OTTలోకి వచ్చేసిన సూపర్ హిట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ... డోంట్ మిస్!
ఓటీటీలో కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. ఇక ఈ వీకెండ్ కు సినిమా లవర్స్ కోసం.. అటు థియేటర్లలో మంచి సినిమాలు ఉన్నాయి. ఇటు ఓటీటీ సంస్థలు కూడా మంచి కంటెంట్ సినిమాలు తీసుకువచ్చాయి. అందులో భాగంగానే ప్రముఖ ఓటీటీ సంస్థ ఓ క్రైమ్ ఇన్వేస్టిగేషన్ థ్రిల్లర్ ను తీసుకువచ్చింది. ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుంది. అసలు ఆ సినిమా ఏంటి.. ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది.. ఆ సినిమా కథేంటి అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ వేదికగా కొత్త కొత్త సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. వేరే భాషల సినిమాలు కూడా తెలుగులో డబ్ అయి.. తెలుగు ప్రేక్షకుల కోసం తీసుకువస్తున్నారు. ఇప్పుడు మరో లేటెస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కన్నూర్ స్వ్కాడ్ తెలుగులో అందుబాటులోకి వచ్చింది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన తాజా చిత్రమే ఈ కన్నూర్ స్క్వాడ్. ఈ సినిమాకు వర్గీస్ రాజ్ దర్శకత్వం వహించారు.

మమ్ముట్టి నటించిన ఈ క్రైమ్ ఇన్వేస్టిగేషన్ థ్రిల్లర్ లో రోనీ డేవిడ్ రాజ్, అజీస్ నెడుముంగాద్, కిషోర్, షబరీష్ వర్మ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా మలయాళ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. కన్నూర్ స్క్వాడ్ మూవీని రూ. 25 కోట్లతో నిర్మించారు.
ఇక ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా వంద కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి రికార్డ్స్ కొల్లగొట్టింది. అయితే మలయాళ ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధం అయింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ పామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ సినిమాను భారీ ధరకు డిజిటల్ ప్రిమియర్ హక్కులను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చి ప్రేక్షుకలను అలరిస్తుంది.
నవంబర్ 17 అర్ధరాత్రి నుంచి కన్నూర్ స్క్వాడ్ డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ మూవీ అందుబాటులోకి వచ్చింది. కేరళలో జరిగిన యదార్థ సంఘటలను ఆధారంగా చేసుకుని కన్నూర్ స్క్వాడ్ సినిమాను తెరకెక్కించారు.

ఇక కన్నూర్ స్క్వాడ్ సినిమా కథ విషయానికి వస్తే... ఓ వ్యాపార వేత్త మర్డర్ మిస్టరీని ఛేదించేందుకు ప్రభుత్వం కన్నూర్ స్క్వాడ్ అనే టీమ్ ను ఏర్పాటు చేస్తుంది. ఈ టీమ్ కు హెడ్ గా హెడ్‌గా జార్జ్ (మమ్ముట్టి) ఉంటారు. విచారణలో అతనికి ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నాడు.. అసలు మర్డర్ చేసిన వ్యక్తిని పట్టుకున్నాడా... లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమాలో మమ్ముట్టి స్టైల్, యాక్షన్ ఆకట్టుకుంటాయి. ఇక ఈ మూవీని ఓటీటీలో మిస్ అయితే కనుగ ఓటీటీలో చూసేయండి.


Click it and Unblock the Notifications











