Sarkaru Vaari Paata: ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఎక్కడంటే?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల అవుతున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ 14 రీల్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు మహేష్ బాబు జిఎంబి ప్రొడక్షన్స్ కూడా సహ నిర్మాతగా వ్యవహరించడం జరిగింది. అయితే ఈ సినిమా విడుదలైన మొదటి రోజు పాజిటివ్ టాక్ తో ముందుకు సాగుతోంది. ఇక సర్కారు వారి పాట సినిమా ఓటిటి ఫ్లాట్ ఫార్మ్ లో ఎప్పుడు విడుదల చేస్తారు? ఎన్ని రోజులకు విడుదల అవుతుంది? అలాగే ఏ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాల్లోకి వెళితే...

Recommended Video

Sarkaru Vaari Paata Public Talk In Bangalore మూవీ బాగుంది కానీ ... | Filmibeat Telugu
ఆ కారణంగా ఆలస్యం..

ఆ కారణంగా ఆలస్యం..

సరిలేరు నీకెవ్వరు సినిమా తో కెరీర్లోనే అనే అతి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న మహేష్ బాబు ఆ తర్వాత వెంటనే మరొక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలి అని అనుకున్నాడు. కానీ ఊహించని విధంగా కరోనా పాండమిక్ కారణంగా తదుపరి సినిమా విషయంలో ఆలస్యం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని ఎంతగానో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వర్కవుట్ కాలేదు.

అలాంటి టాక్

అలాంటి టాక్

మొత్తానికి సినిమా ఈ గురువారం విడుదలైంది. సర్కారు వారి పాట మహేష్ బాబు కెరీర్ లోనే అత్యధిక థియేటర్స్ లో విడుదలైన సినిమాగా నిలిచింది. ఇక ఈ సినిమా ప్రీమియర్ షోల నుంచి కాస్త భిన్నమైన టాక్ ను అందుకుంది. ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులు గత ఏడాది నుంచి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక మొత్తానికి ఒక విధంగా పాజిటివ్ టాక్ రావడంతో ఘట్టమనేని అభిమానులు అయితే సంబరాలు చేసుకుంటున్నారు..

అమెజాన్ ప్రైమ్ లో..

అమెజాన్ ప్రైమ్ లో..

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన అనేక రకాల విషయాలు వైరల్ గా మారుతున్నాయి. అయితే సర్కారు వారి పాట సినిమా ఓటీటీ లోకి ఎప్పుడు వస్తుంది అనే విషయంలో కూడా ప్రస్తుతం అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఓటీటీ హక్కులను ప్రముఖ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఆ రూట్లో భారీగా ఆదాయం

ఆ రూట్లో భారీగా ఆదాయం

గత ఏడాదిలోనే ఈ సినిమా ఓటీటీ హక్కులపై అమెజాన్ చర్చలు మొదలు పెట్టింది. తర్వాత మధ్యలో డిస్ని ప్లస్ హాట్ స్టార్ నుంచి కూడా పోటీ వచ్చింది. కానీ చివరకు అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఓటీటీ హక్కుల ద్వారా సినిమాకు 35 కోట్ల వరకు లాభం వచ్చినట్లుగా తెలుస్తోంది. శాటిలైట్ పరంగా కూడా సినిమాకు భారీ ఆదాయం లభించినట్లు సమాచారం. నాన్ థియేట్రికల్ గానే సినిమా మొత్తంగా 60 నుంచి 70 కోట్లు మధ్యలో ప్రాఫిట్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఓటీటీలో స్ట్రీమింగ్.. ఎప్పుడంటే?

ఓటీటీలో స్ట్రీమింగ్.. ఎప్పుడంటే?

సర్కారు వారి పాట సినిమా అమెజాన్ ప్రైమ్ లో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం అయితే 55 రోజుల తర్వాత విడుదల చేయాల్సి ఉంటుంది. ఇక సినిమా రిజల్ట్ లో తేడా వస్తే అమెజాన్ ప్రైమ్ మరికొంత చెల్లించే ముందుగానే సినిమా నో ఆన్లైన్లో స్క్రీన్ చేసే అవకాశం ఉంటుంది. ఇక ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం సర్కారు వారి పాట జూలై రెండవ వారంలో పోటీలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X