OTTలోకి సూపర్ హిట్ డార్క్ ఫాంటసీ మిస్టరీ థ్రిల్లర్​ మూవీ... స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీ ఆడియెన్స్​ను అలరించేందుకు మరో సరికొత్త డార్క్ ఫాంటసీ మిస్టరీ హారర్ థ్రిల్లర్​ రెడీ అయింది. రీసెంట్​గానే ఈ చిత్రం థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్​ను అందుకుంది. దీంతో ఈ చిత్రాన్ని ఇంట్లో కూడా కూర్చొని చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. అందుకే ఈ చిత్రాన్ని త్వరగానే డిజిటల్ ప్లాట్​ఫామ్​లోకి విడుదల చేసేందుకు రెడీ అయిపోయారు మేకర్స్​. ఇంతకీ ఆ సినిమా ఏంటి? ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో వివరాలను తెలుసుకుందాం..

మెగాస్టార్ మమ్ముట్టి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రయోగాత్మక కథలకు, వైవిధ్యమైన పాత్రలకు కేరాప్ అడ్రెస్​. రీసెంట్​గా ఆయన నుంచి వచ్చిన మరో లేటెస్ట్ ఎక్స్​పెరిమెంట్​ మూవీ భ్రమయుగం. ఇదో పూర్తి భిన్నమైన డార్క్‌ ఫాంటసీ హారర్‌ థ్రిల్లర్‌. పూర్తిగా బ్లాక్ అండ్ వైట్​లో రూపొందిన ఈ చిత్రం విడుదల కాక ముందే ఓ ప్రత్యేకమైన ఆసక్తిని రేకెత్తించింది. ఎందుకంటే అత్యున్నత టెక్నాలజీ అందుబాటులో ఉన్న సమయంలోనూ ఆయన ఈ టైప్​ మూవీతో ఆడియెన్స్​ ముందుకు వచ్చారంటే పెద్ద సాహసం అనే చెప్పాలి. పైగా సినిమాను కేవలం మూడే పాత్రలు, ఓ పాడుబడ్డ ఇంటి చూట్టూనే నడిపించారు. ఇందులో మమ్ముట్టి కూడా ఓ భిన్నమైన పాత్ర పోషించారు.

Mammotty Bramayugam Mystery Horror Movie Streaming on Sony Liv OTT From March 15 Full Details Here

ఈ చిత్రం మొదట మలయాళలంలో ఫిబ్రవరి 17న విడుదలై బాక్సాఫీస్ ముందు మంచి హిట్ టాక్​ను దక్కించుకుంది. ఆ తర్వాత తెలుగులోనూ ఫిబ్రవరి 23న రిలీజై మంచి ఆదరణ దక్కించుకుంది. కొడుమన్‌ పాత్రలో మమ్ముట్టి నటన, ఆయన కనిపించిన తీరు, ఆహార్యం, పలికించిన హావభావాలు అన్నీ ప్రేక్షకుల్ని బాగా మురిపించాయి. ముఖ్యంగా క్లమైక్స్​లో ఆయన యాక్టింగ్​ అందర్నీ కట్టిపడేస్తుంది. ఫైనల్​గా భ్రమయుగం అనే ఓ ఊహాత్మక ప్రపంచం ప్రేక్షకుల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లి ఓ కొత్త అనుభూతిని పంచుతూ ఆడియెన్స్​కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్​పీరియన్స్​ను ఇచ్చింది. దీంతో చాలా మందిలో సినిమాపై మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది.

అలా థియేటర్లలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని ఇప్పుడు త్వరలోనే ఓటీటీలోకి విడుదల చేసేందుకు రెడీ అయ్యారు మేకర్స్. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ సొంతం చేసుకుంది. మార్చి 15నుంచి మూవీ స్ట్రీమింగ్​కు అందుబాటులోకి తీసుకురానుంది. తాజాగా దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్​మెంట్ కూడా వచ్చింది. రాహుల్ సదాశివన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. చిత్రంలో అర్జున్ అశోకన్ , సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ కనిపించారు. నైట్ షిఫ్ట్ స్టూడియోస్‌, వైనాట్ స్టూడియోస్ బ్యానర్స్ పై చక్రవర్తి రామచంద్ర, ఎస్. శశికాంత్ సినిమాకు ప్రొడ్యూసర్​గా వ్యవహరించారు.

Mammotty Bramayugam Mystery Horror Movie Streaming on Sony Liv OTT From March 15 Full Details Here

కథ విషయానికొస్తే... 17వ శతాబ్దంలో మలబారు తీరం దగ్గర్లోని ఓ రాజ్యంలో రాజు దగ్గర గాయకుడిగా దేవన్(అర్జున్ అశోకన్) పనిచేస్తుంటాడు. అతడు రాజు దగ్గరి నుంచి తప్పించుకుని ఇంటికి వెళ్తుండగా అడవిలో తప్పిపోతాడు. అనంతరం కుముదన్ పొట్టి (మమ్ముట్టి) ఉంటున్న ఇంటికి వెళ్తాడు. అక్కడ అనుకోని పరిస్థితుల్లో చిక్కుకుపోతాడు. ఎంత ప్రయత్నించినా అక్కడే ఉండిపోతాడు. అసలు అతడు చివరకు బయటపడ్డాడా? కుముదన్​ మమ్ముట్టి కథ ఏంటన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X