OTTలోకి మరో బ్లాక్ బస్టర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఏది, ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే?
మలయాళ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో ఒకటి అయిన నాయట్టు గురించి దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులకు తెలుసు. అద్భుతమైన కథాంశంతో వచ్చి అందరినీ అలరించిన ఈ సినిమా ఈ సినిమా మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి రాబోతుంది. అదేంటీ ఈ సినిమా ఇప్పటికే ఓటీటీలో ఉంది కదా అనుకుంటున్నారేమో.. అవునండి. ఈ సినిమా ఇప్పటికీ ఓటీటీలో ఉన్నా తెలుగు వర్షన్ లో మాత్రం అందుబాటులో లేదు.
అద్భుతమైన క్రైమ్, హార్రర్, థ్రిల్లర్ కథలను అంతా ఇష్టపడుతుండగా.. తాజాగా ఈ సినిమాను తెలుగులోకి కూడా అందుబాటులోకి తెస్తే బాగుటుందని చిత్రబృందం భావించింది. ఇక అనుకున్నదే తడవుగా.. ఈ సినిమాను ఓటీటీలోకి తెచ్చేందుకు ప్లాన్ చేసేసింది. అయితే అదిరిపోయే క్రైమ్ థ్రిల్లర్ గా రూపొంది సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఎక్కడ, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మలయాళంలో నాయట్టుగా రూపొందిన ఈ సినిమా 2021 ఏప్రిల్ 8వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయింది. ముఖ్యంగా జోజు జార్జ్, కుంచాకో బోబన్, నిమిషా సజయన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు మార్టిన్ ప్రక్కట్ దర్శకత్వం వహించారు. కథ, స్క్రీన్ ప్లే రెండూ బాగుండగా.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ఈ సినిమాకు మొదటి నుంచి పాజిటివ్ టాక్ రావడంతో.. కేవలం మలయాళీలు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి కనబర్చారు.
ఈక్రమంలోనే ఈ సినిమా 2021 మే 9వ తేదీనన సింప్లి సౌత్, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీల్లో విడుదల చేశారు. ఇలా ఓటీటీలో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా తాజాగా తెలుగులో అందుబాటులోకి రాబోతుంది. అప్పట్లో చాలా మంది తెలుగు సినీ ప్రియులు ఈ సినిమా తెలుగులో వస్తే బాగుండని అనుకున్నారు. కానీ అప్పట్లో దీని తెలుగు వర్షన్ రాలేదు. కానీ తాజాగా ఈ సినిమాను చుండూరు పోలీస్ స్టేషన్ పేరుతో తెలుగులో ఓటీటీ వేదికగా విడుదల చేయబోతున్నారు.
ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన ఆహా వేదికగా ఈ సినిమాను ఏప్రిల్ 26వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అయితే ఈ విషయాన్ని నేరుగా ఆహా సంస్థనే ఎక్స్ వేదికగా వెల్లడించింది. చుండూరు పోలీస్ స్టేషన్ పేరుతో నాయట్టు సినిమాను తెలుగులో చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి. ముఖ్యంగా క్రైమ్, థ్రిల్లర్ చిత్రాలను ఇష్ట పడే వాళ్లు మాత్రం అస్సలే మిస్ కాకండి.


Click it and Unblock the Notifications











