ఓటీటీని షేక్ చేస్తున్న దొంగబాబా మూవీ..సూపర్ స్టార్ కొడుకు ఎంట్రీ సిరీస్‌కు రికార్డు వ్యూస్..ఎక్కడ చూడొచ్చంటే?

గడిచిన కొన్నేళ్లలో ఓటిటి సామ్రాజ్యం ప్రపంచ వ్యాప్తంగా ఎంతలా పాపులర్ అయ్యిందో తెలిసిందే. అలా గడిచిన ప్యాండమిక్ సమయంలో పలు చిత్రాలు నేరుగా ఓటిటికి రావడం అనే ట్రెండ్ మొదలయ్యింది. అప్పుడు థియేటర్స్ లేవు కాబట్టి డైరెక్ట్ రిలీజ్ వాటిలో చేసేసారు. కానీ ఇప్పటికీ కూడా పలు చిత్రాలు ఇంకా ఓటిటి లోనే నేరుగా స్ట్రీమింగ్ కి వస్తున్నాయి.

ఇవి ఒక రకంగా సేఫ్ సైడ్ ఆలోచనలే కానీ స్టార్ హీరోల కొడుకులు కూడా థియేటర్స్ లో సినిమా రిలీజ్ కి భయపడుతున్నారు. అలా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ నటించిన రీసెంట్ చిత్రం "మహారాజ్" నేరుగా ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ సినిమా హక్కులు వరల్డ్ నెంబర్ 1 ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా ఈ సినిమా గత కొన్ని రోజులు కితమే స్ట్రీమింగ్ కి వచ్చింది.

Maharaj trending on Netflix junaid khan maharaj movie got mind blowing response in ott

కాగా ఈ సినిమా రిలీజ్ కి ముందే పలు కాంట్రవర్సీలు మూట గట్టుకుంది. ఈ సినిమా హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా ఉంటుంది అని ముందే కొందరు హెచ్చరించారు. మరి ఆ మూమెంట్ లోనే రిలీజ్ కి వచ్చేసిన ఈ సినిమా ఓటిటిలో వచ్చాక నిజంగా కాంట్రవర్సీ అవుతుంది అనుకుంటే దానికి రివర్స్ లో దుమ్ము లేపే రెస్పాన్స్ తో దూసుకెళ్తుంది.

తాజాగా ఈ చిత్రం ఇండియా లోనే నెంబర్ 1 సినిమా ట్రెండింగ్ అవుతుండగా ఒక్క ఇండియా లోనే కాకుండా గ్లోబల్ గా కూడా ఈ సినిమా ఏకంగా 22 దేశాల్లో ట్రెండ్ అవుతుందట. ఇంతే కాకుండా గత వారం రోజుల ఛార్ట్స్ లో అయితే ఈ సినిమాకి నెట్ ఫిక్స్ లో ఏకంగా 5.3 మిలియన్ వ్యూస్ నమోదు కావడం మరో భారీ రెస్పాన్స్ అని చెప్పాలి.

Maharaj trending on Netflix junaid khan maharaj movie got mind blowing response in ott

కాగా ఈ సినిమా లైన్ చూస్తే దైవ సన్నిధిలో ఉంటూ భగవంతునితో సమానంగా సేవలు అందుకునే కొందరు దొంగ బాబాలు మంచి ముసుగులో ఆడవాళ్లపై చేసిన అకృత్యాలు వాటి వల్ల నష్టపోయిన ఓ యువ జర్నలిస్ట్ చేసిన పోరాటమే ప్రధాన కథ. కాగా ఆ బాబా పాత్రలో బాలీవుడ్ నటుడు జై దీప్ అహల్వాట్ అద్భుతంగా నటించగా ఆ యువ జర్నలిస్ట్ గా అమీర్ కొడుకు జునైద్ ఖాన్ నటించాడు.

అలాగే ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా అర్జున్ రెడ్డి బ్యూటీ షాలిని పాండే నటించింది. బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ మల్హోత్రా ఈ చిత్రానికి దర్శకత్వ భాద్యతలు తీసుకున్నారు. మరి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో హిందీ సహా తెలుగులో కూడా అందుబాటులో ఉంది. మరి ఈ బోల్డ్ అండ్ రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన సినిమాని చూడాలి అనుకునేవారు నెట్ ఫ్లిక్స్ లో ట్రై చేయాలి అనుకుంటే చూడొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X