OTTలోకి మరో సూపర్ హిట్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలో మలయాళ చిత్రాలకు ప్రస్తుతం మంచి ఆదరణ లభిస్తుంది. అక్కడి చిన్న చిత్రాల కంటెంట్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద మరోవైపు ఓటీటీలో మలయాళీ సినిమాలు దూసుకుపోతున్నాయి. ఇటీవలే భారీ విజయాన్ని అందుకున్న ప్రేమలు సినిమాలు తెలుగులో రిలీజ్ చేసేందుకు రెడీ చేస్తున్నారు మేకర్స్. ఇప్పుడు తాజాగా మరో సూపర్ హిట్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. అసలు ఆ సినిమా ఏంటి.. ఎందులో స్ట్రీమింగ్ అవుతుందనే వివరాలు ఈ స్టోరీలో చూసేద్దాం పదండి.
మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి, నటుడు జయరాం ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం అబ్రహాం ఓజ్లర్. ఈ మూవీ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కింది. ఇక ఈ సినిమాలో అనూప్ మేనన్, అనస్వర రాజన్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మిథున్ మాన్యువల్ థామస్ దర్శకత్వం వహించారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజ్ అయింది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చింది.

ఈ సినిమాకు మిధున్ మాన్యువల్ థామస్ దర్శకత్వం వహించక ఆయన కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచింది. మమ్ముట్టి అతిథిగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే మంచి ఆదరణ లభించింది. దీంతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది..
దాదాపు రూ. 40 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్స్ కొల్లగొట్టింది. అయితే ఈ సినిమా గతంలోనే ఓటీటీలోకి వచ్చి స్ట్రీమింగ్ అవుతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరిలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇక ఇప్పుడు మరో ఓటీటీలోకి రాబోతున్నట్లు ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ సినిమా హక్కులను సొంతం చేసుకుంది.

అబ్రహాం ఓజ్లర్ సినిమా మార్చి 20వ తేదీ నుంచి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా వెల్లడించింది. ఈ సినిమాలో అర్జున్ అశోకన్, ఆర్య సలీం, సైజు కురుప్ కీలకపాత్రల్లో నటించారు.
అబ్రహాం ఓజ్లర్ సినిమా కథ విషయానికి వస్తే.. అబ్రహం (జయరాం) భార్య పిల్లలను కొందరు కిడ్నాప్ చేస్తారు. అయితే వారు కనిపించకపోయినా అబ్రహం వారంతా తన దగ్గరే ఉన్నట్లు ఊహించుకుంటాడు. మరోవైపు కొందరు వ్యక్తులు వరుసగా హత్యలకు గురవుతుంటారు. మృతుల వద్ద హ్యాపీ బర్త్ డే అంటూ రక్తంతో రాసిన పేపర్లు లభిస్తాయి. అయితే వారిని చంపిందెవరు ? ఈ సినిమాలో అలెక్స్ (మమ్ముట్టి) హంతకుడిగా మారడానికి కారణం ఏంటి.. అబ్రహం భార్య పిల్లలు ఏమయ్యారనేది ఈ సినిమా కథ.


Click it and Unblock the Notifications











