Shaitan OTT: నేరాలే జీవనాధారం.. రూటు మార్చిన మహి.. సరికొత్త క్రైమ్ సిరీస్ 'సైతాన్'
ఇటీవల కాలంలో ఓటీటీల హవా ఎక్కువ అవుతోంది. థియేటరల్లో సినిమాల్లో చెప్పలేని, చూపించలేని కథలను వెబ్ సిరీసుల రూపంలో ఆవిష్కరిస్తున్నారు దర్శకనిర్మాతలు. విభిన్నమైన జోనర్లతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇటీవలే ప్రముఖు ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన వెబ్ సిరీస్ 'సేవ్ ది టైగర్స్'. ఈ సిరీస్ కు నిర్మాతగా వ్యవహరించిన డైరెక్టర్ మహి వి రాఘవ్ మరో వెబ్ సిరీస్ తో ఆకట్టుకునేందుకు రెడీ అయ్యారు. ఆ సిరీస్ వివరాల్లోకి వెళితే..
పాఠశాల, ఆనందో బ్రహ్మా, యాత్ర వంటి చిత్రాలను డైరెక్ట్ చేసి మంచి పేరు తెచ్చుకున్నారు మహి వి రాఘవ్ (Mahi V Raghav). క్రియేటర్ గా, దర్శకుడిగా సత్తా చాటిన ఆయన ఇటీవల నిర్మాతగా మారి చక్కటి వెబ్ సిరీస్ నిర్మించారు. ప్రతి ఇంట్లో ఉండే భార్యాభర్తల గొడవలు, అలకలు, ప్రేమాభిమానాల కలయికతో రూపొందిన వెబ్ సిరీస్ 'సేవ్ ది టైగర్స్'. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఏప్రిల్ 27 నుంచి స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్ కు సంచలన విజయం సాధించింది. ఈ సిరీస్ తర్వాత రాఘవ్ మరో డిఫరెంట్ వెబ్ సిరీసుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

'సేవ్ ది టైగర్స్'కి నిర్మాతగా వ్యవహరించిన మహి వి రాఘవ్ దర్శకత్వం వహించిన తాజా సిరీస్ సైతాన్ (Shaitan Web Series). ఈ సిరీస్ టీజర్ ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ సిరీస్ పూర్తి క్రైమ్ థ్రిల్రర్ అని టీజర్ చూస్తే తెలుస్తోంది. ఓ పోలీస్ ను మర్డర్ చేసిన నిందులను చూపిస్తూ ఈ టీజర్ ఆసక్తిగా ఉంది. "మీరు నేరాన్ని ఏమంటారు. వాళ్లు మాత్రం జీవనాధారం అంటారు" అనే క్యాప్షన్ ఇంటెన్స్ క్రియేట్ చేస్తుంది.
ఈ సైతాన్ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో జూన్ 15న విడుదల కానుంది. ఇక ఈ వెబ్ సిరీసులో బ్యూటిఫుల్ దేవియాని శర్మ, మలయాళ నటి షెల్లీ నబు కుమార్, నటుడు రిషి ప్రధాన పాత్రలు పోషించినట్లు తెలుస్తోంది. కమల్ హాసన్ విక్రమ్ మూవీతోపాటుపలు తమిళ చిత్రాల్లో యాక్ట్ చేసిన జాఫర్ సాధిక్ కూడా ఇందులో ఉన్నారు. మా ఊరి పొలిమేరలో హీరోయిన్ విరూపాక్ష సినిమాలో కమల్ రామరాజు భార్య పాత్ర చేసిన తెలుగు అమ్మాయి కామాక్షీ భాస్కర్ల కూడా ఓ పాత్ర చేసినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











