3 ఏళ్ల తర్వాత OTTలోకి రాబోతున్న సూపర్ హిట్ థ్రిల్లర్ మూవీ.. ఎప్పుడు స్ట్రీమింగ్ కానుందంటే?

ఓటీటీల హవా పెరుగుతున్నా కొద్దీ.. పాత చిత్రాలను సైతం ఓటీటీల్లోకి తీసుకు వస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు దర్శక, నిర్మాతలు. ముఖ్యంగా తమ చిత్రం బాగుందని భావించినా.. వెంటనే వాటిని ఓటీటీల్లోకి తీసుకు వస్తూ తెగ సందడి చేస్తున్నారు. ఆ సినిమా వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా సరే అన్ని భాషల వాళ్లకు అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అలా ఓటీటీలోకి ఓ క్రేజీ మూవీ రాబోతుంది. అదిరిపోయే థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు 3 సంవత్సరాల తర్వాత ఓటీటీలో రాబోతుంది. అయితే ఆ సినిమా ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మలయాళ భాషలో మూడేళ్ల క్రితం వచ్చిన అదిరిపోయే థ్రిల్లర్ చిత్రమే కీడం. రాహుల్ రిజి నాయర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో రజిషా విజయన్, శ్రీనివాసన్, రాజి నాయర్, రెంజిత్ శేఖర్, విజయ్ బాబు, మణికందన్ పట్టంబి, ఆనంద్ మన్మధన్, శ్రీకాంత్ మోహన్, మహేష్ నాయర్, అర్జున్ రంజన్, విష్ణు ప్రేమ్ కుమార్ లు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. ఈ అద్భుతమైన థ్రిల్లర్ చిత్రాన్ని రాహుల్ రిజి నాయర్, లిజో జోసెష్, సుజిత్ వారియర్ లు సంయుక్తంగా నిర్మించారు.

Malayala Thriller Movie Keedam Going to Release on Telugu As Keechurallu in OTT Check Details

అలాగే సిద్దార్థ ప్రదీప్ ఈ సినిమాకు సంగీతం అందించగా.. క్రిస్టీ సెబాస్టియన్ ఎడిటర్ గా పని చేశారు. అలాగే రాకేశ్ ధరన్ సినిమాటోగ్రాఫర్ గా బాధ్యతలు నిర్వహించగా.. 2022వ సంవత్సరం మే 20వ తేదీన విడుదల చేశారు. అయితే థియేటర్లలో సూపర్ డూపర్ హిట్ గా నిలిచి.. అద్భుతమైన థ్రిల్ ను అందించిన ఈ సినిమాను మూడేళ్ల తర్వాత తెలుగులో అందుబాటులోకి తీసుకు వస్తున్నారు. అలా అని నేరుగా థియేటర్లలో కాకుండా.. ఓటీటీలో విడుదల చేయబోతున్నారు.

Malayala Thriller Movie Keedam Going to Release on Telugu As Keechurallu in OTT Check Details

ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన ఈటీవీ విన్ వేదికగా.. మలయాళంల వచ్చిన ఈ కీడం సినిమాను కీచురాళ్లుగా మార్చి తెలుగులో అందుబాటులోకి తీసుకు రాబోతున్నారు. మే 30వ తేదీ నుంచి ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. థ్రిల్లర్ చిత్రాలను ఇష్ట పడే వాళ్లు ఏమాత్రం మిస్ కాకుండా ఈ క్రేజీ చిత్రాన్నీ ఇంట్లోనే కూర్చుని ఫ్యామిలీతో కలిసి కూర్చుని మరీ ఎంజాయ్ చేయండి. డోంట్ మిస్ ఇట్ దిస్ క్రేజీ ఫిల్మ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X