వందకోట్లు వసూలు చేసిన మమ్ముట్టి సినిమా ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి హీరోగా వచ్చిన తాజా చిత్రం కన్నూర్ స్క్వాడ్. మమ్ముట్టి కంపెనీ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకు రాబి వర్గీస్‌ రాజ్‌ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మమ్ముట్టి, రోనీ డేవిడ్ రాజ్, అజీస్, శబరీష్ వర్మ, కిశోర్ ప్రధాన పాత్ర‌ల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీన విడుదల చేశారు. మమ్ముట్టి హీరోగా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. బాక్సాఫీసును షేక్ చేస్తూ.... రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.

కన్నూర్ స్క్వాడ్ సినిమా కథ ఏంటంటే?: కేరళలోని కన్నూర్ జిల్లాలో నేరాలకు అరికట్టడానికి నలుగురు సభ్యులతో ఏఎస్సై జార్జ్ మార్టిన్ (మమ్ముట్టి) నేతృత్వంలో కానిస్టేబుళ్లు జయకుమార్ (రోనీ), షఫీ (శబరీష్), డ్రైవర్ జోస్ (అజీస్) తో ఓ బృందాన్ని ఎస్పీ ఏర్పాటు చేస్తారు. ఒకరు ఇసుక మాఫియా నుంచి లంచం తీసుకోవడం, ఆ వీడియో లీక్ కావడంతో ఆ బృందాన్ని పక్కన పెట్టేసి వేర్వేరు పోలీస్ స్టేషన్లకు బదిలీ చేస్తారు. కాసర్‌ గోడ్ ప్రాంతంలో జరిగిన రాజకీయ నాయకుడి హత్య కేసును ఇన్వెస్టిగేట్ బాధ్యత 'కన్నూర్ స్క్వాడ్' చేతిలో పెడతారు.

Mammootty Kannur Squad Movie Will Be Streaming on Disney Plus Hotstar

రాజకీయ ఒత్తిళ్ల కారణంగా పది రోజుల్లో పట్టుకోవాలని చెబుతారు. అసలు, ఆ హత్య ఎవరు చేశారు, వాళ్లను జార్జ్ అండ్ టీమ్ పట్టుకున్నారా లేదా దర్యాప్తులో వాళ్ళకు ఎదురైనా సవాళ్ళు ఏమిటనేది మిగతా సినిమా కథ. అయితే ఈ టీంకు లీడ్ గా మమ్ముట్టి అదరగొట్టారు. కథతో పాటు నటీనటులు యాక్టింగ్ అద్భుతంగా ఉండడంతో సినిమా హిట్టు అయింది. అయితే నెలన్నర రోజుల క్రితం విడుదల అయిన ఈ సినిమాకు సంబంధించి ఓ లేటెస్ట్ అప్ డేట్ వెలుగులోకి వచ్చింది.

కన్నూర్ స్క్వాడ్ సినిమాను ప్రముఖ ఓటీటటీ సంస్థ అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల చేయబోతున్నారు. నంవబర్ 17వ తేదీ నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కాబోతుంది. అయితే ఈ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం నవంబర్ 10వ తేదీ నుంచి విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ ఈరోజు హాట్ స్టార్ అఫీషియల్ గా ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీని ప్రకటించింది. ప్రస్తుతానికి మలయాళ వెర్షన్ మాత్రమే ఓటీటీ వేదికగా రిలీజ్ కాబోతున్నట్లు స్పష్టం చేసింది. తెలుగుతో పాటు మిగతా భాషల సంగతి గురించి మాత్రం ఇంకా ఎలాంటి మసమాచారం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X