ఓటీటీలో మలయాళ సినిమాల హవా.. ఈ వీకెండ్ వీటిని మిస్ అవ్వకండి!

ప్రస్తుతం ఓటీటీలో మలయాళ సినిమాల హవా గట్టిగానే కొనసాగుతోంది. ఒకప్పుడు కేవలం కేరళ ప్రేక్షకులకే పరిమితమైన ఈ సినిమాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ఆదరణ పొందుతున్నాయి. ముఖ్యంగా సరికొత్త కథలు, సహజమైన నటన, డార్క్ కామెడీ, మాస్ ఎంటర్టైన్‌మెంట్ కలగలిపిన మలయాళ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఓటీటీ ద్వారా ఈ సినిమాలు మరింత విస్తృత ప్రేక్షకులకు చేరుకుంటాయి. డిజిటల్ థియేటర్ ప్లాట్‌ఫామ్స్‌లో మలయాళ కంటెంట్‌కు డిమాండ్ పెరుగుతోంది

ఈ సినిమాలు తెలుగు డబ్బింగ్ వెర్షన్ లో రావడం వల్ల తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వ్యూయర్‌షిప్ భారీగా పెరిగింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో మల్టీ-ఆడియో ఆప్షన్లు ఉండటం వల్ల భాషా భేదం లేకుండా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. మలయాళ నటుల అద్భుతమైన నటనను మన తెలుగు ఆడియోతో చూడటానికే ఫ్యాన్స్ ఇప్పుడు మొగ్గు చూపుతున్నారు. ఈ వెసులుబాటు వల్ల భాషా పరమైన ఇబ్బందులు లేకుండా సినిమాలను ఏంజాయ్ చేస్తున్నారు.

Malayalam Movies on OTT Best Trending Titles with Telugu Dubbing to Watch This Week May 2026

హై-ఎనర్జీ కామెడీలు, మోస్ట్ అవేటెడ్ సీక్వెల్స్ ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఈ వారం అమెజాన్ ప్రైమ్ వీడియో (APV)లో 'ఆవేశం' వంటి సినిమాలు రికార్డు వ్యూస్ సాధిస్తున్నాయి. విభిన్నమైన కామెడీ, మాస్ ఎలిమెంట్స్‌తో కూడిన క్యారెక్టర్లు ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. మలయాళీ ఫ్రమ్ ఇండియా కూడా సోనీ లైవ్ (SonyLIV) తెలుగు డబ్బింగ్ వెర్షన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక మే 14 నుంచి Disney+ Hotstar లో కొత్త మలయాళ కామెడీ సినిమాలు స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్నాయి.

టాప్ ట్రెండింగ్‌లో ఉన్న సినిమాల విషయానికి వస్తే.. జియో హాట్ స్టార్‌లో వాలా 2, భరతనాట్యం 2 మోహినిఆట్టం, ప్రతిచయ, సర్వం మాయ చిత్రాలు ఉన్నాయి. ఇక జీ5లో ఆడు 3, ఆషాకాల్ ఆయిరామ్, నెట్‌ఫ్లిక్స్‌లో ఎకో, అమెజాన్ ప్రైమ్‌లో లవ్లీ టాప్ ట్రెండింగ్, వ్యూవర్ షిప్‌ను సొంతం చేసుకొన్నాయి.

అందరికీ కనెక్ట్ అయ్యే కథాంశాలపైనే మేకర్స్ ఇప్పుడు ఫోకస్ పెడుతున్నారు. ముఖ్యంగా ఇంటి దగ్గర కూర్చుని సరదాగా చూసే కామెడీ సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ నెలలో ఓటీటీ యాప్స్ వాడే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా డిజిటల్ కంటెంట్ రూపొందిస్తున్నారు.ఇలా మలయాళ మేకర్స్‌కు, తెలుగు ప్రేక్షకులకు మధ్య ఉన్న అనుబంధం రోజురోజుకూ బలపడుతోంది.

పక్క భాషల్లోని క్వాలిటీ కంటెంట్‌ను తెలుగులో చూడటానికి ఆడియన్స్ ఇష్టపడుతున్నారు. ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాలు సినిమా ప్రియులకు మంచి వినోదాన్ని పంచడం ఖాయం. రాబోయే రోజుల్లో మరిన్ని క్రేజీ అప్‌డేట్స్ ఓటీటీలో సందడి చేయనున్నాయి.

Read more about: malayalam movies ott releases
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X