Mufasa OTT: ఓటీటీలోకి మహేష్ బాబు డబ్బింగ్ మూవీ.. హాలీవుడ్ యానిమేటెడ్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Mufasa OTT: హాలీవుడ్ సూపర్ హిట్ యానిమేటెడ్ సినిమాలు సింబా, ది లయన్ కింగ్ సినిమాలకు ప్రీక్వెల్ గా తెరకెక్కిన మూవీ 'ముఫాసా : ది లయన్ కింగ్' (Mufasa The Lion King). హాలీవుడ్ డైరెక్టర్ బారీ జెంక్సిన్ రూపొందించిన మ్యూజికల్ లైవ్ యాక్షన్ డ్రామా మూవీ. డిసెంబర్ 9న థియేటర్స్ లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. సింబా, లయన్ కింగ్ సినిమాలకు ఇండియాలో కూడా మంచి ఆదరణ లభించడం, ముఫాసా అనే పాత్రకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో తెలుగులోను బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిసింది. ఈ భారీ బ్లాక్ బస్టర్ మూవీకి సంబంధించిన ఓటీటీ అప్డేట్ వచ్చేంది. ఇంతకీ ఈ మూవీ ఓటీటీ లోకి ఎప్పుడు రానున్నదంటే..?

హాలీవుడ్ సినిమాలకు ఇండియాలో భారీ సంఖ్యలో అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. 2019లో రిలీజ్ అయిన 'ది లయన్ కింగ్' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు ప్రీక్వెల్ గా తెరకెక్కిన సినిమా విజువల్ లైవ్ యాక్షన్ మూవీగా 'ముఫాసా : ది లయన్ కింగ్'. బారీ జెంకిన్స్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా... వాల్ట్‌ డిస్నీ పిక్చర్స్‌ పతాకంపై అడెలె రోమన్‌ స్కీ, మార్క్‌ సెరియాక్‌ నిర్మించారు.

Mahesh babu voice Movie Mufasa The Lion King OTT Streaming on disney hotstar from february 18

2018లో విడుదలైన లయన్ కింగ్ లో సింబా రాజు, సింహాసనాన్ని అధిష్టించి ఎలా రాజు అయ్యాడనేది చూపించగా.. 2024లో ముఫాసా చిన్ననాటి జీవితాన్ని గురించి ఈ మూవీలో తెలియజేయడం జరిగింది. ఈ మూవీ తెలుగు డబ్బింగ్ వర్షన్ లో ముఫాసాగా మహేష్ బాబు, పుంబాగా బ్రహ్మానందం, టిమోన్ గా అలీ, టాకాగా సత్యదేవ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. డిసెంబరు 20న విడుదలైన ఈ సినిమా ఇండియాలో కూడా ప్రేక్షకులను మెప్పించింది. సుమారు రూ. 1260 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 3,200 కోట్లు రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.

తెలుగులో కూడా భారీ సక్సెస్ అయినా మూఫాసా ది లయన్ కింగ్ మూవీ కోసం ఓటీటీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా స్ట్రీమింగ్ కోసం ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా, అలాంటి ఓటీటీ లవర్స్ కు ఓ గుడ్ న్యూస్. అతి త్వరలో ఈ యానిమేటెడ్ మూవీ ఓటీటీ లోకి రానుంది. ముఫాసా : ది లయన్ కింగ్ ఫిబ్రవరి 18న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. కానీ మూవీని ఫ్రీగా చూడలేము, అయితే, రెంటల్‌ విధానంలో అధనంగా డబ్బు చెల్లించి చూడాల్సి ఉంటుంది.

Mahesh babu voice Movie Mufasa The Lion King OTT Streaming on disney hotstar from february 18

అలాగే.. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీ, ఫాండాంగోతో సహా వీడియో-ఆన్-డిమాండ్ (VOD) ప్రాతిపదికన అందుబాటులో ఉంటుంది. ఇందులో కూడా కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఏప్రిల్ 1నుంచి ఈ చిత్రాన్ని ఉచితంగా చూసే అవకాశం ఉంటుందని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ అందించనున్నది. థియేటర్స్ లో అద్భుతమైన రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్ ని ఎంతమేరకు సంతృప్తి పరచగలదో చూడాలి. తెలుగు వెర్షన్ తో పాటు హిందీ వెర్షన్ ని కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నది.

More from Filmibeat

Read more about: mahesh babu mufasa
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X