OTTలోకి వచ్చేసిన ఇంట్రెస్టింగ్ రియల్ స్టోరీ... ఎందులో చూడాలంటే?

ఓటీటీ లవర్స్ కోసం.. సంస్థలు కొత్త కంటెంట్ సినిమాలు, సిరీసులు తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఓ రియల్ ఇన్సిడేంట్ ఆధారంగా ఓ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. ఆ భయానక క్షణాలను గుర్తు చేసేలా మళ్లీ ఆ సిరీస్ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అదేంటో కాదు.. ది రైల్వే మెన్. ఈ సీరిస్.. మధ్య ప్రదేశ్ లో జరిగిన భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఆధారంగా తెరకెక్కింది. ఈ దుర్ఘటనలో వేల మంది ప్రాణాలు కోల్పోగా.. లక్షల మంది బాధితులుగా మిగిలారు. ఇప్పుడు ఈ సీరిస్ చూసి.. మళ్లీ కన్నీళ్లు పెట్టుకున్నారు. అసలు దీని కథేంటి.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఓటీటీలో ఓ వెబ్ సిరీస్ ఇప్పుడు కంటతడి పెట్టిస్తుంది. ఆ భయానక క్షణాలను గుర్తు చేస్తుంది. మధ్యప్రదేశ్‌ లో జరిగిన భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. 1984వ సంవత్సరం డిసెంబర్‌ 2న మధ్యప్రదేశ్‌ భోపాల్‌ లోని యూనియన్‌ కార్బైడ్‌ ఇండియా లిమిటెడ్‌ పెస్టిసైడ్‌ ప్లాంట్లో మిథైల్‌ ఐసోసనియేట్‌ గ్యాస్ లీకైంది. ఇక ఆ రసాయనం పీల్చి... లక్షల మంది అస్వస్థతకు గురయ్యారు. వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

Madhavan The Railway Men Web Series Streaming Now on Netflix OTT Bhopal Disaster Real Story

యావత్ దేశాన్ని కుదిపేసిన ఈ దుర్ఘటన ఆధారంగా ఇప్పుడు ది రైల్వే మెన్ తెరకెక్కింది. భోపాల్‌ గ్యాస్ విపత్తు ఆధారంగా యశ్ రాజ్ ఫిలింస్ ఈ వెబ్ సిరీస్ ను రూపొందించింది. ఈ వెబ్ సిరీస్ లో ఆర్ మాధవన్, కెకె మీనన్, దివ్యేందు శర్మ, ఇర్ఫాన్ ఖాన్ కుమారుడు బాబిల్ ఖాన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ది రైల్వే మెన్ సిరీస్‌ లో మాధవన్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ పాత్రలో నటించాడు. కెకె మీనన్ స్టేషన్ మాస్టర్ గా నటించారు.

ఇక ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ వేదికగా నవంబర్ 18వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వెబ్ సీరిస్ ను శివ్ రావైల్ డైరెక్ట్ చేశాడు. ఆయన దర్శకత్వం వహించిన మొదటి సీరిస్ ఇది. ఇక ఆయుష్ గుప్తా కథను అందించగా... యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ సిరీసును నెట్ ఫ్లిక్స్ తో కలిసి సంయుక్తంగా తెరకెక్కించింది. ఇక ఈ సీరిస్ కు ఇప్పటికే మంచి ఆదరణ వస్తుంది. నెట్ ఫ్లిక్స్ లో ఈ సిరీస్ ట్రెండింగ్ లో నిలిచింది.

Madhavan The Railway Men Web Series Streaming Now on Netflix OTT Bhopal Disaster Real Story

ఇప్పటికే ఈ ఘటనపై రెండు చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు ఈ దుర్ఘటనపై ది రైల్వే మెన్ వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఇక ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌ అవుతుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సీరిస్ అందుబాటులో ఉంది. ఇక ఈ సిరీస్ చూసిన చాలా మంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆ భయానక క్షణాలను తలుచుకుని ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి రియల్ స్టోరీ మీరు చూడాలనుకుంటే ఇంట్లోనే కూర్చోని చూసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X