Mahavatar Narsimha OTT: కళ్లు చెదిరే ధరకు మహావతార్ నరసింహ ఓటీటీ డీల్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?

మహావతార్ నరసింహ.. ఈ మధ్యకాలంలో సమాజంలో ఇంతగా ప్రభావం చూపించిన సినిమా మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమా దెబ్బకు స్టార్ హీరోల సినిమాలు కూడా సైడ్ ఇచ్చేస్తున్నాయి. థియేటర్‌లన్నీ దేవాలయాలుగా మారిపోతూ.. పిల్లలు, పెద్దలు భక్తిపారవశ్యంలో మునిగిపోతున్నారు. వారం తిరిగేసరికి 100 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ సినిమాకు థియేటర్ల సంఖ్యను కూడా పెంచుతున్నారంటే నరసింహుడి ప్రభంజనం అర్ధం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో మహావతార్ నరసింహ ఓటీటీ రైట్స్ ఏ సంస్థ దక్కించుకుంది? ఓటీటీ డీల్ ఎంత? ఈ వివరాల్లోకి వెళితే..

మహావతార్ నర్సింహా బడ్జెట్?
కన్నడలో తెరకెక్కిన ఈ యానిమేటెడ్ చిత్రాన్ని కేజీఎఫ్, కాంతారా వంటి సినిమాలను నిర్మించిన ప్రముఖ ప్రొడక్షన్ కంపెనీ హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. క్లీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్ కూడా ఈ చిత్ర నిర్మాణంలో చేతులు కలిపింది. స్టార్ హీరోలు లేనప్పటికీ వీఎఫ్ఎక్స్, యానిమినేషన్, మ్యూజిక్, ప్రచార కార్యక్రమాల కారణంగా టెక్నికల్‌గా ఈ సినిమాకు బాగానే ఖర్చయ్యింది. ఈ యానిమేటెడ్ చిత్రానికి దాదాపు 15 కోట్ల పెట్టుబడి అయ్యిందని ట్రేడ్ నిపుణులు తెలిపారు. శిల్పా దవన్, కుషల్ దేశాయ్, చైతన్య దేశాయ్ నిర్మాతలుగా వ్యవహరించగా అశ్విన్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సామ్ సీఎస్ స్వరాలు సమకూర్చిన మహావతార్ నరసింహ చిత్రం జూలై 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Mahavatar Narsimha OTT release Where to watch Ashwin Kumar s animated film after theatrical release

ప్రీ రిలీజ్ బిజినెస్ & బ్రేక్ ఈవెన్ టార్గెట్
యానిమేటెడ్ చిత్రం అయినప్పటికీ టీజర్, ట్రైలర్లు, ఇతర ప్రచార కార్యక్రమాలతో ఈ సినిమాకు భారీగానే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. భారత్‌తో పాటు ఓవర్సీస్‌లోనూ సినిమా విడుదలకు థియేటర్లు భారీగా లభించాయి. మహావతార్ నరసింహ చిత్రం లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 30 రూపాయల కోట్ల గ్రాస్ వసూల్ చేయాల్సి ఉంటుందని ట్రేడ్ పండితులు వాల్యూ కట్టారు.

రోజుల వసూళ్లు ఇలా..
మహావతార్ నర్సింహా చిత్రానికి ఓపెనింగ్ రోజు 2 కోట్ల రూపాయలు, 2వ రోజు రూ.5 కోట్లు, 3వ రోజు రూ.10 కోట్లు, 4వ రోజు రూ.6 కోట్లు, 5వ రోజు రూ.8 కోట్లు, 6వ రోజు రూ.8 కోట్లు, 7వ రోజు రూ.8 కోట్లు చొప్పున తొలి వారం ఇండియా వైడ్‌గా 45 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. 8వ రోజు రూ.8 కోట్లు, 9వ రోజు రూ.16 కోట్లు, 10వ రోజున 24 కోట్ల రూపాయలు, 11వ రోజున 8 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మొత్తంగా 11 రోజుల వరకు మహావతార్ నర్సింహా చిత్రం భారత్‌లో 105 కోట్ల రూపాయల నెట్.. 127 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిక్ తెలిపింది. ఓవర్సీస్‌లో 5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దీంతో కలిపి 11వ రోజుల వరకు వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా 132 కోట్ల రూపాయలు వసూలు చేసి భారీ లాభాలను తెచ్చిపెడుతోంది.

మహావతార్ నర్సింహా ఏ ఓటీటీలో?
బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోన్న మహావతార్ నర్సింహా చిత్రం ఓటీటీ రైట్స్ కోసం చాలా సంస్థలు పోటీపడుతుండగా.. జియో హాట్‌స్టార్‌కు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా ఓటీటీ హక్కుల కోసం హోంబలే సంస్థకు జియో హాట్ స్టార్ దాదాపు 50 కోట్లకు పైగా ఆఫర్ ఇచ్చినట్లుగా ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మహావతార్ నరసింహ ఓటీటీ హక్కులు జియో హాట్ స్టార్‌కు దక్కాయో లేదో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Read more about: Mahavatar Narsimha ott news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X