Guntur kaaram OTT: ఓటీటీలోకి వచ్చేసిన గుంటూరు కారం.. సూపర్ సర్‌ప్రైజ్ ఏంటంటే!
టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలంగా తనదైన మార్కును చూపించే సినిమాలు చేస్తూ.. క్రమంగా తన ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను పెంచుకుంటూ వెళ్తున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ మధ్య కాలంలో మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతోన్న అతడు.. బ్రేకులు లేకుండా మూవీలు చేస్తున్నాడు. ఇలా ఈ సంక్రాంతికి 'గుంటూరు కారం' అనే చిత్రంతో వచ్చేశాడు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన చిత్రమే 'గుంటూరు కారం'. భారీ అంచనాలను ఏర్పరచుకున్న ఈ సినిమా జనవరి 12వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అయింది. అయితే, ఈ మూవీకి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ దీనికి వసూళ్లు భారీగానే లభించాయి. అలా దాదాపు మూడు వారాలు ఇది సత్తా చాటింది.

'గుంటూరు కారం' మూవీ ఓవరాల్‌గా వసూళ్ల ద్వారా 90 శాతం మాత్రమే వసూళ్లను రాబట్టి ఏబో యావరేజ్‌గా నిలిచింది. దీంతో ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా ఓటీటీలోకి తీసుకు వచ్చేస్తారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ఈ సినిమా నెల రోజుల్లో స్ట్రీమింగ్‌కు రాబోతుందని అన్నారు. అలా ఈ మూవీ గురించి ఎన్నో రకాల తేదీలు కూడా తెరపైకి వచ్చేశాయి.
మహేశ్ బాబు నటించిన 'గుంటూరు కారం' మూవీకి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ఫేమస్ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి దక్కించుకుంది. ఈ సినిమాను ఫిబ్రవరి 9వ తేదీ నుంచే అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు ఇటీవలే సదరు సంస్థ అధికారికంగా ప్రకటించింది. తద్వారా థియేటర్లలోకి వచ్చిన నెలలోపే ఇది ఓటీటీలోనూ కనిపించే పరిస్థితి ఏర్పడింది.

మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'గుంటూరు కారం' మూవీని నెట్‌ఫ్లిక్స్ సంస్థ అందుబాటులోకి తీసుకు వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ నేటి అర్ధరాత్రి నుంచే ప్రారంభం అయింది. ఇక, ఇందులో ఓ కబడ్డీ ఫైట్‌తో పాటు మదర్ సెంటిమెంట్ సాంగ్‌ను కూడా యాడ్ చేస్తున్నారని తెలిసింది. ఇది సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులకు స్పెషల్ సర్‌ప్రైజ్ అని అంటున్నారు.
ఇదిలా ఉండగా.. క్రేజీ కాంబోలో రూపొందిన 'గుంటూరు కారం' చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్లుగా నటించారు. థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ ఇచ్చాడు. ఇక, ఇందులో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణలు కీలక పాత్రలను పోషించారు.


Click it and Unblock the Notifications











