Guntur kaaram OTT: ఫేమస్ ఓటీటీలో గుంటూరు కారం.. స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పటి నుంచి అంటే!
తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మందే స్టార్ హీరోలు ఉన్నారు. కానీ, వారిలో కొందరు మాత్రమే పక్కా కమర్షియల్ చిత్రాలు చేస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అలాంటి వారిలో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకడు. కెరీర్ ఆరంభం నుంచీ తనదైన పంథాను ఫాలో అవుతోన్న అతడు.. సినిమా సినిమాకూ తన రేంజ్‌ను పెంచుకుంటోన్నాడు. ఇలా ఇప్పుడు 'గుంటూరు కారం' చేశాడు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన సినిమానే 'గుంటూరు కారం'. క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని ఈరోజే (జనవరి 12న) గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో ఈ మూవీ హవా కనిపిస్తోంది.
Recommended Video


భారీ హైప్‌తో విడుదలైన 'గుంటూరు కారం' మూవీకి ప్రీమియర్స్ నుంచే డీసెంట్ టాక్ వచ్చింది. అలాగే, తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే కనిపిస్తోంది. దీనికి అనుగుణంగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన భారీ స్థాయిలోనే దక్కుతోంది. తెలుగులో ఈ సినిమా షోలకు బుకింగ్స్ బాగున్నాయి. దీంతో దీనికి టాక్ ఎలా ఉన్నా ఓపెనింగ్స్ బాగానే వచ్చే ఛాన్స్ ఉంది.
మహేశ్ బాబు నటించిన 'గుంటూరు కారం' మూవీకి సంబంధించిన స్ట్రీమింగ్ డీటేల్స్ తాజాగా బయటకు వచ్చాయి. దీన్ని ఫేమస్ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు తెలిసింది. ఇందుకోసం సదరు సంస్థ భారీ మొత్తాన్ని ముట్టజెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ఇది మహేశ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డీల్ అని కూడా వార్తలు వస్తున్నాయి.

త్రివిక్రమ్ - మహేశ్ బాబు కాంబినేషన్‌లో రూపొందిన 'గుంటూరు కారం' మూవీకి సంబంధించి స్ట్రీమింగ్ గురించి ఎన్నో వార్తలు వైరల్ అవుతోన్నాయి. తాజా సమాచారం ప్రకారం థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాతనే ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని తెలిసింది. అంటే ఇది ఫిబ్రవరి మూడో వారంలో ప్రసారం అయ్యే చాన్స్ ఉంది.
ఇదిలా ఉండగా.. 'గుంటూరు కారం' సినిమాను హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్లుగా నటించారు. థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ ఇచ్చాడు. ఇక, ఇందులో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణలు కీలక పాత్రలను పోషించారు.


Click it and Unblock the Notifications











