OTTలోకి సూపర్ హిట్ హైదరాబాద్ 'ప్రేమలు' మూవీ... ఎందులో చూడాలంటే!

సౌత్ ఇండస్ట్రీలో మంచి కంటెంట్​తో, వైవిధ్యంతో సినిమాలు తీసే చిత్ర పరిశ్రమ ఏదైనా ఉందంటే అది మలయాళ పరిశ్రమ అనే చెప్పాలి. దశాబ్దాల కాలం నుంచి కంటెంట్ పరంగా మాలీవుడ్ ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇప్పటికీ ఆ ఒరవడినే కొనసాగిస్తోంది. అయితే ఓటీటీల పుణ్యంతో మలయాళ సినిమాల స్థాయి ఇండియా వైడ్​గా ఉన్న మూవీ లవర్స్​కు మరింత తెలిసింది.

అయితే తాజాగా ఆ ఇండస్ట్రీ నుంచి రీసెంట్​గా రిలీజైన చిత్రం ప్రేమలు. అతి తక్కువ రూ.3 కోట్ల బడ్జెట్​తో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు రూ.70కోట్ల వసూళ్లను అందుకుంది. ఆ చిత్రం కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడీ సినిమా ఓటీటీ రిలీజ్​కు కూడా రెడీ అయిపోయింది. దీని ఓటీటీ రైట్స్​ను ఓ ప్రముఖ సంస్థ కొనుగోలు చేసింది. దాని గురించే ఈ కథనం.

Malayalam Blockbuster Movie Premalu Streaming on Disney Plus Hotstar OTT Full Details Here

కేవలం రూ.3 కోట్ల బడ్జెట్​తో.. మలయాళంలో ఎన్నో చిత్రాలు లో బడ్జెట్​తో తెరకెక్కి భారీ వసూళ్లను అందుకున్న సంగతి తెలిసిందే. తన్నీర్ మాతన్ దినంగళ్, ఆది కప్యారె కూటమణి, ప్రేమమ్, అమర్ అక్బర్ ఆంథోనీ, అనియత్తిప్రావు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చిత్రాలు రూ.3 కోట్ల లోపు బడ్జెట్​తో తెరకెక్కి బాక్సాఫీస్​ వద్ద రూ.50కోట్లకు పైగా వసూళ్లను సాధించాయి. ఈ కోవకు చెందిందే ప్రేమలు కూడా. ఈ చిత్రం కూడా కేవలం రూ.3 కోట్ల పెట్టుబడితో తెరకెక్కి ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజైంది. కట్​ చేస్తే రిలీజైన తక్కువ రోజుల్లో రూ.70కోట్ల వరకు వసూలు చేసి ఆశ్చర్యపరిచింది.

Malayalam Blockbuster Movie Premalu Streaming on Disney Plus Hotstar OTT Full Details Here

నిర్మాతగా పుష్ప విలన్..​ ఈ రొమాంటిక్ కామెడీ మూవీని హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్​తో తెరకెక్కడం మరో విశేషం. ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. గిరీష్ ఏడీ దర్శకత్వం వహించారు. సినిమాలో నస్లేన్, మమితా, అల్తాఫ్ సలీమ్, మీనాక్షి రవీంద్రన్, అఖిల భార్గవన్ ప్రధాన పాత్రల్లో నటించారు. భావన స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందింది. పుష్ప విలన్ ఫహద ఫాజిల్​ కూడా నిర్మాతగా వ్యవహరించారు.

ఆ రోజు తెలుగులో రిలీజ్​... ఇకపోతే ఈ చిత్రాన్ని చూసేందుకు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఈ చిత్రం తెలుగు డబ్బింగ్ హక్కులను దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కుమారుడు, యువ నిర్మాత ఎస్ఎస్ కార్తికేయ సొంతం చేసుకున్నారని తెలిసింది. తెలుగు నేటివిటీకి తగ్గట్టు సంభాషణలు సమకూర్చుతున్నట్లు తెలిసింది. మార్చి 8న శివరాత్రి కానుకగా రానందట. అదే రోజు గోపీచంద్ భీమా, విశ్వక్ సేన్ గామి కూడా విడుదల కానుంది.

Malayalam Blockbuster Movie Premalu Streaming on Disney Plus Hotstar OTT Full Details Here

ప్రముఖ సంస్థ చేతికి ఓటీటీ రైట్స్​... అయితే ఈ ప్రేమలు సినిమా ఇంకా తెలుగులో రిలీజ్ కూడా కాలేదు. అప్పుడే సినిమాకు వచ్చిన రెస్పాన్స్​తో డిమాండ్ పెరగిపోయింది. ఓటీటీ రైట్స్ డిస్నీ హాట్ స్టార్ దక్కించుకున్నట్లు తెలిసింది. తెలుగు రిలీజ్ కూడా పూర్తయ్యాక ఈ చిత్రాన్ని త్వరలోనే ఓటీటీలో రిలీజ్​ చేస్తారని తెలిసింది. చూడాలి మరి తెలుగు వెర్షన్​కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X