OTTలోకి మరో సూపర్ హిట్ సస్పెన్స్ థ్రిల్లర్.. అనుక్షణం నరాలు తెగ ఉత్కంఠ కల్గించే ఈ సినిమా ఎక్కడ చూడాలంటే?
ఈ మధ్య కాలంలో ఓటీటీలోకి అనేక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు వస్తున్నాయి. కేవలం ఓటీటీలోకే కాదు.. థియేటర్లలో కూడా ఈ చిత్రాలు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా అదిరిపోయే కథలతో వస్తూ.. సినీ ప్రియులను ఉర్రూతలూగిస్తున్నాయి. ఈ మధ్య అంతా థ్రిల్లర్ చిత్రాలను చూసేందుకే ఎక్కువ ఆసక్తి కనబరుస్తుండగా.. అలాంటి చిత్రాలతోనే వస్తున్నారు దర్శకులు. అయితే తాజాగా మలయాళంలో వచ్చిన ఓ సస్పెన్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీటీలోకి వచ్చేసింది. ఆ సినిమా ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మలయాళంలో ఇటీవలే ఓ సప్సెన్స్ ఛాంబర్ థ్రిల్లర్ మూవీ వచ్చింది. ఈ సినిమా జనవరి 5వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాగా.. బాక్సాఫీలు వద్ద భారీగానే వసూళ్లు రాబట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాకు ఆనంద్ ఎకర్షి దర్శకత్వం వహించగా.. విపరీతైన క్రేజ్ తెచ్చుకుంది. ఆటం అనే ఈ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ లాస్ ఏంజిల్స్‌లో 2023 గ్రాండ్ జ్యూరీ అవార్డును కూడా గెలుచుకుంది.

అంతేకాదండోయ్.. గోవాలో జరిగిన 54వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఇది ఓపెనింగ్ ఫీచర్ ఫిల్మ్‌గా కూడా ఎంపికైంది. జాయ్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డా.అజిత్ జాయ్ నిర్మంచిన ఈ సినిమాలో... జరీన్ షిహాబ్, వినయ్ ఫోర్ట్, కలాభవన్ షాజాన్, నందన్ ఉన్ని, సుధీర్ బాబు, నందిని గోపాలకృష్ణన్, సనోష్ మురళీ వంటి వాళ్లు ప్రధాన పాత్రలు పోషించారు. అద్భుతమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సూపర్ హిట్ ఫిల్మ్ కథ ఏంటంటే..
నాటకాలు ఆడే ఓ టీంలో మొత్తం 12 మంది పురుషులు ఉంటారు. అలాగే ఒక ఒక్క అమ్మాయి ఉంటుంది. అయితే వీరతంతా కలిసి ఓ ప్రాంతానికి వస్తారు. అక్కడే ఓ ఇంట్లో ఉండగా.. ఆ అమ్మాయిపై రేప్ జరుగుతుంది. దీంతో ఈ గ్రూపులో అందరి మధ్య గొడవలు వస్తాయి. అయితే ఈ నేరం ఎవరు చేశారనేది విషయంపై ఉత్కంఠ రేగుతుంది. సినిమా అయిపోయే వరకు నిందితుడు ఎవరో పట్టటుకునే ప్రయత్నం చేయడం... తెగ ఎగ్జైటింగ్ గా ఉంటుంది. ఇంత మంచి కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది.

ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో వేధికగా ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సినిమా కేవలం మలయాళ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది. ముందు ముందు తెలుగుతో పాటు మిగతా భాషల్లో కూడా తీసుకు వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్ నడుస్తోంది. అయితే సబ్ టైటిల్స్ చూసి సినిమాను అర్థం చేసుకునే వాళ్లు ఉంటే మాత్రం ఇప్పుడే వెళ్లి ఈ చిత్రాన్ని చూసేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











