నెలకాకముందే ఓటీటీలోకి రాబోతున్న గుంటూరు కారం.. ఎక్కడ, ఎప్పటి నుంచి చూడాలంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన తాజా సినిమా గుంటూరు కారం గురించి అందరికీ తెలిసిందే. దాదాపు 13 సంవత్సరాల తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు గురూజీ. అలాగే సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేశారు. ఇదంతా బానే ఉండగా.. నెల రోజులు కూడా కాకముందే ఈ సినిమా ఓటీటీలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వివరాలు ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాం.

భారీ అంచనాల మధ్య విడుదల అయిన గుంటూరు కారం సినిమాకు ప్రీమియర్స్ నుంచే డీసెంట్ టాక్ వచ్చింది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మిశ్రమ టాక్ రాగా.. బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు సాధిస్తోందీ చిత్రం. అనేక రికార్డులు బ్రేక్ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

Mahesh Babu Starrer Guntur kaaram Movie OTT Streaming Details Check Here

గుంటూరు కారం సినిమాకు సంబంధించిన డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్న విషయం ఇప్పటికే అందరికీ తెలుసు. అయితే ఈ సినిమా కోసం సంస్థ మూవీ టీంకు భారీ మొత్తాన్ని ముట్టజెప్పినట్లు కూడా ప్రచారం సాగింది. అంతేకాదండోయ్ మహేష్ బాబు కెరియర్ లోనే బిగ్గెస్ట్ డీల గా నిలిచిన ఈ సినిమా.. తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. అయితే సినిమా విడుదల అయి నెల రోజులు కూడా కాకముందే స్టార్ హీరో చిత్రం ఓటీటీలో సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా ఫిబ్రవరి 10వ తేదీ నుంచి మహేష్ బాబు సినిమా నెట్ ఫ్లిక్స్ వేధికగా స్ట్రీమింగ్ కానుందని సమాచారం. వారం రోజుల్లోనే 200 కోట్ల రూపాయలు వసూళ్లు చేసిన ఈ బ్లాక్ బస్టర్ హిట్టు సినిమా నెల రోజుల్లోపే ఓటీటీలోకి వస్తుందని తెలియడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఓటీటీ ప్రియులు మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే ఇంత త్వరగా ఓటీటీలోకి ఓ స్టార్ హీరో హిట్టు సినిమా రావడం ఇదే మొదటి సారి ఏం కాదు.

Mahesh Babu Starrer Guntur kaaram Movie OTT Streaming Details Check Here

ఇటీవలే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ చిత్రం కూడా ఇలాగే నెల రోజులు కూడా కాకముందే ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండూ ఒక్కరోజు ముందే ఈ సినిమా రేపటి నుంచే స్ట్రీమింగ్ కానుందని తెలిపి షాకిచ్చింది. డిసెంబర్ 22వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైన సలార్.. జనవరి 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సినిమా హక్కులను కూడా నెట్ ఫ్లిక్స్ సంస్థే దక్కించుకుంది. దీంతో ఫిబ్రవరి 10 నుంచి కచ్చితంగా గుంటూరు కారం కూడా స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఎప్పుడు దీనిపై అధికారిక ప్రకటన ఇస్తారనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X