.

ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. థియేట్రికల్ రిలీజ్ కు ముందే ఆ సంస్థ డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్నది తెలుస్తోంది. అయితే మ్యాడ్ స్క్వేర్ కు మంచి టాక్ వినిపిస్తుండటంతో ఓటీటీ రిలీజ్ ఎప్పుడనేది చూడాలి. ఇప్పుడైతే ఓటీటీ రిలీజ్ డేట్ ను ఖరారు చేయలేదు. మరోవైపు ఈ చిత్రం థియేట్రికల్ లాంగ్ రన్ జరిగిలేలా ఉండటంతో ఓటీటీ రిలీజ్ కు ఇంకాస్తా సమయం పట్టేలా ఉంది. సాధారణంగా ఏ చిత్రమైన థియేట్రికల్ రన్ జరిగిన నాలుగు వారాలకు ఓటీటీలోకి వస్తుంది.
కానీ సినిమా టాక్ బాగుండి, బాక్సాఫీస్ కలెక్షన్లు అదిరిపోతే మాత్రం ఓటీటీ రిలీజ్ కు ఇంకాస్తా సమయం పడుతుంది. ఇక మ్యాడ్ స్క్వేర్ ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే.. ఇదే రోజు నితిన్ - శ్రీలీలా జంటగా నటించిన 'రాబిన్ హుడ్' చిత్రం కూడా థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ సినిమాకు పోటీగా ఈ చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాబిన్ హుడ్ కంటే.. మ్యాడ్ స్క్వేర్ కే మంచి రెస్పాన్స్ దక్కుతుండటంతో ఈ చిత్రం బాక్సాఫీస్ కలెక్షన్లు కూడా అదిరిపోవడం ఖాయమని అంటున్నారు.
ఇక మ్యాడ్ స్క్వేర్ చిత్రాన్ని ఇండియాతో పాటు ఓవర్సీస్ లోనూ గ్రాండ్ గా విడుదల చేశారు. అక్కడ కూడా ఈ చిత్రానిదే పై చేయి కావడంతో ప్రస్తుతం బాక్సాఫీస్ కలెక్షన్లపై మంచి ఆసక్తి నెలకొంది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ లు ప్రధాన పాత్రల్లో అలరించారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్, శ్రీకర స్టూడియో, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. నిర్మాత స్యూరదేవర నాగవంశీ సమర్పించిన ఈ చిత్రాన్ని హారిక స్యూరదేవర, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరించారు. భీమ్స్ సిసిరోలియో పాటలు అందించగా, ఎస్ఎస్ థమన్ నేపథ్య సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











