OTT: ఓటీటీలో మమితా బైజు రొమాంటిక్ యాక్షన్ మూవీ.. ఎప్పుడు? ఎక్కడ స్ట్రీమింగ్ అంటే..

తమిళ సినీ పరిశ్రమలో భారీ అంచనాలతో వచ్చిన చిత్రం రెబెల్. సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్, ప్రేమలు సినిమాతో దక్షిణాది ప్రేక్షకులను ఆకట్టుకొన్న మమితా బైజు నటించిన ఈ మూవీ రిలీజ్‌కు ముందు అంచనాలు పెంచింది. అయితే మార్చి 22వ తేదీన రిలీజైన ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఈ సినిమా అంచనాలు మించి కలెక్షన్లు సాధించలేకపోయింది. ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో రిలీజ్‌కు సిద్దమైంది. ఈ సినిమా వివరాల్లోకి వెళితే..

పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌తోపాటు విలేజ్ పాలిటిక్స్ నేపథ్యంగా క్యూట్ లవ్ స్టోరిగా తెరకెక్కిన ఈ సినిమాను నికేష్ అనే దర్శకుడు రూపొందించారు. ఈ సినిమాను జానవేల్ రాజా నిర్మించారు. ఈ సినిమాను సుమారుగా 40 కోట్ల రూపాయలతో నిర్మించారు.

Mamitha Baiju s Rebel OTT streaming details Here is When Where to Watch Information

ఇక రెబెల్ సినిమా విషయానికి వస్తే.. మున్నార్ నుంచి ఉన్నత చదువుల కోసం పాలక్కడ్ వెళ్లిన ఓ యువకుడు సారా మేరీ జాన్‌తో ప్రేమలో పడుతాడు. ఆ ప్రాంతంలో స్థానికులకు, తమిళులకు ఘర్షణ జరుగుతుంది. ఈ ఘర్షణలో పోలీసులు, రాజకీయ నేతలు తలదూర్చుతారు. ఆ తర్వాత వారి ప్రేమకు ఎలాంటి ముగింపు లభించిందనేది ఈ సినిమా కథ.

ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టింది. తమిళనాడులో ఈ సినిమా పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఈ సినిమా సుమారుగా 5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను మాత్రమే సాధించింది. దాంతో థియేట్రికల్‌గా ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకు రావాలని ప్లాన్ చేశారు.

Mamitha Baiju s Rebel OTT streaming details Here is When Where to Watch Information

ఇక ఈ మూవీని తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీ ఏప్రిల్ చివరి వారంలో గానీ, మే మొదటి వారంలో గానీ రిలీజ్ చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాకు ఓటీటీలొనైనా రెస్పాన్స్ వస్తుందా? మమితా బైజు ఫెర్ఫార్మెన్స్ ఆకట్టుకొంటుందా? అనేది వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X