Shaitan OTT: పచ్చి బూతులు, రక్తపాతంతో సైతాన్.. 'రానా నాయుడు'కు మించి బోల్డ్ కంటెంట్!
ప్రస్తుత కాలంలో సినీ ప్రియులు ఎక్కువగా ఫాలో అవుతుంది ఓటీటీలను. అందులో వచ్చే డిఫరెంట్ కంటెంట్ సినిమాలు, వెబ్ సిరీసులు ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్నాయి. నిజానికి ఈ ఓటీటీల హవా కరోనా తర్వాత ఎక్కువగా పెరిగిందని చెప్పుకోవచ్చు. లాక్ డౌన్ ద్వారా ఇంట్లో ఉండటంతో ఓటీటీలు చూసి వినోదాన్ని ఆస్వాదించారు. ఇప్పుడు థియేటరల్లో సినిమాల్లో చెప్పలేని, చూపించలేని కథలను వెబ్ సిరీసుల రూపంలో ఆవిష్కరిస్తున్నారు దర్శకనిర్మాతలు. అలా బోల్డ్ కంటెంట్‌కు మించి రాబోతుంది సైతాన్ వెబ్ సిరీస్.
డిఫరెంట్ జోనర్లతో: డిఫరెంట్ చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు మహి వి రాఘవ్ (Mahi V Raghav). పాఠశాల అనే తొలి సినిమాతో కంటెంట్ ఉన్న డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ప్రశంసలతోపాటు విమర్శలు సైతం అందుకున్న ఈ డైరెక్టర్ డిఫరెంట్ జోనర్లలో సినిమాలు తెరకెక్కించారు. పాఠశాల తర్వాత ఆనందో బ్రహ్మా మూవీకి దర్శకత్వం వహించారు.

నిర్మాతగా మారి: ఆనందో బ్రహ్మా తర్వాత యాత్ర వంటి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు మహి వి రాఘవ్. ఇదిలా ఉంటే ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా ఏప్రిల్ 27 నుంచి స్ట్రీమింగ్ అవుతోన్న 'సేవ్ ది టైగర్స్' వెబ్ సిరీస్ ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఈ సిరీస్ ను డైరెక్టర్ అయిన మహి నిర్మించారు.

ట్రైలర్ రిలీజ్: 'సేవ్ ది టైగర్స్' వెబ్ సిరీస్ తర్వాత మహి వి. రాఘవ్ మరో విభిన్నమైన వెబ్ సిరీసుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన తాజాగా దర్శకత్వం వహించిన సిరీస్ సైతాన్ (Shaitan Web Series). ఇప్పటికే విడుదల చేసిన ఈ సిరీస్ టీజర్ క్యూరియాసిటీ పెంచింది. ఇవాళ తాజాగా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్.

పరిమితికి మించి: "డెవిల్ వచ్చేస్తోంది. రక్తపాతం జూన్ 15 నుంచి మొదలు" అని క్యాప్షన్ ఇస్తూ ట్రైలర్ విడుదల చేశారు. ఇక ఈ ట్రైలర్ చూస్తూ ఘోరమైన పచ్చి బూతులు, పగలు, ప్రతీకారాలు, రక్తపాతాలతో నిండి ఉంది. అంతేకాకుండా పరిమితికి మించిన బోల్డ్ కంటెంట్ తో వెబ్ సిరీస్ రూపొందించినట్లు తెలుస్తోంది. మొత్తానికి ట్రైలర్ తో వెబ్ సిరీసుకు మరింత హైప్ ఇచ్చారు.

రానా నాయుడు కంటే: అయితే ఇటీవల వచ్చిన రానా నాయుడు సిరీసులోనే బోల్డ్ కంటెంట్, బూతులు ఎక్కువగా ఉన్నాయన్న ప్రేక్షకులు ఇప్పుడు వచ్చే సైతాన్ చూస్తే ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి. ఎందుకంటో రానా నాయుడు కంటే ఎన్నో రెట్లు బూతులు, అడల్ట్ కంటెంట్ ఇందులో ఉన్నాయని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది.
నటీనటులు: ఇక సైతాన్ వెబ్ సిరీసులో దేవియాని శర్మ, మలయాళ నటి షెల్లీ నబు కుమార్, నటుడు రిషి, జాఫర్ సాధిక్ ముఖ్య పాత్రలు పోషించారు. వీరితోపాటు ప్రియురాలు, మా ఊరి పొలిమేర చిత్రాల్లో హీరోయిన్ గా చేసిన తెలుగు అమ్మాయి కామాక్షీ భాస్కర్ల కూడా ఓ కీలక పాత్ర చేసినట్లు సమాచారం. కామాక్షి భాస్కర్ల ది బేకర్ అండ్ ది బ్యూటి, కుబూల్ హై, అన్యాస్ ట్యుటోరియల్ వంటి వెబ్ సిరీసుల్లోనూ చేసింది.


Click it and Unblock the Notifications











