Maharaja On OTT ఓటీటీలో విజయ్ సేతుపతి 100 కోట్ల మూవీ.. మహారాజ ఎక్కడ? ఎప్పుడు? చూడొచ్చంటే
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి తెలుగువారికి కూడా ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఉప్పెన సినిమా కన్నా ముందే మన తెలుగువారిని కూడా తనదైన నటనతో విజయ్ సేతుపతి ఫిదా చేశాడు. ఇక ఉప్పెనలో రాయనం పాత్రతో మెప్పించి మరింత దగ్గరయ్యాడు. అభిమానులు ఆయనను ఎంత ఓన్ చేసుకున్నారు అంటే.. విజయ్ సేతుపతి సినిమా వస్తుంది అంటే తెలుగు సినిమాలను కూడా పక్కన పెట్టేస్తున్నారు.
ఇక విజయ్.. సినిమాలతోనే తన వ్యక్తిత్వంతో కూడా తెలుగువారి మనసులో చోటు సంపాదించుకున్నాడు. ముఖ్యంగా కుర్ర హీరోయిన్లతో రొమాన్స్ చేయాలనుకొనే సీనియర్ హీరోలు ఉన్న ఇండస్ట్రీలో.. ఉప్పెన సినిమాలో కూతురుగా నటించిన కృతిశెట్టి పక్కన హీరోగా నటించడానికి తన మనసు ఒప్పుకోదని, తండ్రి కూతుళ్ళగా మెలిగిన తాము.. సినిమాలో అయినా రొమాన్స్ చేయలేనని ఖరాకండీగా చెప్పుకొచ్చాడు. ఆ ఒక్క మాటతో తెలుగు అభిమానులు విజయ్ సేతుపతికి గుండెల్లో గుడి కట్టేశారు.

విజయ్ సేతుపతి కథల ఎంపిక నెక్ట్స్ లెవెల్ అని చెప్పుకోవాలి. పాత్రకు ప్రాధాన్యత ఉండాలే కానీ, ఎలాంటి పాత్ర చేయడానికి అయినా ఆయన వెనుకాడడు. ఇక తాజాగా విజయ్ సేతుపతి నటించిన మహారాజ ఎంతటి హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సైలెంట్‌గా థియేటర్లలో రిలీజైన ఈ మూవీ వంద కోట్ల వసూళ్లను రాబట్టింది.
ఇక మహారాజ కథ గురించి చెప్పాలంటే.. తన కూతురిపై జరిగిన అన్యాయానికి ఓ తండ్రి ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనేది. ఇలాంటి కథలు, రివెంజ్ డ్రామాలు ఇప్పటివరకు చాలానే వచ్చాయి. కానీ, డైరెక్టర్ నితిలన్ సామినాథన్ చూపించిన విధానం మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.
బార్బర్ గా పనిచేస్తున్న ఒక వ్యక్తి.. తన ఇంట్లో లక్ష్మీ పోయిందని పోలీసులకు కంప్లైంట్ ఇస్తాడు. కానీ, లక్ష్మీ ఎవరు అనేది మాత్రం చెప్పడు. దాన్ని వెతికి తీసుకురమ్మని పోలీసుల చేతిలో దెబ్బలు తింటాడు. డబ్బులు ఇస్తానంటాడు. అయినా పోలీసులు అతని కంప్లైంట్ ను సీరియస్ గా తీసుకోరు. అసలు లక్ష్మీ ఎవరు.. ? దాని కోసం ఎందుకు ఆ వ్యక్తి అంతలా పరితపిస్తున్నాడు.. ? తన కూతురుకు ఏమైంది.. ? అనేది కథగా చూపించారు.

తెలుగుతో పాటు తమిళంలో నిర్మాతలకు లాభాల పంటను పడించింది. నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులో రికార్డ్ కలక్షన్స్ రాబట్టి ఇండస్ట్రీని షేక్ చేసింది. సుమారు 100 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక ఈ సినిమా ఓటీటీ బాట పట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ కైవసం చేసుకుంది. జూలై 19 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. తమిళంతో పాటు తెలుగులోనూ అదే రోజు రిలీజ్ కానుందట. త్వరలోనే మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేయనున్నారు.
ఇక కూతురుకు అన్యాయం జరిగితే ఏ తండ్రి ఊరికే కూర్చోడు. బాధను అనుభవిస్తూనే తన కూతురుకు నరకం చూపినవారిపై రివెంజ్ తీర్చుకొనే తండ్రి పాత్రలో విజయ్ సేతుపతి నటన అద్భుతం. ఇకపోతే ప్రస్తుతం ఈ హీరో గాంధీ టాక్స్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇది కాకుండా తెలుగులో రామ్ చరణ్ - బుచ్చిబాబు సినిమాలో కూడా నటిస్తున్నాడు. మరి ఈ సినిమాలతో విజయ్ సేతుపతి ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











