OTTలోకి వచ్చేసిన మరో సూపర్ హిట్ మూవీ... స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మూవీ లవర్స్ కోసం ఓటీటీలో కొత్త కొత్త సినిమాలను తీసుకువస్తున్నాయి. ముఖ్యంగా వేరే భాషల్లో హిట్ అయిన చిత్రాలను తెలుగులో డబ్బింగ్ చేసి మరీ రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా మరో మలయాళం సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పటికే మలయాళం సినిమాలను తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆదరిస్తున్నారు. మొన్నటికి మొన్నభ్రమయుగం, ప్రేమలు, మంజుమల్ బాయ్స్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎంత సక్సెస్ అయ్యోయో తెలిసిందే. ఇప్పుడు మరో సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అసలు ఆ సినిమా ఏంటి..? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది..? దాని కథేంటి? అనే వివరాలపై ఓ లుక్కేద్దాం పదండి.
ఒకప్పుడు మలయాళ చిత్రాలు అంటే అంతగా గుర్తింపు ఉండకపోయేది. కానీ కాలం మారినా కొద్ది.. అక్కడ మార్పు మొదలైంది. అక్కడి చిత్రాలను మన హీరోలు పోటీ పడి మరీ రీమేక్ చేస్తూ వచ్చారు. ఇక పాన్ ఇండియా చిత్రాలు వచ్చాక అన్ని చిత్రాలు అన్ని భాషల్లో రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. దీంతో మలయాళ చిత్రాలు తెలుగులోనూ రిలీజ్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో వాటికి తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది.

బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలుగా రిలీజ్ అవుతూ.. సంచలన విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. మలయాళీ యంగ్ డైరక్టర్స్, మేకర్స్ ఇప్పుడు సరికొత్త కంటెంటుతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. రోజూవారీ జీవితంలో ఎదురైన చిన్న చిన్న సంఘటనలను.. అంశాలను ఆధారంగా సినిమాలను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చిత్రీకరిస్తున్నారు. ఇటీవల విడుదలైన భ్రమయుగం, ప్రేమలు, మంజుమల్ బాయ్స్ చిత్రాలు ఎంత సక్సెస్ అయ్యాయో తెలిసిందే.
మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళం, కన్నడ భాషలలోకి డబ్ అయ్యి ఆ చిత్రాలు సూపర్ హిట్టుగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో హిట్ సినిమా ఓటీటీలోకి వచ్చి సందడి చేస్తుంది. అదేంటో కాదు.. రణం, ఖతర్నాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన బిజు మీనన్ నటించిన తుండు. ఆయనతో పాటు.. దసరా విలన్ షైన్ టామ్ చాకో కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా మలయాళంలో హిట్టుగా నిలిచింది.

తుండు చిత్రానికి రియాజ్ షరీష్ దర్శకత్వం వహించగా.. ఆషిక్ ఉస్మాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆషిక్ ఉస్మాన్, జిమ్షీ ఖలీద్‌లు సంయుక్తంగా రూపొందించారు. ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే మంచి టాక్ తో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చి సందడి చేస్తుంది. మలయాళ ఒరిజినల్‌తో పాటు తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది ఈ చిత్రం.
తుండు చిత్రం విషయానికి వస్తే... పోలీసుల కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం మొత్తం ఒక కానిస్టేబుల్ జీవితం చుట్టూ తిరుగుతుంటుంది. ఉద్యోగంలో పదోన్నతి కోసం నిజాయితీగా పనిచేసే అతడి జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చాయి... వాటిని ఎలా ఎదుర్కొంటాడు.. ఆ ఎదుర్కొనే సమయంలో ఎలాంటి సమస్యల్లో ఇరుక్కుంటాడు.. అనే కథలో ఈ మూవీ తెరెకక్కింది. ఈ వీకెండ్ మీరు మంచి సినిమా చూడాలనికుంటే తుండు మంచి ఛాయిస్.


Click it and Unblock the Notifications











