సైలెంట్‌గా OTTలోకి వచ్చేసిన మమ్ముట్టి బ్లాక్ బస్టర్ హిట్టు సినిమా.. ఎక్కడ చూడాలంటే?

ఈ మధ్య కాలంలో అనేక సినిమాలు అతి త్వరగా ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. బాక్సాఫీసును షేర్ చేసిన సూపర్ డూపర్ హిట్టు చిత్రాలు కూడా రెండు నెలలు కూడా కాకముందే ఓటీటీలో సందడి చేస్తున్నాయి. ఓటీటీ ప్రియులను తెగ అలరించడానికి సిద్ధం అయిపోతున్నాయి. అయితే తాజాగా మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన మమ్ముట్టి సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. ఎవరూ ఊహించని స్థాయిలో హిట్టు కొట్టిన ఈ చిత్రంపై ప్రపంచ వ్యాప్తంగా వివాదం రేగింది. ముఖ్యంగా కువైట్, ఖతర్ వంటి దేశాలు అయితే ఈ సినిమాను బ్యాన్ కూడా చేశాయి. అయితే ఆ సినిమా ఏంటి, ఇప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి హీరోగా వచ్చిన తాజా చిత్రం కాథల్ ది కోర్. ఈ సినిమాలో జ్యోతిక హీరోయిన్ గా నటించి మెప్పించింది. అయితే జో బేబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా హోమో సెక్సువాలిటీని ప్రోత్సహించేదిగా ఉందంటూ చాలా మంది గొడవలు చేశారు. కానీ వాటన్నిటినీ తట్టుకుని థియేటర్ల వద్ద బాక్సాఫీసును షేక్ చేసిందీ ఎమోషనల్ డ్రామా చిత్రం. ముఖ్యంగా 150 కోట్ల రూపాయల భారీ వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.

Mammootty And Jyothika Super Duper Hit Film Kaathal The Core Streaming Details

ఆదర్శ్ సుకుమారన్, పాల్సన్ స్కారియా రచించిన ఈ సినిమాను మమ్ముట్టి కంపానీ నిర్మించారు. మాథ్యూస్ పులికాన్ సంగీతం అందించగా... సాలు కె. థామస్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు స్వీకరించారు. ఫ్రాన్సిస్ లూయిస్ ఎడిటింగ్ పనులు చూసుకోగా.. జియో బాబీ దర్శకత్వం వహించారు. అయితే ఈ అద్భుతమైన సినిమాలో మమ్ముట్టి, జ్యోతికలు యాక్టింగ్ ఇరగదీశారు. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకునేలా రూపొందిన ఈ సినిమా నవంబర్ 23వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయింది.

Mammootty And Jyothika Super Duper Hit Film Kaathal The Core Streaming Details

అయితే ఈ సినిమా ఓటీటీలోకి వస్తే చూడాలని చాలా మంది తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంత కాలం పాటు ఈ సినిమా ఓటీటీ విడుదలపై ఎవరూ ఎలాంటి ప్రకటనలు చేయలేదు. ఎక్కడ వస్తుంది, ఎప్పుడు వస్తుందనే విషయాలు కూడా వెలుగులోకి రాలేవు. కానీ తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. చడీచప్పుడు లేకుండా స్ట్రీమింగ్ అయిపోతూ ఓటీటీ ప్రియులందరికీ షాకిచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో వేధికగా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు మలయాళ, కన్నడ, హిందీ, తమిళ భాషల్లో అందుబాటులో ఉంది. ఓసారి మీరు కూడా ఈ సినిమాను చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X