OTTలోకి బ్లాక్ బస్టర్ మిస్టరీ థ్రిల్లర్.. మంజుమ్మల్ బాయ్స్ వచ్చేది ఏరోజంటే?
ఈమధ్య కాలంలో హార్రర్, థ్రిల్లర్, క్రైమ్, కామెడీ చిత్రాల హవా ఎక్కువైంది. ముఖ్యంగా ప్రతీ వారం అదిరిపోయే చిత్రాలు ఓటీటీల వేదికగా వస్తూ సందడి చేస్తుండగా.. తాజాగా మరో మిస్టరీ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధం అయింది. ముఖ్యంగా మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన మంజుమ్మల్ బాయ్స్.. ఏప్రిల్ 5వ తేదీనే ఓటీటీలోకి వస్తుందంటా గతంలో పెద్ద ఎత్తున వార్తలు రాగా.. సినిమా మాత్రం ఓటీటీలోకి రాలేదు. అనుకున్న తేదీ కంటే ఓ నెల ఆలస్యంగా రాబోతుంది. అయితే ఈ సినినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కోలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన మంజుమ్మల్ బాయ్స్ సినిమా మిగతా భాషల్లోకి కూడా డబ్ అయింది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోకి కూడా వచ్చి థియేటర్లలో రిలీజ్ అయింది. ఇక్కడ కూడా బాక్సాఫీసు వద్ద భారీగానే వసూళ్లు రాబట్టుకుంది. చిదంబరం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పరవ ఫిల్మ్స్ నిర్మించారు. ముఖ్యంగా ఈ సినిమాలో సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్. పొదువాల్, లాల్ జూనియర్, దీపక్ పరంబోల్, అభిరామ్ రాధాకృష్ణన్, అరుణ్ కురియన్, ఖలీద్ రెహమాన్, చందు సలీంకుమార్, షెబిన్ బెన్సన్, మరియు విష్ణు రేఘు తదితరులు నటించారు.

2006 సంవత్సరంలో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 22వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయింది. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుని రూ. 200 కోట్ల కంటే ఎక్కువ వసూళ్లు సాధించింది. ముఖ్యంగా అత్యధిక వసూళ్లు చేసిన మూడో భారతీయ చలన చిత్రంగా నిలిచిన ఈ సినిమా తెలుగులో విడుదల చేయగా.. భారీగానే వసూళ్లు వచ్చాయి. ఇదంతా ఇలా ఉండగా.. ఈ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఓటీటీ వేదికగా వచ్చేందుకు సిద్ధం అవుతుంది.
ప్రముఖ ఓటీటీ దిగ్గజం అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ భారీ పోటీ మధ్య ఈ సినిమా ఓటటీ హక్కులను దక్కించుకుంది. ఏప్రిల్ 5వ తేదీ నుంచే ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ అప్పుడు మాత్రం ఈ చిత్రం ఓటీటీలోకి రాలేదు. నెల ఆలస్యంగా ఈ సినిమా ఓటీటీలో రాబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మే 3వ తేదీ నుంచి ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం.

తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ ఈ సినిమా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతున్న ఈ సినిమాను ప్రతీ ఒక్కరూ కచ్చితంగా చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి. థ్రిల్లర్ చిత్రాలను ఇష్ట పడేవాళ్లు కచ్చితంగా ఈ సినిమాను చూసేయండి.


Click it and Unblock the Notifications











