Bigg Boss Non Stop.. టాప్ కమెడియన్ ఎలిమినేట్.. బాబా భాస్కర్ వైల్డ్ కార్డు ఎంట్రీలో అలాంటి ట్విస్టు
Bigg Boss Non Stop రియాలిటీ షోలో మరో వికెట్ పడింది. ఇంటిలో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా భావించిన మహేష్ విట్టా ఇంటి నుంచి నిష్క్రమించాడు. ఆసక్తికరంగా సాగిన ఎలిమినేషన్ ప్రాసెస్‌లో మహేష్ విట్టా హౌస్ నుంచి బయటకు వచ్చారు. తాజా వారాంతంలో హోస్ట్ నాగార్జున ఎలా ఎలిమినేషన్ ప్రాసెస్ నిర్వహించారు. ఎలిమినేషన్ తర్వాత మహేష్ విట్టా రియాక్షన్ ఏమిటనే విషయాల్లోకి వెళితే..

ఇంటి సభ్యులకు క్లాస్ పీకిన నాగ్
బిగ్‌బాస్ నాన్ స్టాప్ షో సండే ఫండే కార్యక్రమంలో భాగంగా గతవారం జరిగిన ఆటను, కంటెస్టెంట్ల తీరుపై రివ్యూ చేశాడు. ఇంటి సభ్యుల లోపాలను ఘాటుగా ఎత్తి చూపుతూ భారీగా క్లాస్ పీకాడు. ఇంటి సభ్యుల ప్రవర్తనను, వారి గేమ్ ప్లాన్‌ను లీక్ చేయడమే కాకుండా వీడియోలు రిలీజ్ చేసి షాకిచ్చాడు.

ఎలిమినేషన్ ప్రక్రియను ఆసక్తికరంగా
బిగ్‌బాస్ వీకెండ్ షోలో ఆటపాటలు ఆడిస్తూ.. ఇంటి సభ్యులకు వినోదాన్ని పంచుతూ ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభించాడు. ఈ వారం నామినేషన్‌లో ఉన్న ఎనిమిది మంది సభ్యులను ఒక్కొక్కరిని సేఫ్ చేస్తూ చివరకు ఇద్దరిని ఎలిమినేషన్ కోసం ఫిల్టర్ చేశాడు హోస్ట్ నాగార్జున. దాంతో ఈ గేమ్ నుంచి ఎవరు వెళ్తారనే ఆసక్తిని క్రియేట్ చేయడంలో బిగ్‌బాస్ సక్సెస్ అయ్యాడు.

మహేష్ విట్టా ఎలిమినేషన్
ఎలిమినేషన్ కోసం చివరగా నటరాజ్ మాస్టర్, మహేష్ విట్టా మిగలడంతో వారి ఎలిమినేషన్ ప్రక్రియ కోసం ఆ ఇద్దరి ముందు మూడేసి కుండలను పెట్టారు. ఎవరి కుండలో ఎరుపు రంగు ఎక్కువగా ఉంటుందో.. వారు ఎలిమినేషన్ అంటూ రూల్ చెప్పాడు. దాంతో కుండలు పగలకొట్టడంతో మహేష్ విట్టా కుండల్లో రెడ్ ఎక్కువగా కనిపించింది. దాంతో మహేష్ విట్టా ఎలిమినేట్ అని హోస్ట్ నాగార్జున డిక్లేర్ చేశాడు.

అమ్మ కోరిక మేరకే బిగ్‌బాస్‌లోకి అంటూ
మహేష్ విట్టా ఎలిమినేషన్ తర్వాత పెద్దగా కంటెస్టెంట్ల నుంచి రియాక్షన్ కనిపించలేదు. నటరాజ్ మాస్టర్ కొంత బాధను వ్యక్తం చేయగా.. నాకు బయట చాలా పనులు ఉన్నాయి. నేను ఎలిమినేట్ అయినా బాధలేదు. గత సీజన్‌లో బాగా ఆడలేదనే కంప్లైంట్ ఉండేది. మా అమ్మ కోరిక మేరకు నేను బిగ్‌బాస్‌కు వచ్చాను అని నటరాజ్ మాస్టర్‌ను ఊరడించి.. నేరుగా నాగార్జున కలిసేందుకు వేదికపైకి వచ్చాడు.
ఎమోషనల్ అయిన మహేష్ విట్టా
బిగ్‌బాస్ వేదిక మీదకు మహేష్ విట్టా రాగానే.. జర్నీ ఎలా ఉంది అని నాగార్జున అడిగితే.. షార్ట్ అండ్ స్వీట్‌గా ఉందంటూ సమాధానం ఇచ్చాడు. అయితే షార్ట్ ఏమీ కాదు.. మంచిగానే ఉన్నావు అంటూ నాగ్ కామెంట్ చేశాడు. ఆ తర్వాత జర్నీ చూపించగా.. మహేష్ విట్టా ఎమోషనల్ అయ్యాడు. ఇంటి సభ్యులకు తనదైన శైలిలో సలహాలు ఇచ్చి ఇంటి నుంచి బయటకు వచ్చాడు.
వైల్డ్ కార్డు ఎంట్రీలో ట్విస్టు
ఇక బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షోలో నాగార్జున మరో ట్విస్ట్ ఇచ్చారు. మహేష్ విట్టా ఎలిమినేషన్ తర్వాత ఇంటిలోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బాబా భాస్కర్‌ను ప్రవేశపెట్టారు. అయితే బాబా భాస్కర్ నేరుగా ఇంటిలోకి వెళ్లకుండా.. కొన్ని రోజులు సీక్రెట్ రూమ్‌లో పెట్టారు. అయితే ఇంటి పరిస్థితులను చూసిన తర్వాత బిగ్‌బాస్ ఆదేశాల మేరకు ఇంటిలోకి వెళ్తారని హోస్ట్ నాగార్జున చెప్పారు.


Click it and Unblock the Notifications











